TE/Prabhupada 0684 - యోగ పద్ధతికి పరీక్ష మీరు విష్ణువు రూపం మీద మీ మనస్సును కేంద్రీకరించగలిగితేLecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969


విష్ణుజన: శ్లోకము ముప్పై రెండు: "ఆయన పరిపూర్ణ యోగి, ఆత్మ అందరిలోను ఉంటుంది అని తెలుసుకున్నవాడు, అన్ని జీవుల యొక్క వాస్తవమైన సమానత్వమును చూస్తాడు, వారి ఆనందం మరియు బాధలు రెండింటిలోను, ఓ అర్జునా ( BG 6.32) "

ప్రభుపాద: ఇది విశ్వ దృష్టి. భగవంతుడు మీ హృదయంలోనే కూర్చొని ఉన్నాడు అని కాదు, పిల్లి హృదయంలో లేడు మరియు కుక్క యొక్క హృదయములో లేడు లేదా ఆవు యొక్క హృదయంలో లేడు అని కాదు. ఆయన ప్రతి ఒక్కరి హృదయములో కూర్చుని ఉన్నాడు. ఇది సర్వ-భూతానాం. సర్వ-భూత అంటే అన్ని జీవులు అని అర్థం. ఆయన మానవ హృదయములో కూర్చొని ఉన్నాడు, ఆయన చీమ యొక్క హృదయంలో కూర్చుని ఉన్నాడు. ఆయన కుక్క హృదయములో కూర్చొని ఉంటాడు, ఆయన ప్రతి ఒక్కరి హృదయములో కూర్చుని ఉన్నాడు. కానీ పిల్లులు మరియు కుక్కలు, అవి అర్థము చేసుకోలేవు. ఇది తేడా. కానీ మానవుడు, ఆయన ప్రయత్నిస్తే, ఆయన యోగ పద్ధతిని అనుసరిస్తే - సాంఖ్యా-యోగ పద్ధతి, భక్తి-యోగ పద్ధతి - అప్పుడు ఆయన తెలుసుకోగలుగుతాడు. ఇది మానవ జివితమునకు ఇవ్వబడిన ప్రత్యేకమైన హక్కు. మనము ఈ అవకాశాన్ని కోల్పోతే, మనము కనుగొనలేకపోతే, మనము మన ఉనికిని భగవంతుడితో గుర్తించ లేకపోతే, అప్పుడు మనము ఈ అవకాశం కోల్పోతున్నాము. ఇది, పరిణామ పద్ధతి తర్వాత, 84,00,000 జీవజాతుల ద్వారా వచ్చేది, మనము ఈ మానవ రూపాన్ని పొందినప్పుడు, ఈ అవకాశాన్ని మనము కోల్పోతే, అప్పుడు మనము ఎంత నష్టమును భరాయించాలో మీకు తెలియదు. కాబట్టి మనం దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. మనము ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. మీరు చాలా మంచి శరీరము, మానవ శరీరము, తెలివి, నాగరిక జీవితం పొంది ఉన్నారు. మనము జంతువుల వలె కాదు. మనము శాంతిగా ఆలోచించగలము, జంతువుల వలె జీవించటానికి ఎటువంటి కష్టము లేదు. కాబట్టి మనము ఉపయోగించుకోవాలి. ఇది భగవద్గీత యొక్క ఉపదేశము. ఈ అవకాశాన్ని కోల్పోకండి. సరిగా ఉపయోగించుకోండి. చదవడము కొనసాగించు.

విష్ణుజన: శ్లోకము ముప్పై మూడు. "అర్జునుడు చెప్పాడు: ఓ మధుసూధన, మీరు సారాంశముగా చెప్పిన ఈ యోగ పద్ధతి, అసాధ్యమైనది మరియు అశక్యమైనదిగా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మనస్సు చంచలమైనది మరియు అస్థిరముగా ఉంటుంది( BG 6.33) "

ప్రభుపాద: ఇప్పుడు, ఇక్కడ యోగ పద్ధతికి కీలకమైన పరీక్ష- మీరు విష్ణువు రూపం మీద మీ మనస్సును కేంద్రీకరించగలిగితే. పద్ధతి గతంలో వర్ణించబడింది, మీరు ఈ విధముగా కూర్చోవాలి మీరు ఇలా చూడాలి, మీరు ఈ విధముగా నివసించాలి, చాలా విషయములు మనము ఇప్పటికే చర్చించాము కానీ అర్జునుడు చెప్పాడు "ఇది నాకు చాలా కష్టముగా ఉంది." ఈ అంశాన్నిమనము అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పాడు, "ఓ మధుసూదన, మీరు సారంశముగా చెప్పిన యోగ పద్ధతి ... " ఈ పద్ధతిని అష్టాంగ-యోగ అంటారు. అష్టాంగ-యోగ అంటే, ఎనిమిది వేర్వేరు భాగాలు. యమ, నియమ. మొదట ఇంద్రియాలను నియంత్రించడము, నియమాలు మరియు నిబంధనలను పాటించడము, తరువాత కూర్చుండే భంగిమను సాధన చేయడము. తరువాత శ్వాస పద్ధతిని సాధన చేయడము. అప్పుడు మీ మనస్సును కేంద్రీకరించడము. అప్పుడు భగవంతుని రూపంలో నిమగ్నమవడము. ఎనిమిది పద్ధతులు ఉన్నాయి, అష్టాంగ-యోగ.

