TE/Prabhupada 0620 - తన గుణ మరియు కర్మ ప్రకారం ఆయన ఒక నిర్దిష్ట వృత్తిపరమైన సేవలో వినియోగించబడి ఉన్నాడు



Lecture on SB 1.7.36-37 -- Vrndavana, September 29, 1976


కేవలం కృష్ణుడు మాత్రమే మిమ్మల్ని కాపాడుతాడు - ఎవ్వరూ కాపాడలేరు. ఇది మీకు తెలిస్తే, మీరు ప్రమత్త కాదు. మీకు తెలియకపోతే, మీరు ఒక మూర్ఖుడు అయితే, అప్పుడు మీరు ప్రమత్త. కేవలం కృష్ణుడు. అందువలన కృష్ణుడు అన్నాడు, ఆయన హామీ ఇచ్చాడు, అది sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) Suhṛdaṁ sarva-bhūtānām ( BG 5.29) నేను ప్రతి ఒక్కరి స్నేహితుడను. నేను మీకు రక్షణ కల్పిస్తాను. Ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi. కాబట్టి మీరు కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలి; లేకపోతే మీరు ఒక ప్రమత్త, మూర్ఖుడు, మూఢా. కృష్ణుడు సలహా ఇస్తాడు "దీన్ని చేయండి." కానీ మనము మూర్ఖులము, ప్రమత్త. మనము "నా కుమారుడు నాకు రక్షణ ఇస్తారు, నా భార్య రక్షణ ఇస్తూంది, నా స్నేహితుడు నాకు రక్షణ కల్పిస్తాడు, నా ప్రభుత్వం రక్షణనిస్తుంది. " ఇవి అన్ని అర్థం లేనివి, ప్రమత్త. ఇది ప్రమత్త యొక్క అర్థం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Pramattaḥ tasya nidhanaṁ paśyann api. ( SB 2.1.4)

ఇంకొక ప్రమత్త, ఎవరైతే పిచ్చిగా ఇంద్రియ తృప్తి కొరకు. Nūnaṁ pramattaḥ kurute vikarma ( SB 5.5.4) మరొక శ్లోకము ఉంది, న్యూన ప్రమత్త. ఎవరైతే ప్రమత్తనో, వారు జీవితములో బాధ్యత లేని వారు, కొన్నిసార్లు అనవసరంగా దొంగిలించడం మరియు చాలా తప్పుడు విషయాలు కొన్ని చేయడం - వికర్మ. ఎందుకు? ఇప్పుడు ప్రమత్త, ఆయన కూడా వెర్రివాడు. Nūnaṁ pramattaḥ kurute vikarma ( SB 5.5.4) ఎందుకు అతను శిక్షింపబడే ప్రమాదం తీసుకుంటున్నాడు? ఒక వ్యక్తి దొంగిలిస్తున్నాడు అని అనుకుందాం. అతను శిక్షించబడతాడు. రాష్ట్ర చట్టాలు లేదా ప్రకృతి లేదా భగవంతుని యొక్క చట్టాలచే అతడు శిక్షించబడతాడు. ఆయన రాష్ట్ర చట్టాల నుండి తప్పించుకోగలడు, కానీ అతడు ప్రకృతి లేదా భగవంతుని యొక్క చట్టాల నుండి తప్పించుకోలేడు. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi ( BG 3.27) ఇది సాధ్యం కాదు. ప్రకృతి యొక్క చట్టాల లాగే: మీకు ఏదైనా వ్యాధి సోకితే, మీరు శిక్షించబడాలి. మీరు ఆ వ్యాధి వలన బాధపడతారు. ఇది శిక్ష. మీరు తప్పించుకోలేరు. అదేవిధముగా, మీరు ఏదైనా చేస్తే, kāraṇaṁ guṇa-saṅgo 'sya ( BG 13.22) మీరు పిల్లి కుక్కలాగా జీవిస్తూ ఉంటే, అది అంటువ్యాధి, గుణ, అజ్ఞానం యొక్క గుణాలు. అప్పుడు మీ తదుపరి జీవితములో మీరు ఒక కుక్క అవుతారు. మీరు శిక్షించబడాలి. ఇది ప్రకృతి చట్టం.

