TE/Prabhupada 0693 - మనము సేవ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎటువంటిఉద్దేశం లేదు. సేవ అంటే ప్రేమLecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

భక్తుడు: "భజత్ దాని మూలము భజ్ అను క్రియలో కలిగి ఉంది అది సేవ అవసరమైనప్పుడు ఉపయోగించబడుతుంది. ఆంగ్ల పదం "ఆరాధన" ను భజ్ అనే ఒకే అర్థంలో ఉపయోగించలేము. ఆరాధన అంటే గౌరవించటము, లేదా విలువైన వ్యక్తికి గౌరవం మరియు మర్యాద ఇవ్వటము. కాని సేవ ప్రేమ మరియు విశ్వాసముతో ముఖ్యంగా భగవంతునికి దేవాదిదేవుడి కొరకు ఉద్దేశించబడింది."

ప్రభుపాద: అవును. ఆరాధన మరియు సేవ చేయడము, అవి భిన్నమైనవి. ఆరాధన అంటే ఏదో కొంత ప్రేరణ ఉంటుంది. నేను ఎవరైనా మిత్రుడిని లేదా ఎవరైనా గొప్ప మనిషిని ఆరాధిస్తాను నాకు ఏదో కొంత ప్రేరణ ఉన్నది. ఈ గొప్ప మనిషి చాలా గొప్ప వ్యాపారవేత్త, నేను ఆయనని సంతోష పెట్టినట్లయితే ఆయన నాకు కొంత వ్యాపారమును ఇస్తాడు, నేను కొంత లాభం పొందుతాను. కాబట్టి దేవతల ఆరాధన ఆ విధముగా ఉంటుంది వారు వేర్వేరు దేవతలను పూజిస్తారు ప్రత్యేక ప్రయోజనము కోసము ఇది భగవద్గీతలో ఖండించబడింది, మీరు దానిని ఎనిమిదో (ఏడవ) అధ్యాయంలో చూస్తారు. Kāmais tais tair hṛta-jñānāḥ prapadyante 'nya devatāḥ ( BG 7.20) తమ వివేకమునును కోల్పోయిన వారు, తీవ్రముగా లైంగిక వాంఛతో తికమకపడుతున్నవారు, దేవతలను కోరికలతో ఆరాధించటానికి వెళతారు. కాబట్టి మనము ఆరాధన గురించి మాట్లాడినప్పుడు, కోరిక ఉంది. కాని మనము సేవ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఉద్దేశం లేదు. సేవ అంటే ప్రేమ. ఉదాహరణకు తల్లి పిల్లవాడికి సేవను చేస్తుంది. ఏ ఉద్దేశ్యం లేదు. అది ప్రేమ మాత్రమే. ప్రతి ఒక్కరూ ఆ పిల్లవాడిని నిర్లక్ష్యం చేయవచ్చు, కానీ ఆ తల్లి చేయలేదు. ఎందుకంటే ప్రేమ ఉంది. అదేవిధముగా bhaj-dhātu, సేవ అనే ప్రశ్న ఉన్నప్పుడు, ఉద్దేశ్యం అనే ఏ ప్రశ్న ఉండదు. అది కృష్ణ చైతన్యము యొక్క పరిపూర్ణత.

