TE/Prabhupada 0668 - ఒక నెలలో కనీసం రెండు సార్లు తప్పని సరిగా ఉపవాసము ఉండాలి



Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969

ఇక్కడ సలహా ఉన్నది ఈ శరీరం పనికిరానిది అని, అంటే మనము జాగ్రత్త తీసుకోకూడదు అని కాదు. ఉదాహరణకు మీరు మీ కారులో ఒక ప్రదేశం నుంచి మరొక స్థలానికి వెళ్తున్నారు. కారు, మీరు ఈ కారు కాదు, కానీ మీ పని కోసం మీరు కారును ఉపయోగించాల్సి ఉంటుంది, మీరు కారును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కాని మీరు కేవలం కారు పనిలోనే నిమగ్నమై ఇతర పనులను మానుకోరు. కొంత మంది వలె , కారు మీద చాలా ఆసక్తి కలిగి, రోజంతా కారును మెరుగు పెడుతుంటారు, మీరు చూడండి, మెరుగు పెడుతుంటారు. కాబట్టి మనం ఈ శరీరము మీద చాలా ఎక్కువ ఆసక్తి కలిగి ఉండకూడదు. కానీ ఈ శరీరముతో మనము కృష్ణ చైతన్యమును అమలు చేస్తాము కనుక, అందుచేత మనం అది కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి దీనిని యుక్త-వైరాగ్య అని పిలుస్తారు. మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనం తరచుగా స్నానం చేస్తాము, మనం, తరచుగా చక్కని ఆహారము, కృష్ణ ప్రసాదమును, మన మనస్సు మరియు శరీరమును ఆరోగ్యకరముగా ఉంచుకుంటాము. అది అవసరము.

కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమము కృత్రిమంగా మీరు కేవలము కొంత త్యాగము చేయమని చెప్పటము లేదు. అంతా వెర్రి పనులు మనము తిరిగి పూరించుటకు మనము కొన్ని మందులను తీసుకోవాలి, కొoత మత్తు మందును తీసుకోవాలి. లేదు మీరు మంచి ఆహారాన్ని తీసుకోండి. కృష్ణుడు మంచి ఆహారాన్ని ఇచ్చాడు. పండ్లు, ధాన్యాలు, పాలు - మీరు వందల వేల రకముల ఆహారమును సిద్ధం చేసుకోవచ్చు, చక్కని, ఈ ఆహార ధాన్యాలతో, మరియు మనము చేస్తున్నాం. ప్రేమపూర్వక విందుకు మిమ్మల్ని ఆహ్వానించుటకు మా ఉద్దేశ్యం: మీరు తినే అన్ని అసంబద్ధమైన ఆహార పదార్థాలను కృష్ణ ప్రసాదముతో భర్తీ చేయడము. అవి ఆరోగ్యకరమైనవి కావు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. ఆరోగ్యవంతమైన ఆహారం. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం. కాబట్టి, కృష్ణుడి ప్రసాదమును, మంచి ప్రసాదమును తినండి. మీ నాలుక కొన్ని చక్కని రుచికరమైన వంటకాలను కోరుకుంటే మేము మీకు వందలు వేలు అందించగలము, కృష్ణుడికి అర్పించినవి సమోసా ఈ తీపి, రసగుల్లా చాలా విషయాలు మనము సరఫరా చేయవచ్చు. మీరు చూడoడి? మిమ్మల్ని నిషేధించలేదు. కాని ఎక్కువ తీసుకోవద్దు. ఇది చాలా రుచికరముగా ఉంది, నేను ఒక డజను రసగుల్లా తీసుకుంటాను. లేదు, తీసుకోకండి. (నవ్వు) అప్పుడు అది మంచిది కాదు. అది దురాశ. మీ శరీరం ఆరోగ్యముగా ఉండే వరకు మాత్రమే అవసరమైనంత, మీరు తీసుకోవాలి, అంతే. మీ శరీరం ఆరోగ్యముగా ఉండేటట్లు అవసరమైనంత మీరు నిద్ర పోవాలి, అంతే. అంతకన్నా ఎక్కువ కాదు. Yuktāhāra vihārasya yogo bhavati siddhi. దీనిని యుక్త అని పిలుస్తారు. కేవలం ఆరోగ్యము సరిగ్గా ఉంచుకోవడానికి మనము తినాలి. ఆరోగ్యంగా ఉండడానికి మనము నిద్రపోవాలి. కానీ మీరు తగ్గిస్తే, అది బాగుంటుoది. కాని అనారోగ్యం కలిగే ప్రమాదం వచ్చే వరకు కాదు.

