TE/Prabhupada 0690 - భగవంతుడు పవిత్రమైనవాడు, ఆయన రాజ్యం కూడా పవిత్రమైనది
Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969
భక్తుడు: "కానీ యోగి మరింత పురోగతి సాధించడంలో నిజాయితీతో కృషి చేస్తున్నప్పుడు, అన్ని కాలుష్యములు తీసివేయబడతాయి, చివరికి, చాలా చాలా జన్మల ఆచరణ తరువాత, ఆయన మహోన్నతమైన లక్ష్యమును ( BG 6.45) సాధిస్తాడు. "
ప్రభుపాద: అవును. ఇది ఎంత సాధన చేస్తున్నాము అనే ప్రశ్న. ఉదాహరణకు పిల్లవాడు జన్మించినప్పుడు, వాడికి పొగ ఎలా త్రాగాలో తెలియదు - కానీ సాంగత్యము వలన ఆయన త్రాగుబోతు, పొగత్రాగేవాడు, మత్తు సేవించేవాడు అవుతాడు. సాంగత్యము ద్వారా. ఇది సాంగత్యము యొక్క ప్రశ్న మాత్రమే. Saṅgāt sañjāyate kāmaḥ. ( BG 2.62) సాంగత్యము మంచిది అయితే... మనము మంచి సహవాసం చేయనందు వలన మన జీవనోపాధిమార్గం నాశనము అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ వివరించబడింది: కానీ యోగి మరింత పురోగతిని సాధించడానికి నిజాయితీతో కృషి చేస్తున్నప్పుడు... ఉదాహరణకు వ్యాపారములో కూడా, చాలా సంఘములు, కార్పొరేషన్ లు ఉన్నాయి. ఆ సంస్థ యొక్క సభ్యుడిగా ఉండటం వలన, నిర్దిష్ట రకమైన వ్యాపారము వృద్ధి చెందుతుంది. వారికి ఎక్స్చేంజి ఉంది. వారు మార్చుకోవచ్చు, సరుకు మార్పిడి, బిల్ మార్పిడి చేసుకోవచ్చు కావున సాంగత్యము చాలా ముఖ్యం. అందువల్ల ఆద్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనము తీవ్రముగా ఉంటే, అప్పుడు ఇది మాత్రమే ఏకైక సంఘం. మనము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజమును స్థాపించినాము. ఇక్కడ, కేవలం ప్రతి ఒక్కరు ఆద్యాత్మిక చైత్యన్యాన్నిఎలా కలిగి ఉండాలో, ఇది నేర్పబడుతుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. మనము ప్రతి ఒక్కరిని చేరాలని ఆహ్వానిస్తాము, పద్ధతి చాలా సులభం. కేవలం హరే కృష్ణ మంత్రమును కీర్తించండి. మీరు ఆస్వాదిస్తారు. కష్టమైన పద్ధతి కాదు. పిల్లలు కూడా పాల్గొనవచ్చు వాస్తవానికి వారు పాల్గొంటున్నారు. మీకు ఏ మునుపటి అర్హత అవసరం లేదు. మీరు మీ మాస్టర్ డిగ్రీ, పరీక్ష లేదా ఇది లేదా అది ఉత్తీర్ణులై ఉండాలి అని కాదు. మీరు ఏమైనప్పటికీ, మీరు కేవలం వచ్చి ఈ సాంగత్యములో చేరండి మీరు కృష్ణ చైతన్యములో ఉంటారు. ఇది ఈ సమాజం యొక్క ప్రయోజనము. ఇది స్పష్టంగా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. కొనసాగించు. భాష్యం?
