TE/Prabhupada 0657 - అందువల్ల ఈ ఆలయం మాత్రమే ఏకాంత ప్రదేశం ఈ యుగమునకు
Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969
భక్తుడు: "యోగా సాధన చేసేందుకు, ఒకరు ఏకాంత ప్రదేశమునకు వెళ్ళాలి... ( BG 6.11) "
ప్రభుపాద: ఈ యోగ సాధన ఎలా చేయాలి అనే దానికి సూచన. మీ దేశంలో, యోగాభ్యాసం బాగా ప్రాచుర్యం పొందింది.యోగా సంఘాలు అని పిలవబడేవి అనేకము ఉన్నాయి. కానీ ఇక్కడ యోగా సాధన ఎలా చేయాలి అనే దానికి భగవంతుడు ఇచ్చిన సూచన ఉంది. కొనసాగించు.
తమాల కృష్ణ: "ఒక ఏకాంత ప్రదేశంలోకి వెళ్లి, భూమిపై కుశగడ్డిని పరచాలి, తరువాత దానిని ఒక జింక చర్మము మరియు మృదువైన వస్త్రంతో కప్పి ఉంచాలి. ఆసనము చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ ఎత్తులో ఉండకూడదు, ఒక పవిత్రమైన ప్రదేశములో ఉండాలి. యోగి అప్పుడు చాలా నిటారుగా కూర్చుని ఉండాలి, మనస్సు ఇంద్రియాలను నియంత్రించటం ద్వారా యోగా సాధన చేయాలి, హృదయాన్ని పవిత్రము చేసి, ఒకే విషయము మీద మనస్సును లగ్నము చేయాలి. "
ప్రభుపాద: మొదటి సూచన ఎక్కడ కూర్చోవాలి ఎలా కూర్చోవాలి కూర్చోనే భంగిమ మీరు కూర్చుని యోగా సాధన చేసే చోటును ఎంచుకోవాలి. ఇది మొదటి సూచన. కొనసాగించు.
తమాల కృష్ణ: "భాష్యము: పవిత్ర ప్రదేశము అనగా పవిత్ర స్థలాలు అని అర్థము. భారతదేశంలో, యోగులు, ఆధ్యాత్మిక వాదులు లేదా భక్తులు అందరూ ఇల్లు వదిలి వెళ్ళుతారు, ప్రయాగా, మధురా, వృందావన, హృషికేస, హరి ద్వార్ వంటి పుణ్య స్థలములలో నివసిస్తారు అక్కడ యోగ సాధన చేస్తారు."
ప్రభుపాద: ఇప్పుడు, మీరు పవిత్ర ధామమును కనుగొనాలి అనుకుందాం. ఈ యుగములో, పవిత్ర స్థలాలను కనుగొనడానికి ఎంతమంది వ్యక్తులు సిద్ధముగా ఉంటారు? తన జీవనోపాధి కోసం ఆయన ఒక రద్దీ నగరంలో నివసిస్తున్నాడు. పవిత్ర స్థలముల ప్రశ్న ఎక్కడ ఉంది? మీరు ఒక పవిత్ర స్థలమును కనుగొనలేకపోతే, అప్పుడు యోగాను ఎలా సాధన చేస్తారు? ఇది మొదటి సూచన. అందువలన, ఈ భక్తి-యోగ పద్ధతి, పవిత్ర ప్రదేశము ఈ ఆలయం. మీరు ఇక్కడ నివసిస్తున్నారు, ఇది నిర్గుణ, ఇది ఆధ్యాత్మికము. వేదముల ఉత్తర్వు అనేది నగరం , రజో గుణములో ఉన్న ప్రదేశం. అడవి సత్వ గుణములో ఉన్న ప్రదేశము. ఆలయం ఆధ్యాత్మిక ప్రదేశము. మీరు ఒక పట్టణంలో లేదా నగరములో నివసిస్తుంటే, ఇది ఒక రజో గుణముతో ఉన్న ప్రదేశం. మీరు ఒక రజో గుణముతో ఉన్న ప్రదేశంలో నివసించకూడదనుకుంటే, మీరు ఒక అడవికి వెళ్ళండి. ఇది సత్వ గుణ ప్రదేశము. కానీ ఆలయం, ఒక భగవంతుని ఆలయం, ఈ రజో గుణము మరియు సత్వ గుణమునకు అతీతముగా ఉంది. అందువల్ల ఈ ఆలయం మాత్రమే ఏకాంత ప్రదేశం ఈ యుగమునకు. మీరు అడవిలో ఏకాంత ప్రదేశమునకు వెళ్లలేరు. అది అసాధ్యం. మీరు ఒక యోగ అభ్యాస తరగతి ప్రదర్శన అని పిలవబడేది చేస్తే , అన్ని రకాల అర్థంలేని అంశాలలో మునిగిపోయి ఉంటే, అది యోగ సాధన కాదు . ఇక్కడ యోగా సాధన ఎలా చేయాలో అనే సూచన ఉంది. కొనసాగించు. అవును.
తమాల కృష్ణ: "అందువల్ల, బృహన్నారదీయ పురాణములో, ఇది చెప్పబడినది, కలి యుగములో, ప్రస్తుత యుగములో, సాధారణంగా ప్రజలు తక్కువ-వయస్సు కలిగి ఉన్నపుడు, ఆధ్యాత్మిక పరిపూర్ణములో నెమ్మదిగా, ఎల్లప్పుడూ వివిధ ఆందోళనలతో కలవరపడి ఉంటారు, ఆధ్యాత్మిక పరిపూర్ణము ఉత్తమ మార్గము అని, భగవంతుని యొక్క పవిత్ర నామము కీర్తన చేయడము. వివాదం మరియు వంచన ఉన్న ఈ యుగంలో, విముక్తి యొక్క ఏకైక మార్గం భగవంతుని యొక్క పవిత్రమైన నామమును చేయడము. విజయానికి మరో మార్గం లేదు. "
ప్రభుపాద: అవును. ఇది బృహన్నారదీయ పురాణములో సూచన.
- harer nāma harer nāma harer nāmaiva kevalam
- kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
- (CC Adi 17.21)
హారేర్ నామ, కేవలం భగవంతుని యొక్క పవిత్ర నామము కీర్తన చేయడము. ఇది ఆత్మ సాక్షాత్కారము లేదా ఏకాగ్రత లేదా ధ్యానం యొక్క ఏకైక పద్ధతి. ఇతర ప్రత్యామ్నాయము లేదు, ఏ ఇతర ప్రత్యామ్నాయం, ఏ ఇతర ప్రత్యామ్నాయం లేదు. ఇతర పద్ధతులు సాధ్యపడవు. అది ఒక పిల్ల వాడు కూడా పాల్గొనడానికి చాలా బాగుంటుంది. ఇది విశ్వవ్యాప్తము. (ముగింపు)