TE/Prabhupada 0696 - భక్తి-యోగా అనేది స్వచ్చమైన భక్తి



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


భక్తుడు: "వాస్తవానికి, భక్తి-యోగ అంతిమ లక్ష్యం, భక్తి-యోగాను విశ్లేషించండి, ఒకరు ఈ ఇతర చిన్న యోగాలను అర్థం చేసుకోవాలి. ప్రగతిశీలమైన యోగి శాశ్వతంగా శుభమునిచ్చే వాస్తవమైన మార్గంలో ఉన్నాడు. ఒక నిర్దిష్ట అంశం పై వుండి పోయి మరింత పురోగతి చేయని వ్యక్తిని అ నిర్దిష్ట పేరుతో పిలుస్తారు. "

ప్రభుపాద: అవును. ఇప్పుడు, ఎవరైనా జ్ఞాన-యోగ సాధన చేస్తే, ఆయన అది పూర్తయిందని అనుకుంటే, అది తప్పు. మీరు మరింత పురోగతి సాధించాలి. మనం అనేక సార్లు ఉదాహరణగా ఇచ్చినట్లుగా, మెట్లు ఉంటాయి. మీరు వందవ అంతస్థుకు వెళ్ళవలసి ఉంటుంది ఎత్తైన అంతస్తుకి. కాబట్టి కొంత మంది 50 వ అంతస్తులో ఉంటారు, కొంత మంది ముప్పై అంతస్తులో ఉంటారు, కొంత మంది ఎనభై అంతస్తులో ఉంటారు. కాబట్టి ఎవరైనా ప్రత్యేకముగా, ఎనభై , యాభై లేదా ఎనభై అంతస్తులకి వచ్చి, "ఇది పూర్తయిందని" అనుకుంటే అప్పుడు ఆయన పురోగతి చెందడము లేదు. చివరి వరకు వెళ్ళాలి. అది యోగ యొక్క అత్యధిక స్థితి. మొత్తం మెట్లను ఒక యోగ పద్ధతి అని పిలువ వచ్చు, కలిపే కొక్కెం. కానీ 50 వ అంతస్తులో లేదా ఎనభై అంతస్థులో మిమ్మల్ని మీరు ఉంచుకోవడము ద్వారా సంతృప్తి చెందకండి. అత్యధిక ప్లాట్ఫారమ్, వందవ వంద లేదా నూట యాభై-అంతస్థుకు వెళ్ళండి. అది భక్తి-యోగ. కొనసాగించు.

భక్తుడు: "కానీ భక్తి-యోగ యొక్క స్థితికి రావటానికి ఒకరికి తగినంత అదృష్టం ఉంటే, ఆయన వివిధ రకములైన అన్నియోగాలను అధిగమించాడని అర్థం చేసుకోవాలి. "

ప్రభుపాద: ఇప్పుడు, ఎవరైనా దశలను దాటే బదులుగా, ఆయనకు ఎలివేటర్ యొక్క అవకాశం ఇవ్వబడితే, ఒక క్షణం లోపల ఆయన పైకి వస్తాడు. కాబట్టి ఎవరైనా చెప్పినట్లయితే, "ఈ ఎలివేటర్ యొక్క లాభమును ఎందుకు తీసుకోవాలి? నేను దశల వారీగా వెళ్ళుతాను, "ఆయన వెళ్ళవచ్చు, కానీ అవకాశం ఉంది. మీరు ఈ భక్తి-యోగ తీసుకుంటే, వెంటనే మీరు ఎలివేటర్ సహాయం తీసుకుంటారు ఒక క్షణం లో మీరు వందవ అంతస్తులో ఉంటారు. ఇది పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి. అన్ని ఇతర యోగ పద్ధతులను అనుసరిస్తూ మీరు దశల వారీగా వెళ్ళవచ్చు. కానీ మీరు నేరుగా తీసుకోవచ్చు. భగవంతుడు చైతన్య ఈ యుగంలో దానిని సిఫార్సు చేసినారు, ప్రజలు చాలా స్వల్ప జీవిత కాలము నివసిస్తారు అని, వారు కలత చెంది ఉన్నారు. వారు ఆందోళనతో నిండి ఉన్నారు. అందువలన ఆయన దయ ద్వారా, ఆయన యొక్క కారణము లేని కృప ద్వారా, మీకు లిఫ్ట్ ఇస్తున్నాడు వెంటనే - హరే కృష్ణ కీర్తన చేయడము ద్వారా భక్తి-యోగాకు రండి. తక్షణమే. మీరు వేచి ఉండవలసిన అవసరము లేదు. తక్షణమే తీసుకోండి. ఇది భగవంతుడు చైతన్య యొక్క ప్రత్యేక బహుమతి. అందువల్ల రూప గోస్వామి ప్రార్థిస్తున్నాడు, భగవంతుడు చైతన్యకు గౌరవం ఇస్తున్నాడు: namo mahā-vadānyāya kṛṣṇa-prema-pradāya te ( CC Madhya 19.53) మీరు చాలా ఉదారమైన అవతారం, ఎందుకంటే మీరు కృష్ణుడి ప్రేమను నేరుగా ఇస్తున్నారు. కృష్ణుడి యొక్క ప్రేమను సాధించటానికి యోగా పద్ధతి యొక్క చాలా దశలలో ఉతీర్ణులు అవ్వాలి మీరు నేరుగా ఇస్తున్నారు. అందువల్ల నీవు చాలా ఉదారమైనవారు. " నిజానికి అది పరిస్థితి. కొనసాగించు.