ఇది మొదటి-తరగతి మత సూత్రం. ఇది శ్రీమద్-భాగవతములో సిఫారసు చేయబడింది. అది ఏమిటి? Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) ఈ భక్తి, ఈ భజన, అదే మూలం, ఆ పద్ధతి యొక్క మతపరమైన సూత్రం మొదటి తరగతిది. అది ఏమిటి? Yato bhaktir adhokṣaje. దానిని చేయడము ద్వారా వ్యక్తులు దేవుడి మీద తన భగవత్ చైతన్యము లేదా దేవుడి మీద ప్రేమను అభివృద్ధి చేసుకోవచ్చు. అంతే. మీరు దేవుడు మీద ప్రేమను వృద్ధి చేసుకోగలిగితే, మీరు ఏ మత సూత్రాన్ని అయినా అనుసరించవచ్చు, పట్టింపు లేదు. కాని మీరు తప్పక ... పరీక్ష ఏమిటంటే మీరు దేవుడు పట్ల మీ ప్రేమను ఎంతగా అభివృద్ధి చేసుకుంటున్నారు. కాని మీరు ఏదైనా ఉద్దేశ్యం కలిగి ఉంటే - మతపరమైన పద్ధతి యొక్క ఈ పద్ధతిని అభ్యసిస్తూ ఉంటే, నా భౌతిక అవసరాలు నెరవేరుతాయి - ఇది మొదటి తరగతి ధర్మము కాదు. ఇది మూడవ తరగతి ధర్మము. మొదటి-తరగతి ధర్మము అంటే, దాని ద్వారా మీరు దేవుడు మీద మీ ప్రేమను అభివృద్ధి చేసుకోవచ్చు. Ahaituky apratihat. ఏ కారణం లేకుండా మరియు ఏ అవరోధం లేకుండా. అది మొదటి తరగతి. అది సిఫారసు చేయబడుతోంది. ఈ యోగ పద్ధతి, కృష్ణ చైతన్యము, మీరు మతము వైపు నుండి తీసుకున్న, ఇది మొదటి తరగతి. ఎందుకంటే ఏ ఉద్దేశం లేనందున. వారికి ఇది లేదా అది కావాలని వారు కృష్ణుడికి సేవ చేయడము లేదు. కాదు అక్కడ ఇది లేదా అది, ఉండవచ్చు. పట్టింపు లేదు. వారు వినియోగమై ఉన్నారు - కాని దేనికి ఎటువంటి కొరత ఉంది. వారు ప్రతిదీ పొందుతారు. కృష్ణ చైతన్యవంతుడు అయిన వ్యక్తి పేదవాడు అవుతాడని అనుకోవద్దు. కాదు కృష్ణుడు ఉంటే అక్కడ ప్రతిదీ ఉంటుoది, ఎందుకంటే కృష్ణుడు ప్రతిదీ. కాబట్టి ... కాని మనము కృష్ణుడితో ఏ వ్యాపారము చేయకూడదు, కృష్ణా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు. కృష్ణుడుకి మీకంటే బాగా తెలుసు. ఉదాహరణకు ఒక పిల్లవాడు తల్లిదండ్రుల నుండి డిమాండ్ చేసినట్లు, నా ప్రియమైన తండ్రి, నా ప్రియమైన తల్లి, నాకు ఇది ఇవ్వండి లేదా నాకు అది ఇవ్వండి. పిల్లల అవసరాలు తండ్రికి తెలుసు. కాబట్టి దేవుణ్ణి అడగటము ఇది చాలా మంచి పని కాదు, నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి. నేను ఎందుకు అడగాలి? దేవుడు సర్వశక్తిమంతుడైతే, ఆయనకు నా అవసరాలు తెలుసు ఇది కూడా వేదాలలో ధృవీకరించబడింది. Eko bahūnāṁ vidadhāti kāmān. ఆ ఒకే ఒక దేవుడు ట్రిలియన్ల, ట్రిలియన్ల జీవులు అందరి అవసరాలను తీరుస్తున్నాడు, అపరిమితమైన, లెక్కలేనన్ని, జీవులు ఉన్నాయి.

కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిoచడానికి ప్రయత్నిoచాలి. ఏమీ కోరకూడదు. కోరిక ఇప్పటికే సరఫరా చేయబడింది. పిల్లులు కుక్కలు కూడా వాటి అవసరాలను పొందుతున్నాయి. అవి చర్చికి వెళ్లి, దేవుడు నుండి ఏదైనా అడగవు, కాని అవి పొందుతున్నాయి. అందుచేత భక్తుడు ఎందుకు పొందడు? ఒక పిల్లి లేదా ఒక కుక్క, దేవుడిని కోరకుండా జీవితములో అవి తమ అవసరాలను పొందుతున్నప్పుడు, ఇది నాకు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని దేవుడు నుండి నేను ఎందుకు కోరాలి. లేదు. మనం కేవలము ఆయనను ప్రేమించడానికి ప్రయత్నిస్తాము. అది ప్రతిదీ నెరవేరుస్తుంది. దానిని యోగ యొక్క ఉన్నతమైన స్థాయి అంటారు. కొనసాగించండి.

