TE/Prabhupada 0676 - మనస్సుచే నియంత్రించబడటము అంటే, ఇంద్రియాల ద్వారా నియంత్రించబడటము
Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969
విష్ణుజన: శ్లోకము ఇరవై-ఆరు: "దేని పైన మరియు ఎక్కడ మనస్సు సంచరిస్తుందో దాని చంచలము మరియు అస్థిర స్వభావము కారణంగా, ఒకరు తప్పనిసరిగా దీనిని ఉపసంహరించుకొని మరియు ఆత్మ యొక్క నియంత్రణలోకి తిరిగి తీసుకురావాలి ( BG 6.26) "
ప్రభుపాద: ఇది పద్ధతి. ఇది యోగ పద్ధతి. మీరు మీ మనసును కృష్ణునిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం, మీ మనస్సు ఎక్కడో కేంద్రీకరించబడినది, ఎక్కడకో వెళ్ళి, ఏదో సినిమా హాల్ లో. కాబట్టి మీరు ఉపసంహరించుకోవాలి, "అక్కడకు కాదు, దయచేసి ఇక్కడకు. "ఇది యోగాభ్యాసం. మనసును కృష్ణుడి నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించకూడదు. మీరు చేయగలిగితే, దీనిని సాధన చేయగలిగితే. మీ మనస్సును కృష్ణుని నుండి వెళ్లడానికి అనుమతించవద్దు. మనము మనస్సును స్థిర పరచుకోలేము కనుక, ఒకే ప్రదేశములో కూర్చోని, కృష్ణునిలో... దానికి చాలా ఉన్నత శిక్షణ అవసరం. ఒకే ప్రదేశములో కూర్చోవటానికి, ఎల్లప్పుడూ కృష్ణుని పై మనస్సును లగ్నము చేయవలెను, ఇది చాలా సులభం కాదు. దానిని సాధన చేయని వ్యక్తి, ఆయనను కేవలము అనుసరిస్తే, ఆయన అయోమయముగా ఉంటాడు. కృష్ణ చైతన్యములో ఎల్లప్పుడూ మనము మనల్ని నిమగ్నము చేసుకోవాలి. కృష్ణునితో మనము తప్పకుండా సంబంధము కలిగి ఉండాలి. మన సాధారణ కార్యక్రమాలను ఆవిధముగా తయారు చేసుకోవాలి, ఇది ప్రతిదాన్ని కృష్ణుని కోసము చేయవలసి ఉంటుంది. అప్పుడు మీ మనస్సు కృష్ణుడిలో స్థిరపడుతుంది. కృత్రిమంగా, మీరు పవిత్రము కాకపోతే , మీరు, మీ మనస్సును, కృష్ణుని పై స్థిరము చేయడానికి ప్రయత్నించినట్లయితే , ఆ యోగ సాధన ఇక్కడ సిఫార్సు చేయబడినట్లుగా మీరు ఈ విధముగా క్రింద కూర్చుని నిటారుగా ఉండాలి, మీరు ముక్కు యొక్క కొన మీద మీ కంటి చూపును కేంద్రీకరించాలి, ఏకాంత పవిత్ర ప్రదేశములో... కానీ ఈ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ప్రస్తుత క్షణం లో, ఈ అన్ని సౌకర్యాల అవకాశం ఎక్కడ ఉంది?
అందువలన ఇది మాత్రమే పద్ధతి. మీరు గట్టిగా కీర్తన చేయండి మరియు వినండి. హరే కృష్ణ. మీ మనస్సు ఇతర విషయాల్లో ఉంటే, అది శబ్ద తరంగము పై "కృష్ణని" పై బలవంతముగా దృష్టి పెట్టబడుతుంది. మీరు మీ మనస్సును ఇతర వాటి నుండి ఉపసంహరించుకోవలసిన అవసరము లేదు, సహజముగా అది ఉపసంహరించబడుతుంది ఎందుకంటే ధ్వని ఉంది. (కారు వెళుతున్న ధ్వని) మోటారు కారు ధ్వని వస్తున్నట్లుగా. సహజముగా మీ దృష్టి మళ్ళించ బడుతుంది. అదేవిధముగా మనము కృష్ణుని కీర్తన చేస్తే, కాబట్టి సహజముగా నా మనస్సు స్థిర పడుతుంది. లేకపోతే నేను చాలా విషయాల మీద నా మనస్సు ను కేంద్రికరించడానికి అలవాటుపడ్డాను. కాబట్టి యోగాభ్యాసం అంటే మనస్సుని ఉపసంహరించుకొని మరల కృష్ణునిపై స్థిరము చేయటము. కాబట్టి కీర్తన, జపము చేయడము సహజముగా ఈ యోగ అభ్యాసంలో సహాయము చేస్తుంది. కొనసాగించు.
విష్ణుజన: "భాష్యము: మనస్సు యొక్క స్వభావం చంచలము మరియు అస్థిరంగా ఉండడము. కానీ ఒక ఆత్మ సాక్షాత్కారము పొందిన యోగి మనస్సును నియంత్రించవలసి ఉంటుంది; మనస్సు ఆయనని నియంత్రించకూడదు. "
ప్రభుపాద: అవును. ఇది యోగ యొక్క విజయము. ప్రస్తుత క్షణము మనస్సు నన్ను నియంత్రిస్తోంది, గో-దాస్. మనస్సు నాకు నిర్దేశిస్తోంది, "దయచేసి, ఆ అందమైన, మంచి అమ్మాయిని ఎందుకు చూడకూడదు" నేను వెళ్ళి... "ఎందుకు ఆ మంచి మద్యమును త్రాగ కూడదు?" "అవును." ఎందుకు ఈ చక్కని సిగరెట్ పొగ త్రాగ కూడదు? "అవును." రెస్టారెంట్కు ఎందుకు వెళ్ళరాదు? "దీన్ని ఎందుకు చేయకూడదు?" చాలా విషయాలు నిర్దేశిస్తుంది మరియు, మనము అనుసరిస్తున్నాము. ఈ ప్రస్తుత దశలో... నేను మనస్సు ద్వారా నియంత్రించబడుతున్నాను. భౌతిక జీవితం అంటే మనస్సు లేదా ఇంద్రియాలచే నియంత్రించబడటము మనస్సు అనేది అన్ని ఇంద్రియాలకు కేంద్రంగా ఉంది. కాబట్టి మనస్సుచే నియంత్రణలో ఉండడం అంటే, ఇంద్రియాల ద్వారా నియంత్రించబడటము. ఇంద్రియాలు, యజమాని మనస్సుకు సహాయక సేవకులు. యజమాని మనస్సు నిర్దేశిస్తుంది, "వెళ్ళి దానిని చూడండి." నా కళ్ళు చూస్తాయి. కాబట్టి నా కళ్ళు, ఇంద్రియము కన్ను మనస్సు యొక్క దిశలో ఉంది. నా కాళ్లు వెళ్తాయి. కాబట్టి నా ఇంద్రియ అవయవాలు, కాలు, మనస్సు యొక్క ఆధీనంలో ఉంది. మనస్సు యొక్క ఆధీనంలోకి రావడం అంటే, ఇంద్రియాల యొక్క ఆధీనంలోకి రావడము. మీరు మనసును నియంత్రించగలిగితే, మీరు ఇంద్రియాల నియంత్రణ లో ఉండరు