TE/Prabhupada 0671 - ఆనందము అంటే ఇద్దరు - కృష్ణుడు మరియు మీరు

From Vanipedia


ఆనందము అంటే ఇద్దరు - కృష్ణుడు మరియు మీరు
- Prabhupāda 0671


Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969


భక్తుడు: "ఒకరి సామర్థ్యము మీద ఆధారపడి ఉన్నది ఈ పవిత్రమైన మనస్సు ద్వారా ఆత్మను చూడగలడము మరియు ఆనందమును పొందటము అనేది"

ప్రభుపాద: పవిత్రమైన మనసు. ఇది పవిత్రమైన మనస్సు. పవిత్రమైన మనస్సు అంటే "నేను కృష్ణునికి చెందుతాను" అని అర్థం చేసుకోవడము. అది పవిత్రమైన మనస్సు అంటే. మనస్సు, ప్రస్తుతం నా మనస్సు కలుషితమైనది. ఎందుకు? నేను ఈ విషయమునకు చెందుతాను అని నేను అనుకుంటాను, నేను దానికి చెందినవాడిని. నేను దీనికి చెందినవాడిని కానీ నా మనస్సు స్థిరముగా ఉన్నప్పుడు, "నేను కృష్ణుని యొక్క." అది నా పరిపూర్ణత. అవును.

భక్తుడు: "... ఆత్మలో సంతోషమును పొందుట , ఆ సంతోషకరమైన స్థాయిలో ఒకరు స్థిరపడి ఉన్నారు అనంతమైన..."

ప్రభుపాద: ఆత్మ లో ఇది సంతోషకరమైన, అనగా, కృష్ణుడు భగవంతుడు. యోగాభ్యాసం. నేను వ్యక్తిగత ఆత్మను. నేను విష్ణువుతో సమాధిలో ఉన్నప్పుడు, భగవంతుని మీద, అది నా మనస్సు యొక్క స్థిరత్వము. కావున భగవంతుడు మరియు ఆత్మ, వారు ఆనందించినప్పుడు. ఆనందం ఒంటరిగా ఉండదు. అక్కడ ఇద్దరు ఉండాలి. మీకు మీరు ఒక్కరే ఆనందించిన అనుభవము మీకున్నదా? లేదు కావున ఒక్కరే ఆనందించడము మాత్రము సాధ్యం కాదు. ఆనందము అంటే ఇద్దరు - కృష్ణుడు మరియు మీరు. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ. అది మార్గం. ఒంటరిగా మీరు ఆనందించలేరు, అది మీ స్థితి కాదు. అవును, కొనసాగండి.

భక్తుడు:... ఒకరు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందంలో ఉండి, ఆధ్యాత్మిక ఇంద్రియాల ద్వారా తనకు తాను ఆనందిస్తాడు. ఆ విధముగా స్థిరపడి, ఆయన ఎప్పుడూ సత్యం నుండి బయటికి వెళ్లిపోడు, ఇది సాధించినప్పుడు, ఆయన అంత కన్నా ఎక్కువ లాభం లేదని భావిస్తాడు. అలాంటి స్థితిలో ఉన్నందువల్ల, గొప్ప కష్టాల మధ్య ఉన్నా కూడా చలించడు. ఇది...