ఎందుకంటే ప్రారంభంలో, మనము విపరీతంగా తినడానికి అలవాటు పడిపోయాము, కాబట్టి కృత్రిమంగా తక్కువ తినడానికి ప్రయత్నించకండి. నువ్వు తిను. కాని అది తగ్గించడానికి ప్రయత్నించండి. ఎంత వీలైతే... అందువలన ఉపవాసం నిర్దేశించబడినది. ఒక నెలలో కనీసం రెండు సార్లు తప్పని సరిగా ఉపవాసాలు. ఇతర ఉపవాస రోజులు కూడా ఉన్నాయి. ఎంత మీరు, మీ నిద్ర మరియు తినడం తగ్గిస్తే , మీరు అంత ఆరోగ్యముగా ఉంటారు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయోజనము కోసం. కాని కృత్రిమంగా కాదు. కృత్రిమంగా కాదు. కాని పవిత్రమైతే, మీరు సహజంగానే అనుభూతి చెందరు... ఉదాహరణకు రఘునాథ గోస్వామి వలె. ఉదాహరణలు ఉన్నాయి. రఘునాథ దాస గోస్వామి చాలా ధనవంతుని కుమారుడు. ఆయన ఇంటిని విడిచిపెట్టాడు. ఆయన చైతన్య మహాప్రభువుతో చేరాడు. కాని ఆతని తండ్రికి - ఆయన ఏకైక కుమారుడు, చాలా ప్రియమైన కుమారుడు. చాలా మంచి భార్య. ప్రతిదీ వదలివేసారు. వదిలేయడము అంటే, దొంగిలించడం అని అర్థం. ఏమి చెప్పకుండా. ఎట్లాగైతేనే ఆయన ఇంటిని వదిలి వేసారు. పూరీ వద్ద చైతన్య మహాప్రభు దగ్గరకు వెళ్లినట్లు తండ్రి అర్థం చేసుకున్నాడు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి ఆయన నలుగురు సేవకులను పంపించాడు. నాలుగు వందల రూపాయలు - ఐదు వందల సంవత్సరాల క్రితం నాలుగు వందల రూపాయలు అంటే ప్రస్తుత విలువలో ఇరవై సార్లు రెట్టింపు చేయాలి. అందువల్ల మొదట ఆయన అంగీకరించారు,", తండ్రి పంపారు, సరే." కాబట్టి ఆయన డబ్బు ఖర్చు ఎలా పెడుతున్నారు? అందువలన ఆయన సన్యాసులు అందరిని ఆహ్వానిస్తున్నాడు - జగన్నాథ పురిలో చాలామంది సన్యాసులు ఉన్నారు, సన్యాస ఆశ్రమములో. ప్రతి నెల ఆయన విందు పెడుతున్నాడు. కొన్ని రోజుల తరువాత, చైతన్య మహాప్రభు ఆయన కార్యదర్శి, స్వరూప దమోదరను అడిగారు, ఈ రోజుల్లో నాకు రఘునాధ నుండి ఏ ఆహ్వానము అందడము లేదు. ఏం జరిగింది? అయ్యా, ఆయన తన తండ్రి నుండి డబ్బును అంగీకరించడం ఆపినారు. అవునా, అది మంచిది. ఆయన "నేను ప్రతిదీ విడిచిపెట్టాను నేను నా తండ్రి డబ్బును ఆనందిస్తున్నాను, ఇది అంతా అర్థంలేనిది." ఆయన నిరాకరించాడు. ఆయన మనిషికి చెప్పాడు, "నీవు ఇంటికి వెళ్ళు. నాకు డబ్బు అవసరము లేదు." అప్పుడు ఆయన ఎలా జీవిస్తున్నాడు? ఆయన జగన్నాథ ఆలయ మెట్ల మీద నిలబడి ఉoటున్నాడు, పూజారులు తమ ఇంటికి వెళ్ళుతునప్పుడు, వారు ఏదో ప్రసాదాన్ని పెడుతున్నారు. ఆయన దానితో సంతృప్తి చెందుతున్నాడు. " కాబట్టి చైతన్య మహాప్రభు ", ఇది సరి అయినది, చాలా బాగుంది" అని అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ ఎలా నిలబడి ఉన్నాడు అని అడిగాడు. కాబట్టి ఆయన చూశాడు నిలబడి ఉండటము. కాబట్టి రఘునాథ గోస్వామి, కొన్ని రోజుల తర్వాత, అలా నిలబడటము కూడా ఆపివేసాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన కార్యదర్శిని ప్రశ్నించారు, "నేను రఘునాథ అక్కడ నిలబడటము చూడడము లేదు, ఆయన ఏమి చేస్తున్నాడు?" లేదు అయ్యా, ఆయన నిలబడటము లేదు ఎందుకంటే ఆయన అనుకున్నాడు, నేను ఒక వేశ్య వలె నిలబడుతున్నాను, ఎవరో వచ్చి నాకు కొంత ఇవ్వండి... లేదు,లేదు నాకు ఇది ఇష్టం లేదు. అది మంచిది. అప్పుడు ఆయన ఎలా తింటున్నారు ? ఆయన వంటగదిలో తిరస్కరించిన కొంత అన్నమును సేకరిస్తున్నాడు, అది ఆయన తింటున్నాడు.

