TE/Prabhupada 0660 - మీ లైంగిక జీవితాన్ని మీరు నిగ్రహించుకోగలిగితే చాలా శక్తివంతమైన వ్యక్తిగా మారతారు

From Vanipedia


మీ లైంగిక జీవితాన్ని మీరు నిగ్రహించుకోగలిగితే చాలా శక్తివంతమైన వ్యక్తిగా మారతారు
- Prabhupāda 0660


Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


తమాల కృష్ణ: పదమూడు మరియు పధ్నాలుగు: "ఒక వ్యక్తి తన శరీరం యొక్క, మెడ, తల నిటారుగా ఒక సరళ రేఖలో ఉంచాలి ముక్కు యొక్క కొన మీద స్థిరముగా తదేకంగా చూడాలి. అందువల్ల, ఉద్రేకములేని, జయించబడిన మనస్సుతో, భయము లేకుండా, బ్రహ్మచర్యము పాటించుచూ, హృదయంలో నా గురించి ధ్యానం చేయాలి మరియు నన్ను తన జీవితము యొక్క అంతిమ లక్ష్యంగా చేసుకోవాలి ( BG 6.13) "

ప్రభుపాద: ఇది పద్ధతి. మొట్ట మొదట మీరు ఒక చక్కని ప్రదేశమును ఎంచుకోండి, ఒంటరి ప్రదేశమును మరియు మీరు ఒంటరిగా అమలు చేయాలి. మీరు యోగ తరగతికి వెళ్లి, మీ రుసుము చెల్లించి, కొన్ని వ్యాయామములు చేయటము కాదు తిరిగి ఇంటికి వచ్చి మరల అన్ని అర్థం లేనివి చేయడము. మీరు చూడండి ? ఈ హాస్యాస్పదమైన విషయాలన్నింటిలో చిక్కుకోకండి, మీరు చూడండి? కేవలం ... ఇటువంటి సమాజం, నేను ప్రకటించగలను, మోసము చేసేవారు మరియు మోసపోయే వారి సమాజము మీరు చూడండి? ఇక్కడ అభ్యాసం ఉంది. ఇక్కడ మీరు చూడగలరు. మహోన్నతమైన ప్రామాణికుడు కృష్ణుడు మాట్లాడినది. కృష్ణుడు కంటే మెరుగైన యోగి ఎవరైనా ఉన్నారా?