ప్రభుపాద: గొప్ప ఇబ్బందుల్లో. మీరు నమ్మితే, "నేను కృష్ణుని యొక్క భాగం" అప్పుడు మీరు కూడా జీవితములో పెద్ద కష్టములో ఉన్నా కూడా, అది శరణాగతి అంటే. కృష్ణుడు మీకు రక్షణ కల్పిస్తాడని మీకు తెలుసు. మీరు మీ ఉత్తమ ప్రయత్నం చేస్తే, మీరు మీ బుద్ధిని ఉపయోగించుకోండి, కానీ కృష్ణుని నమ్మండి. Bālasya neha pitarau nṛsiṁha ( SB 7.9.19) కృష్ణుడు నిర్లక్ష్యం చేస్తే, ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు. ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు. ఆలోచించవద్దు... ఒకరు అనారోగ్యముతో ఉంటే అనేక నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స చేస్తుంటే. చక్కని మందులు అందించబడినా. తన జీవితానికి హామీ ఉందా? లేదు హామీ లేదు. కృష్ణుడు నిర్లక్ష్యం చేస్తే, ఈ మంచి వైద్యులు మరియు మందులు ఉన్నప్పటికీ ఆయన చనిపోతారు. కృష్ణుడు అతన్ని కాపాడితే, ఆయనకు నిపుణులు చికిత్స చేయకపోయినా, ఆయన అప్పటికీ జీవించి ఉంటాడు. కాబట్టి కృష్ణునిలో స్థిరపడినవాడు, పూర్తిగా శరణాగతి పొందినవాడు... శరణాగతి విషయాలలో ఒక విషయము కృష్ణుడు నన్ను కాపాడుతాడు అని. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు పిల్లల వలె . ఆయన పూర్తిగా తల్లిదండ్రులకు శరణాగతి పొందినాడు మరియు ఆయన నిశ్చితంగా ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు, నా తల్లి అక్కడ ఉంది. అందువలన ఆయన సంతోషంగా ఉన్నాడు. Kadāham aikāntika-nitya-kiṅkaraḥ (Stotra-ratna 43). మీకు ఎవరో నా సంరక్షకుడు ఉన్నాడు అని తెలిస్తే , ఎవరు నా రక్షకుడు, మీరు చాలా సంతోషంగా ఉండరా? కానీ మీరు స్వయముగా చేస్తుంటే, మీ బాధ్యతతో మీరు సంతోషముగా ఉంటారా? అదేవిధముగా, మీరు కృష్ణ చైతన్యమును నమ్మితే, "కృష్ణుడు నాకు రక్షణ ఇస్తాడు" మీరు కృష్ణునికి నిజాయితీగా ఉంటే, అది ఆనందం యొక్క ప్రమాణము. మీరు లేకపోతే సంతోషంగా ఉండలేరు. అది సాధ్యం కాదు. Eko bahūnāṁ vidadhāti kāmān (Kaṭha Upaniṣad 2.2.13).

అది సత్యము. మీరు అవిధేయతతో ఉన్నా కూడా కృష్ణుడు మీకు రక్షణ కల్పిస్తాడు. కృష్ణుని రక్షణ లేకుండా మీరు ఒక్క క్షణము కూడా జీవించలేరు. ఆయన చాలా దయతో ఉంటాడు. కానీ మీరు దాన్ని అంగీకరించినప్పుడు, దానిని గుర్తించినప్పుడు, మీరు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు కృష్ణుడు మీకు రక్షణ కల్పిస్తున్నాడు, కానీ మీరు మీ జీవితాన్ని మీ స్వంత పూచీతో తీసుకున్నందున మీకు తెలియదు. అందువల్ల ఆయన మీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు, "సరే, మీకు నచ్చినది మీరు చేయవచ్చు, వీలైనంత వరకు నేను మీకు రక్షణ ఇస్తాను." కానీ మీరు పూర్తిగా శరణాగతి పొందినప్పుడు, మొత్తం బాధ్యత కృష్ణుడి మీద ఉంటుంది. అది ప్రత్యేకమైనది. ఇది ప్రత్యేకమైన రక్షణ. ఉదాహరణకు ఒక తండ్రి వలె. పెరిగిన పిల్లవాడు తండ్రిని పట్టించుకోడు, ఆయన స్వేచ్ఛగా వ్యవహరిస్తాడు. తండ్రి ఏమి చేయగలడు? "సరే, నీకు ఇష్టము వచ్చినది నీవు చేయ వచ్చు." కానీ తండ్రి రక్షణలో ఉన్న పిల్లవాడు, ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు.

ఇది భగవద్గీతలో చెప్పబడింది: మీరు కనుగొంటారు samo 'haṁ sarva-bhūteṣu ( BG 9.29) నేను అందరికి సమానం. న మే ద్వేష్యః: "ఎవరూ నా శత్రువు కాదు." ఎలా ఆయన శత్రుత్వము కలిగి ఉంటాడు? అందరూ కృష్ణుని కుమారులే. అతను కృష్ణుడికి ఎలా శత్రువు అవుతారు? అతను కృష్ణుని కుమారుడు. అది సాధ్యం కాదు. ఆయన ప్రతి ఒక్కరి స్నేహితుడు. కానీ ఆయన స్నేహం యొక్క ప్రయోజనమును మనము తీసుకోవడము లేదు. అది మన వ్యాధి. అది మన వ్యాధి. ఆయన ప్రతి ఒక్కరికీ స్నేహితుడు. Samo 'haṁ sarva-bhūteṣu. కానీ ఎవరైతే గుర్తిస్తారో, "కృష్ణుడు ఈ విధముగా నాకు రక్షణ ఇస్తున్నారు" అతను అర్థం చేసుకోగలడు. ఇది ఆనందము యొక్క మార్గం. కొనసాగించు