కాబట్టి రఘునాథ గోస్వామిని ప్రోత్సహించడానికి, ఒక రోజు చైతన్య మహాప్రభు తన గదికి వెళ్ళాడు. రఘునాథ? నేను మీరు చాలా మంచి ఆహారం తింటున్నారు అని విన్నాను, మీరు నన్ను ఆహ్వానించడం లేదు ఎందుకు? అందువలన ఆయన జవాబివ్వలేదు. ఆయన ఆ అన్నము ఎక్కడ ఉంచారో కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు, ఆయన తీసుకొని వెంటనే తినడము ప్రారంభించారు. "అయ్యా, మీరు తినవద్దు, ఇది మీరు తినడానికి సరి అయినది కాదు." ఇది జగన్నాథ ప్రసాదం, అది ఎలా సరి అయినది కాదు అని మీరు ఎలా చెప్తారు? ఆయనని ప్రోత్సహించడానికి. ఆయన ఆలోచించడము లేదు. "నేను తిరస్కరించిన అన్నమును తింటున్నాను, మీరు చూడండి? ఈ విధముగా, రఘునాథ గోస్వామి తన ఆహార పదార్థాన్ని తీసుకోవాటాన్ని తగ్గించారు - చివరికి, ప్రతి రోజు మార్చి రోజు ఒక్క ముక్క మాత్రమే, వెన్నను, అంతే. ఆయన వంద సార్లు క్రిందకు వంగి ప్రణామము చేస్తున్నారు, చాలా సార్లు జపము కూడా చేస్తున్నారు. Saṅkhyā-pūrvaka-nāma - ఆరుగురు గోస్వాముల పాట పాడేటప్పుడు మీరు విన్నారు. Saṅkhyā-pūrvaka-nāma-gāna-natibhiḥ kālāvasānī-kṛtau. కాబట్టి కనిష్ఠీకరణకు చాలా మంచి ఉదాహరణలు ఉన్నాయి. అన్ని భౌతిక అవసరాలను తగ్గించడం. శూన్యము అయ్యేటంత వరకు. మీరు చూడండి? కాని అందరికీ అది సాధ్యం కాదు. రఘునాథ దాస గోస్వామిని అనుకరించటానికి ప్రయత్నించవద్దు. కాని వారు చైతన్య మహాప్రభు సహచరులు కనుక, వారిలో ప్రతి ఒక్కరు ఒక ఉదాహరణ చూపించారు, కృష్ణ చైతన్యములో ఎలా ఉన్నత స్థానమునకు రావాలో దానిపై ప్రత్యేకమైన ఉదాహరణను. కాని మన కర్తవ్యము వారిని అనుకరించడం కాదు, కాని వారిని అనుసరించడానికి ప్రయత్నించడము. సాధ్యమైనంతవరకు, వారిని అనుసరించడానికి ప్రయత్నించండి. కృత్రిమంగా కాదు.