భక్తుడు: "ఒకరు గౌరవప్రదమైన వ్యక్తిని లేదా దేవతను ఆరాధించడము మాన వచ్చును, అయినను అమర్యాదస్థుడు అని పిలువవచ్చును కాని ఒకరు దేవాదిదేవుడిని సేవిoచడము ఆపకూడదు. విస్తృతంగా నిందలు పడకుండా. ప్రతి జీవి దేవాదిదేవునిలో భాగం, ఆ విధముగా ప్రతి జీవి తన సొంత స్వరూపం స్థితి ద్వారా దేవాదిదేవుడికి సేవ చేయడానికి ఉద్దేశించబడ్డాడు."

ప్రభుపాద: అవును. ఇది సహజమైనది. నేను దేవుడిలో భాగం అయితే నా బాధ్యత సేవ చేయడము. ఈ ఉదాహరణను నేను మీకు అనేక సార్లు ఇచ్చాను. ఉదాహరణకు ఈ వేలు నా శరీరం యొక్క భాగము. కావున ఈ వేలు యొక్క కర్తవ్యము ఏమిటి? వేలు యొక్క కర్తవ్యము మొత్తం శరీరమునకు సేవ చేయడము. అంతే నేను కొంత దురదతో బాధపడుతుంటే, వెంటనే వేలు పనిచేస్తుంటుంది. మీరు చూడoడి? నేను చూడాలనుకుంటే, కళ్ళు వెంటనే పని చేస్తాయి. నేను వెళ్లాలనుకుంటే, కాళ్ళు వెంటనే నన్ను తీసుకువేళ్ళుతాయి. కాబట్టి ఈ శరీర యొక్క భాగములు, అవయవాలు, నాకు సహాయం చేస్తున్నట్లుగా, శరీరము మొత్తం, నేను తిoటున్నాను, కడుపు, నేను తినడం మాత్రమే చేస్తున్నాను. అదేవిధముగా దేవుడు కేవలం ఇతర భాగాల నుండి సేవలను స్వీకరించడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాడు. సేవ చేయడానికి కాదు. సేవ, శరీర అవయవాలు మొత్తం శరీరమునకు సేవ చేస్తుంటే, శక్తి సహజముగ శరీరం యొక్క భాగాలకు వస్తుంది. అదేవిధముగా మనము కృష్ణుడికి సేవ చేస్తే, మనము మన అవసరములు అన్ని పొందుతాము సహజముగా, Yathā taror mūla-niṣecanena ( SB 4.31.14) ఉదాహరణకు, చెట్టు యొక్క మూలంలో నీరు పోయడం వలె, వెంటనే , ఆకులకు, కొమ్మలకు, ప్రతిచోటకి శక్తి సరఫరా చేయబడుతుంది. అదేవిధముగా, కేవలం కృష్ణుడిని లేదా దేవుణ్ణి సేవించడం ద్వారా, మీరు అన్ని ఇతర భాగాలకు సరఫరా చేస్తారు, మీరు అన్ని ఇతర భాగాలకు సేవ చేస్తారు. విభిన్నంగా సేవ చేసే ప్రశ్నే లేదు. ప్రతిదీ సహజముగా వస్తుంది. అంతా...

సానుభూతి మానవులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా సానుభూతి వస్తుంది. భగవత్ చైతన్యం, కృష్ణ చైతన్యము చాలా బాగుంటుoది. భగవత్ చైతన్యము లేకుండా, కృష్ణ చైతన్యము లేకుండా, ఇతర జీవుల పట్ల సానుభూతి చాలా తక్కువగా ఉంటుoది. కాని భగవత్ చైతన్యముతో, కృష్ణ చైతన్యముతో, ఇతర జీవుల పట్ల సానుభూతి పూర్తిగా ఉంటుంది. అది పద్ధతి. కొనసాగించండి