ప్రామాణికి ప్రకటన ఇక్కడ ఉంది. అది మీరు ఇలా సాధన చేయాలి. ఇప్పుడు, ఒకరు తన శరీరాన్ని పట్టుకోవాలి ... మొట్ట మొదట మీరు మీ ప్రదేశమును, పవిత్ర ప్రదేశమును ఎంచుకోవాలి, ఒంటరిగా మరియు ప్రత్యేకమైన ఆసనమును అప్పుడు మీరు ఈ విధముగా నిటారుగా కూర్చోని ఉండాలి. ఒక వ్యక్తి తన యొక్క శరీరం, మెడ మరియు తలను నిటారుగా ఉంచాలి. సరళ రేఖ. ఇది యోగా పద్ధతి. ఈ విషయాలు మనస్సును కేంద్రీకరిస్తాయి. అంతే. కానీ యోగా యొక్క వాస్తవమైన ప్రయోజనము ఎప్పుడూ మీలో కృష్ణుడిని ఉంచుకోవడము. ఇక్కడ ఇలా చెప్పబడింది, "ఒకరు శరీరాన్ని, మెడను మరియు తలను నిటారుగా ఉంచుకోవాలి ముక్కు యొక్క కొన వద్ద స్థిరముగా రెప్ప వేయకుండా చూడాలి. "ఇప్పుడు ఇక్కడ మీరు చూడాలి. మీరు కళ్ళు ముసుకుంటే , ధ్యానం చేస్తూ, మీరు నిద్ర పోతారు. నేను చూశాను. చాలామంది ధ్యానము చేస్తున్నాము అని పిలవబడే వారు, వారు నిద్రపోతున్నారు. (గురక పెడతారు) నేను చూసాను. మీరు చూడండి ? మీరు మీ కళ్ళు మూసుకున్న వెంటనే, మీరు సహజంగా నిద్రిపోవాలని భావిస్తారు, మీరు చూడండి? అందువలన, సగం మూసుకొని. మీరు చూడాలి. అది పద్ధతి. మీరు మీ ముక్కు కొన మీద చూడాలి, రెండు కళ్ళతో చూడాలి. అందువలన ఉద్రేకము లేని మనస్సుతో ... ఈ పద్ధతి మీ మనస్సును స్థిరపరుస్తుంది, ఉద్రేకము లేని మనస్సు, జయించబడిన మనస్సు, భయము లేనిదిగా చేస్తుంది . అవును. ఎందుకంటే మీరు కలిగి ఉండాలి... యోగులు సాధారణంగా వారు అడవిలో సాధన చేస్తారు ఆయన ఆలోచిస్తూ ఉంటే, "ఏదైనా పులి వస్తోందా లేదా అని, అది ఏమిటి?" (నవ్వు) మీరు చూడండి? లేదా ఏదైనా పాము వస్తోంది. ఎందుకంటే మీరు అడవిలో ఒంటరిగా కూర్చోవాలి. మీరు చూడండి. చాలా జంతువులు ఉన్నాయి. పులులు, జింకలు మరియు పాములు. కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పబడింది, "భయం లేకుండా." లేకుండా... జింక యొక్క చర్మం ప్రత్యేకంగా యోగాసనలో ఉపయోగించబడుతుంది ఎందుకంటే అది పాములు రాకుండా ఉండుటకు కొంత వైద్య ప్రభావమును కలిగి ఉంది. మీరు ఆ ప్రత్యేకమైన చర్మంపై కూర్చుని ఉంటే, పాములు మరియు ప్రాకెడు జంతువులు అక్కడ రావు. అది ప్రయోజనము. మీరు కలత చెందరు. లైంగిక జీవితం నుండి పూర్తిగా భయటపడటం, భయపడకుండా నువ్వు చూడు. మీరు లైంగిక జీవితంలో నిమగ్నమైతే, మీరు మీ మనస్సును దేనిపైన నిమగ్నము చేయలేరు. అది బ్రహ్మచారి జీవితం యొక్క ప్రభావం. మీరు బ్రహ్మచారి అయి ఉంటే, లైంగిక జీవితం లేకుండా, అప్పుడు మీరు దృఢ నిర్ణయముతో ఉంటారు.

భారతదేశంలో మహాత్మా గాంధీ యొక్క ఆచరణాత్మక ఉదాహరణను చూసినట్లుగానే. ఇప్పుడు, అతను ఒక ఉద్యమం ప్రారంభించారు, అహింస, సహాయనిరాకరణ ఉద్యమమును. ఉద్యమం, శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యమునకు వ్యతిరేకంగా పోరాటం ప్రకటించబడింది, కేవలం చూడండి. మరియు "ఏ ఆయుధం లేకుండా నేను బ్రిటిష్ వారితో అహింసా మార్గమున పోరాడుతాను" అని అతను ధృడముగా నిశ్చయించుకున్నాడు. భారతదేశం ఆధారపడి ఉన్నందున, ఆయుధములు లేవు. అనేక సార్లు అది సాయుధ విప్లవం ద్వారా ప్రయత్నించబడింది. కానీ ఈ బ్రిటీషర్లు మరింత శక్తివంతమైనవారు, వారు అణిచి వేసారు. కావున గాంధీ ఈ పద్ధతిని కనుగొన్నాడు నేను బ్రిటీష్ వారితో పోరాడుతాను, వారు హింసాత్మకంగా మారినా కూడా, నేను హింసాత్మకము కాను. నేను ప్రపంచ సానుభూతి పొందుతాను. " మరియు... ఇది అతని ప్రణాళిక. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు. కానీ అతను ఒక బ్రహ్మచారి కనుక అతని పట్టుదల స్థిరంగా ఉంది. ముప్పై ఆరు సంవత్సరాల వయస్సు నుండి, అతను వదిలివేసాడు. అతను తన భార్యను కలిగి ఉన్నాడు కాని అతను తన లైంగిక జీవితాన్ని విడిచిపెట్టాడు. అతను ఒక కుటుంబం మనిషి, అతనికి పిల్లలు ఉన్నారు, అతనికి తన భార్య ఉంది. కాని ముప్పై ఆరు సంవత్సరాల వయస్సు నుండి, ముప్పై ఆరు సంవత్సరాల వయస్సులో ఉన్న యువకుడు తన భార్యతో లైంగిక జీవితం విడిచిపెట్టాడు. ఆ విధానము ఆయనను చాలా పట్టుదల గల వాడిగా చేసింది, "నేను ఈ బ్రిటీష్ వారు అందరిని భారతదేశపు దేశము నుండి బయటకు తరుముతాను," అని అన్నాడు. మరియు చేశాడు మీరు చూడండి? వాస్తవానికి ఆయన చేశాడు. మైథున జీవితాన్ని నియంత్రించడం, లైంగిక జీవితం నుండి దూరంగా ఉండటం చాలా శక్తివంతమైనది. మీరు ఏమీ చేయకపోయినా, మీ లైంగిక జీవితాన్ని మీరు నిగ్రహించుకోగలిగితే, మీరు చాలా శక్తివంతమైన వ్యక్తిగా మారతారు. ప్రజలకు రహస్యము తెలియదు. మీరు ఏమి చేసినా, మీరు ధృడ నిర్ణయముతో చేయాలనుకుంటే, మీరు లైంగిక జీవితం ఆపాలి. అది రహస్యము.