కాబట్టి ఈ చట్టాలన్నీ తెలియని వ్యక్తి, ఆయన చాలా పాపములు చేస్తాడు, వికర్మ. కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే సూచించబడినది. గుణ-కర్మ. Guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) కర్మ అంటే అర్థం, అది శాస్త్రములో చెప్పినట్లుగా, మీరు కొన్ని రకాలైన ప్రకృతి గుణాలను అభివృద్ధి చేసుకున్నందున, మీ కర్మ ఆ ప్రకారం ఉంది: బ్రాహ్మణ-కర్మ, క్షత్రియ-కర్మ, వైశ్య-కర్మ. మీరు అనుసరిస్తే... ఆధ్యాత్మిక గురువు మరియు శాస్త్రం యొక్క బాధ్యత, తెలియజేయుటకు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, "మీరు ఇలా పని చేయండి." "మీరు ఒక బ్రాహ్మణుని వలె పని చేయండి," మీరు ఒక క్షత్రియుడిలా పని చేయండి, "మీరు ఒక వైశ్యుని లాగా పని చేయండి," ఇతరులు, "శూద్రుని లాగా." ఈ విభజన ఆధ్యాత్మిక గురువు చేస్తారు. ఎలా? Yasya yal lakṣaṇaṁ proktaṁ varṇābhivyañjakam ( SB 7.11.35) ఆధ్యాత్మిక గురువు చెప్తాడు "మీరు ఇలా పని చేయండి." కాబట్టి అది నిర్ణయించబడాలి. అది కర్మ, గుణ-కర్మ. ఆ లక్షణాలను అతను కలిగి ఉన్నాడని ఆధ్యాత్మిక గురువు చూస్తాడు. అది సహజమైనది. పాఠశాలలో, కళాశాలలో వలె, కొంత మంది శాస్త్రవేత్తగా శిక్షణ పొందుతారు, కొంత మంది ఒక ఇంజనీర్గా, ఒక వైద్య నిపుణుడిగా, న్యాయవాదిగా శిక్షణ పొందుతారు. ధోరణి ప్రకారం, విద్యార్థి యొక్క ఆచరణాత్మక మనస్తత్వం ప్రకారం, "మీరు ఈ విభాగామును తీసుకోండి" అని సూచిస్తారు. అదేవిధముగా, సమాజంలోని ఈ నాలుగు విభాగాలు, ఇది చాలా శాస్త్రీయమైనది. కాబట్టి గురు ఉపదేశము ద్వారా, ఆయన గురుకులములో ఉన్నప్పుడు, అతను ఒక ప్రత్యేకమైన సేవను ఇవ్వబడతాడు అతను దానిని విశ్వసనీయంగా చేస్తే... Sva-karmaṇā tam abhyarcya ( BG 18.46) వాస్తవ ఉద్దేశం కృష్ణ చైతన్యము. తన గుణ మరియు కర్మ అనుసారం ఆయన ఒక నిర్దిష్ట వృత్తిపరమైన సేవలో వినియోగించబడి ఉన్నాడు.

ఏదీ చెడ్డది కాదు అది కృష్ణుడి సంతృప్తి కోసం ఉద్దేశించబడినది అయితే. Ataḥ pumbhir dvija-śreṣṭhā varṇāśrama-vibhāgaśaḥ ( SB 1.2.13) అక్కడ తప్పక వర్ణాశ్రమ -విభాగం ఉండాలి. కానీ వర్ణాశ్రమ యొక్క లక్ష్యం ఏమిటి? కేవలం ఒక బ్రాహ్మణుడు కావడంతో అతను విజయవంతమవుతాడా? లేదు కృష్ణుడిని తృప్తిపరచకపోతే ఎవరూ విజయవంతం కాలేరు. ఇది వాస్తవమైన విజయము