TE/Prabhupada 0627 - నూతనోత్సాహం పొందకుండా, ఈ ఉత్కృష్టమైన విషయం అర్థం కాదు



Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972


ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు యొక్క లక్షణం ఏమిటి? ప్రతిఒక్కరు ఆధ్యాత్మిక గురువుగా మారాలనుకుంటున్నారు. కాబట్టి అది కూడా చెప్పబడింది. శబ్దే పరే చ నిష్ణాతమ్ వైదిక సాహిత్య సముద్రంలో పూర్తిగా స్నానం చేసిన వ్యక్తి, శబ్దే పరే చ నిష్ణాతమ్. ఉదాహరణకు మీరు స్నానం చేస్తే, మీరు సేద తీరుతారు. మీరు మంచిగా స్నానం చేస్తే, మీరు నూతనోత్సాహం పొందుతారు. శబ్దే పరే చ నిష్ణాతమ్. నూతనోత్సాహం పొందకుండా, ఈ ఉత్కృష్టమైన విషయం అర్థం కాదు. గురువు, లేదా ఆధ్యాత్మిక గురువు, వేదముల జ్ఞానం యొక్క సముద్రంలో స్నానం చేయడం ద్వారా రిఫ్రెష్ అవ్వాలి. ఫలితమేమిటి? శబ్దే పరే చ నిష్ణాతమ్ బ్రహ్మణ్యే ఉపసమాశ్రయమ్ అలా పరిశుభ్రత అయిన తరువాత, ఆయన ఏ భౌతిక కోరికలు లేకుండా, అత్యున్నత సంపూర్ణ సత్యము యొక్క ఆశ్రయం తీసుకుంటాడు. అతడు ఎటువంటి భౌతిక కోరికలను కలిగి లేడు; ఆయన కేవలం కృష్ణుడి లేదా పరమ సత్యంలో ఆసక్తిని కలిగి ఉంటాడు . ఇవి గురువు లేదా ఆధ్యాత్మిక గురువు యొక్క లక్షణాలు,.

కాబట్టి అర్థం చేసుకోవడానికి... కృష్ణుడు అర్జునునికి బోధిస్తున్నట్లుగానే. దీనికి ముందు, కృష్ణుడికి స్వయంగా శరణాగతి పొందాడు. Śiṣyas te 'haṁ śādhi māṁ prapannam ( BG 2.7) వారు స్నేహితులు అయినప్పటికీ, కృష్ణుడు అర్జునుడు స్నేహితులు. మొదట, వారు స్నేహితులు లాగా మాట్లాడుకుంటున్నారు, మరియు అర్జునుడు కృష్ణుడితో వాదిస్తున్నాడు. ఈ వాదనకు విలువ లేదు ఎందుకంటే నేను అసంపూర్ణంగా ఉంటే నా వాదన యొక్క అర్థం ఏమిటి? నేను ఏదైతే వాదిస్తానో, అది కూడా అసంపూర్ణంగా ఉంది. కాబట్టి అసంపూర్ణ వాదన ద్వారా సమయం వృధా అవుతుంది తప్ప, ఉపయోగం ఏమిటి? ఇది పద్ధతి కాదు. పద్ధతి మనము ఒక ఖచ్చితమైన వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. తన ఉపదేశమును యథాతథంగా తీసుకోవాలి. అప్పుడు మన జ్ఞానం ఖచ్చితమైనది. ఏ వాదన లేకుండా. మనము వేదముల జ్ఞానాన్ని ఆవిధముగా అంగీకరిస్తాము. ఉదాహరణకు, ఒక జంతువు యొక్క మలం. ఇది అపవిత్రమైనదని వేదముల సాహిత్యంలో చెప్పబడింది. మీరు మలమును తాకినట్లయితే... వేదముల పద్ధతి ప్రకారం, నేను మలవిసర్జన చేసిన తరువాత కూడా, నేను స్నానం చేయాలి. ఇతరుల మలం గురించి ఏమి మాట్లాడాలి? ఇది పద్ధతి. మలం అపవిత్రమైనది. ఒకరు, మలము తాకిన తరువాత, ఆయన స్నానం చేయాలి. ఇది వేదముల ఉత్తర్వు. కాని మరో పరిస్థితిలో ఆవు యొక్క మలం పవిత్రమైనదని చెప్పబడింది, కొన్ని మలిన ప్రదేశాలలో ఆవు పేడను అలకితే అది పవిత్రమైనదిగా అవుతుంది. ఇప్పుడు, మీ వాదన ద్వారా, మీరు "జంతువు యొక్క మలం అపవిత్రం. అని చెప్పినట్లైతే ఎందుకు ఒక పరిస్థితిలో పవిత్రమైనది మరొక పరిస్థితిలో అపవిత్రమైనది అని చెప్పబడింది? ఇది వైరుధ్యం." కాని ఇది వైరుధ్యం కాదు. మీరు ఆచరణాత్మకంగా ప్రయోగం చేయండి. మీరు ఆవు పేడను తీసుకొని ఎక్కడైనా అలికితే, అది పవిత్రమైనదని మీరు కనుగొంటారు. వెంటనే పవిత్రమౌను. ఇది వేదముల ఉత్తర్వు. అవి పరిపూర్ణ జ్ఞానం. వాదిస్తూ మరియు అహంకారముతో సమయము వృధా చేసుకునే బదులు, మీరు పరిపూర్ణ జ్ఞానాన్ని అంగీకరిస్తే, వేదముల సాహిత్యంలో పేర్కొన్నట్లు, అప్పుడు మనము పరిపూర్ణ జ్ఞానం పొందుతాము, మన జీవితం విజయవంతము అవుతుంది. ఆత్మ ఎక్కడ ఉంది అనేదానిని కనుగొనడానికి శరీరంలో ప్రయోగం చేయడానికి బదులుగా... ఆత్మ ఉంది, కాని అది చాలా చిన్నది దానిని మీ మొద్దుబారిన కళ్ళతో చూడటం సాధ్యం కాదు కాబట్టి. ఏదైనా సూక్ష్మదర్శిని లేదా ఏ యంత్రం అయినా, ఎందుకంటే అది జుట్టు యొక్క కొన పైన ఉన్న పదివేల భాగాలలో ఒక భాగం. కాబట్టి అటువంటి యంత్రం లేదు. మీరు చూడలేరు. కాని అది ఉంది. లేకపోతే, మృతదేహం మరియు జీవి ఉన్న శరీరం మధ్య వ్యత్యాసాన్ని మనం ఎలా కనుగొనవచ్చు?