కాబట్టి అర్జునుడు చెప్పాడు, "ఈ అష్టాంగ-యోగ పద్ధతి చాలా కష్టము." ఆయన చెప్పాడు, అది, "అసాధ్యమని." "అనిపిస్తుంది", అసాధ్యమైనది కాదు . ఆయనకి. ఉదాహరణకు, అది అసాధ్యము కాదు. అది అసాధ్యమైనట్లయితే, కృష్ణుడు వర్ణించే వాడు కాదు చాలా ఇబ్బందిని తీసుకొని. ఇది అసాధ్యము కాదు, కానీ అనిపిస్తుంది. ఏమిటి... ఒక విషయము నాకు అసాధ్యమని, కానీ మీకు ఆచరణాత్మకమైనది, అది వేరొక విషయము . కానీ సాధారణమైన సామాన్య మానవుడికి ఈ పద్ధతి సాధారణంగా అసాధ్యమైనది. అర్జునుడు ఒక సామాన్య మానవుడిగా తనను తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అంటే ఒక యాచకుడు కాదు లేదా తన కుటుంబ జీవితాన్ని త్యజించలేదు లేదా తనకు ఎలాంటి రొట్టె సమస్య లేదు. ఎందుకంటే ఆయన రాజ్యం కోసం పోరాడటానికి యుద్ధ భూమిలో ఉన్నాడు. అందువలన ఆయన ఒక సాధారణ మనిషిగా ఉన్నాడు. కాబట్టి ఈ లౌకిక కార్యక్రమాలలో నిమగ్నమైన సాధారణ వ్యక్తులు జీవనోపాధిని సంపాదించుటకు, కుటుంబ జీవితం, పిల్లలు, భార్య, చాలా సమస్యలు, ఇది ఆచరణాత్మకమైనది కాదు. ఈ విషయము ఇక్కడ ఉంది. ప్రతిదీ పూర్తిగా త్యజించిన వ్యక్తికి ఇది ఆచరణాత్మకమైనది. ఉదాహరణకు కొండలో లేదా కొండలోని గుహలో ఒక నిర్జన పవిత్ర ప్రదేశంలో. ఒంటరిగా, ఏ బహిరంగ కలత లేకుండా. కాబట్టి సాధారణ మనిషికి అవకాశం ఎక్కడ ఉంది మనకు, ప్రత్యేకంగా ఈ యుగములో ? అందువలన ఈ యోగ పద్ధతి ఆచరణాత్మకము కాదు. ఇది ఒక గొప్ప యోధుడైన అర్జునుడిచే ఒప్పుకోబడింది. అతడు చాలా ఉన్నతముగా ఉన్నాడు. ఆయన రాజ కుటుంబానికి చెందినవాడు, అనేక విషయాలలో చాలా నిపుణుడు. ఆయన అది అసాధ్యమని చెప్పారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్జునుడితో పోలిస్తే మనమెంత? మనము ఈ పద్ధతిని ప్రయత్నిస్తే, అది సాధ్యం కాదు. వైఫల్యం తప్పకుండా ఉంది. భాష్యము చదవడము కొనసాగించండి.

విష్ణుజన: "అర్జునుడు భగవంతుడు కృష్ణుడికి వివరించిన మార్మిక పద్ధతి ఇక్కడ అర్జునుడిచే తిరస్కరించబడింది ..."

ప్రభుపాద: అవును, అర్జునుడు తిరస్కరించాడు , అవును.

విష్ణుజన: "... అసమర్థత భావనతో. ఒక సాధారణ మనిషికి ఇంటిని వదలి, ఏకాంత ప్రదేశానికి వెళ్లడం సాధ్యం కాదు పర్వతాలు లేదా అడవులలో ఈ కలియుగంలో యోగ సాధన చేయడానికి. ప్రస్తుత యుగము యొక్క లక్షణము చేదు పోరాటముతో స్వల్పకాల జీవితము

ప్రభుపాద: అవును. మన కాల వ్యవధి మొదట చాలా తక్కువ. మీరు గణాంకాలను అధ్యయనం చేస్తే, మీరు వంద సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు లేదా తొంభై సంవత్సరాలు నివసించిన మీ పూర్వికులను చూడగలరు, ఇప్పుడు అరవై సంవత్సరాలు, డెబ్బై సంవత్సరాలకు ప్రజలు చనిపోతున్నారు. క్రమంగా అది తగ్గిపోతుంది. ఈ యుగంలో జ్ఞాపకశక్తి, జీవిత కాల వ్యవధి, కరుణ, చాలా విషయాలు తగ్గుతాయి. ఇది ఈ యుగము యొక్క లక్షణం. చదవడము కొనసాగించు