కాబట్టి ఏ పద్ధతి అయినా, వేదముల పద్ధతి తీసుకోండి. యోగ పద్ధతి లేదా భక్తి పద్ధతి లేదా జ్ఞాన పద్ధతిని తీసుకోండి, ఏ పద్ధతిలో అయినా మైథున జీవితము అనుమతించబడ లేదు, లేదు. లైంగిక ఆనందం కేవలము కుటుంబ జీవితములో మాత్రమే అనుమతించ బడినది, , కేవలం చాలా మంచి పిల్లలను పొందటానికి. అంతే. లైంగిక జీవితం ఇంద్రియ ఆనందం కోసం కాదు. స్వభావము ద్వారా ఆనందం ఉన్నప్పటికీ. ఆనందం లేకపోతే తప్ప, ఎందుకు కుటుంబ జీవిత బాధ్యత తీసుకోవాలి? ఇది ప్రకృతి బహుమతి యొక్క రహస్యము. కాని దాని ఉపయోగమును మనము తీసుకోకూడదు. ఇవి జీవిత రహస్యాలు ఇవి జీవిత రహస్యాలు. యోగ సాధన, అటువంటి మంచి విషయము. మీరు లైంగిక జీవితంలో పాల్గొంటే, ఇది కేవలం అర్థంలేనిది. కేవలం అర్థంలేనిది. మీకు మీ లైంగిక జీవితంలో మీకు ఎంత నచ్చితే అంత ముందుకు వెళ్ళండి అని ఎవరైనా చెప్పినట్లయితే, అదే సమయంలో మీరు ఒక యోగిగా మారతారు, కేవలము నా ఫీజు (రుసుము) చెల్లించండి. నేను మీకు 'అద్భుత మంత్రం' ఇస్తాను. ఇవి అన్నీ అర్థంలేనివి. అన్నీ అర్థంలేనివి. కాని మనము మోసం చేయబడాలని కోరుకుంటున్నాము. మనము మోసం చేయబడాలని కోరుకుంటున్నాము. మనకు ఉన్నతమైనది చాలా చౌకగా కావాలి. అంటే మనము మోసం చేయబడాలని కోరుకుంటున్నాము. మీకు మంచి వాటిని కావాలనుకుంటే దాని కోసం మీరు చెల్లించాలి. "లేదు. నేను దుకాణానికి వెళ్తాను, అయ్యా, నేను మీకు పది సెంట్లను చెల్లించగలను, దానికి నాకు అత్యుత్తమమైనదాన్ని ఇవ్వండి. "పది సెంట్లకు మీరు ఎలా ఆశించగలరు? మీరు ఏదైనా విలువైన వస్తువులను కొనాలని అనుకుంటే, మీరు బంగారం కొనాలని కోరుకుంటే, దాని కోసం మీరు చెల్లించాలి. అదేవిధముగా మీరు యోగ సాధనలో పరిపూర్ణము సాధించాలంటే, అప్పుడు మీరు దానికి ఈ విధముగా చెల్లించాలి. ఇది పిల్లల వ్యవహారముగా చేయవద్దు. ఇది భగవద్గీత యొక్క ఉపదేశము. మీరు పిల్లవాడి వ్యవహారం చేస్తే అప్పుడు మీరు మోసం చేయబడతారు. చాలా మంది మోసగాళ్లు మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బు తీసుకొని దూరంగా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అంతే. ప్రామాణిక ప్రకటన ఇక్కడ ఉంది. బ్రహ్మచర్యము పాటించాలి