భక్తుడు: "ప్రత్యేకముగా ధర్మముగా, ధనవంతుల లేదా పవిత్రమైన కుటుంబానికి చెందిన వ్యక్తి, యోగాభ్యాసం అమలు చేయటానికి తన అనుకూలమైన పరిస్థితిని తెలుసుకుంటాడు. నిర్ణయంతో, అందువలన, ఆయన తన అసంపూర్ణమైన పని ప్రారంభిస్తాడు, అందువల్ల అతడు పూర్తిగా అన్ని భౌతిక కాలుష్యములను స్వయంగా కడిగి వేసుకుంటాడు. ఆయన చివరకు అన్ని కాలుష్యాల నుండి ముక్తి పొంది నప్పుడు, ఆయన మహోన్నతమైన పరిపూర్ణము, కృష్ణ చైతన్యమును పొందుతాడు. "
ప్రభుపాద: ఇది, ఇది... అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి, భగవంతుడు... భగవంతుడు పవిత్రమైనవాడు, ఆయన రాజ్యం కూడా పవిత్రమైనది, అక్కడ ప్రవేశించాలని కోరుకునే వారు ఎవ్వరైనా ఆయన కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఇది చాలా సహజమైనది, మీరు నిర్దిష్టమైన సమాజంలో ప్రవేశించాలనుకుంటే, మీరు మీకు అర్హత ఉందని నీరూపించుకోవాలి. కొన్ని ఉన్నాయి... అర్హత... తిరిగి ఇంటికి వెళ్ళటానికి, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళటానికి, అర్హత ఏమిటంటే మీరు భౌతికముగా కలుషిత మవ్వకూడదు. ఆ భౌతిక కాలుష్యం ఏమిటి? భౌతికము కాలుష్యం ఇంద్రియ తృప్తి. నియంత్రణ లేని ఇంద్రియ తృప్తి. అది భౌతిక కాలుష్యం. మీరు భౌతికము కాలుష్యం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవాలి. అప్పుడు మీరు భగవంతుని రాజ్యంలోకి ప్రవేశించడానికి అర్హులు అవుతారు. అన్ని భౌతిక కలుషితాల నుండి విడుదల చేయబడటం లేదా కడిగి వేయడము అనే పద్ధతి యోగ పద్ధతి. యోగ పద్ధతి అనగా మీరు పదిహేను నిమిషాల పాటు కూర్చుని, ధ్యానం అని పిలువబడే దాని కొరకు, మీరు మీ అన్ని భౌతికము కాలుష్యములను కొనసాగిస్తారు. ఉదాహరణకు మీరు ఒక నిర్దిష్టమైన వ్యాధి నుండి నయము చేసుకోవాలని కోరుకుంటే, మీరు వైద్యుడు ఇచ్చిన నియంత్రణను అనుసరించాలి. అదేవిధముగా, ఈ అధ్యాయంలో, యోగాభ్యాసము సిఫారసు చేయబడింది, మీరు దీన్ని ఎలా చేయాలి. కాబట్టి మీరు ఆ ఇవ్వబడిన పద్ధతులను అమలు చేస్తే, మీరు భౌతిక కాలుష్యం నుండి విముక్తులు అవుతారు. అప్పుడు మీరు వాస్తవమునకు భగవంతునితో సంబంధము కోసం తయారుగా ఉంటారు ఇది కృష్ణ చైతన్యము.
మన పద్ధతి మిమ్మల్ని నేరుగా కలుపుతుంది. ఇది భగవంతుడు చైతన్య మహాప్రభువు యొక్క ప్రత్యేక బహుమతి. వెంటనే కృష్ణుడితో ఆయనని కలపటానికి. చివరికి మీరు అంతిమముగా ఆ స్థానమునకు రావాలి, కృష్ణ చైతన్యము. కావున ఇక్కడ ఉన్న ఈ పద్ధతి, నేరుగా, వెంటనే... ఇది ఆచరణాత్మకముగా కూడా ఉంది. ఏ అర్హత లేని, వారు - కేవలం ఈ సమాజముతో సంబంధములోనికి వచ్చిన వారు వారు కృష్ణ చైతన్యములో బాగా అభివృద్ధి చెందినారు. ఇది ఆచరణాత్మకమైనది. కాబట్టి ఈ యుగములో మనుషులకు అవకాశం ఇవ్వాలి, నేరుగా సంబంధము ఏర్పర్చుకొనుటకు. నెమ్మదిగా ఉండే పద్ధతి వారికి సహాయం చేయదు,ఎందుకంటే జీవిత కాలము చాలా తక్కువ వారు చాలా అదృష్టం కలిగి లేరు, వారి సాంగత్యము చాలా చెడ్డది. అందువలన, నేరుగా సంబంధము ఏర్పర్చుకొనుటకు - హరేర్ నామ ( CC adi 17.21) కేవలం కృష్ణుడు ఆయన ఆద్యాత్మిక నామము రూపంలో ఇవ్వబడుతున్నాడు మీరు ఆయనని వినడం ద్వారా వెంటనే సంబంధము కలిగి ఉంటారు. మీకు సహజ మార్గము ఉన్నది, శ్రవణము. మీరు కేవలము "కృష్ణ" ను వినండి మీరు తక్షణమే పవిత్రము అవుతారు. కొనసాగించు