అందువల్ల ఇక్కడ చెప్పబడింది, "ఒక వ్యక్తి యోగిగా మారడానికి అవకాశం లేదు ..." మీరు వెంటనే రఘునాథ దాస గోస్వామి అవ్వటానికి ప్రయత్నిస్తే, అనుకరించడం ద్వారా, మీరు విఫలమౌతారు. మీరు చేసిన ఏ పురోగతి అయినా, అది నాశనము అవుతుంది. లేదు, అలా కాదు. నువ్వు తిను. కాని మరింత తినవద్దు. అంతే. ఎక్కువ తినడం మంచిది కాదు. నువ్వు తిను. మీరు ఏనుగు అయితే మీరు వంద పౌండ్లు తినoడి, కాని మీరు చీమ అయితే మీరు ఒక ధాన్యం గింజ తినండి. ఏనుగును అనుకరించడం ద్వారా వంద పౌండ్లు తినవద్దు. మీరు చూడoడి? దేవుడు ఏనుగులకు మరియు చీమలకు ఆహారాన్ని ఇచ్చాడు. మీరు వాస్తవమునకు ఏనుగు అయితే మీరు ఏనుగులా తినoడి. మీరు చీమ అయితే, ఏనుగులా తినకూడదు, అప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉంటారు. కావున ఇక్కడ చెప్పబడింది, "ఒక వ్యక్తి యోగిలా అవ్వటానికి సాధ్యము కాదు, ఓ అర్జునా, ఒక వ్యక్తి చాలా ఎక్కువ తింటున్నా లేదా చాలా తక్కువగా తింటున్నా." మంచి కార్యక్రమం. చాలా తక్కువగా తినవద్దు. నీకు అవసరమైనంత తిను. కాని మరింత తినవద్దు. అదేవిధముగా ఎక్కువ నిద్ర పోవద్దు. మీరు చేయగలిగితే...

మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకోగలిగితే, దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. మీరు పది గంటల నిద్రిస్తున్నారని అనుకుందాం. కానీ నేను ఐదు గంటలు నిద్రిస్తూ ఆరోగ్యముగా ఉంటే, నేను ఎందుకు పది గంటలు నిద్రపోవాలి? కాబట్టి ఇది పద్ధతి. కృత్రిమంగా ఏదీ చేయవద్దు. మన శరీరానికి సంబంధించినంత వరకు, మనకు నాలుగు అవసరాలు ఉన్నాయి. తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము రక్షించుకోవటము. లోపం ఏమిటంటే, ఆధునిక నాగరికత, వారు తినే పద్ధతి, నిద్రపోవటము పెంచుకుంటే అది చాలా మంచిది అని వారు ఆలోచిస్తున్నారు మనము శనివారం మరియు ఆదివారం పగలు మరియు రాత్రి నిద్రపోగలిగితే, అది గొప్ప లాభం, ఆనందం, మీరు చూడండి? అది నాగరికత. వారు జీవితాన్ని ఆస్వాదించడానికి, ఒక రోజు ముప్పై గంటలు నిద్రించడాన్ని అవకాశంగా భావిస్తారు. మీరు చూడoడి? లేదు, చేయవద్దు. దీనిని తగ్గించండి. తగ్గించడానికి ప్రయత్నించండి. కానీ కృత్రిమంగా కాదు. తగ్గిస్తూ వెళ్ళండి.