భక్తుడు: "అందువల్ల, కృష్ణ చైతన్య వంతులమవ్వటము యోగ యొక్క అత్యున్నత దశ, ఉదాహరణకు మనము హిమాలయాల గురించి మాట్లాడేటప్పుడు, మనము ఎత్తైన వాటిగా చెప్తాము ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలుగా, వీటిలో ఎత్తైన పర్వతం, ఎవరెస్ట్ పర్వతం, అది చివరిదిగా పరిగణించబడుతుంది. భక్తి-యోగ మార్గములోకి రావడము, కృష్ణ చైతన్యములోనికి రావడము గొప్ప అదృష్టము వలన వస్తారు, వేదముల మార్గం ప్రకారం చక్కగా స్థిరపడి ఉంటారు. ఆదర్శ యోగి కృష్ణుడిపై తన దృష్టిని కేంద్రీకరిస్తాడు, కృష్ణుడిని శ్యామ సుందర అని పిలుస్తారు, అందమైన రంగును కలిగి ఉన్నాడు మేఘము వలె, ఆయన కమలము వంటి ముఖము సూర్యుడు వలె ప్రకాశముగా ఉంటుంది ఆయన దుస్తులు అద్భుతముగా ఉంటాయి చెవిపోగులతో, ఆయన శరీరము పుష్పముల-మాలతో ఉంటుంది అన్ని వైపులా ప్రకాశించే బ్రహ్మాండమైన మెరుపు ఉంటుంది దానిని బ్రహ్మజ్యోతి అని పిలుస్తారు. ఆయన రామా, నరసింహా, వరహా వంటి వివిధ రూపాల్లో అవతరిస్తాడు కృష్ణుడు, భగవంతుడు మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఒక మనిషి వలె అవతరిస్తాడు, తల్లి యశోద కుమారుడు వలె, మరియు అతనిని కృష్ణా, గోవిందా, వాసుదేవా అని పిలుస్తారు. ఆయన పరిపూర్ణ పిల్లవాడు, భర్త, స్నేహితుడు, గురువు; ఆయన అన్ని సంపదలను దివ్యమైన లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్నాడు. ఒకవేళ భగవంతుడు యొక్క ఈ లక్షణాల గురించి పూర్తి అవగాహన ఉన్నట్లయితే, అతడు అత్యధిక యోగి అని పిలువబడతాడు. యోగాలో అత్యధిక పరిపూర్ణమైన ఈ దశను భక్తి-యోగ ద్వారా మాత్రమే పొందవచ్చు, అన్ని వేదముల సాహిత్యాలలో ధ్రువీకరించబడినట్లుగా."

ప్రభుపాద: భగవద్గీతలో మీరు కనుగొంటారు, ఆ భక్తి, ఆ bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ( BG 18.55) కృష్ణుడు ప్రారంభంలో చెప్పారు అనేక లక్షల మంది వ్యక్తులలో, వాస్తవమునకు ఒకరు నన్ను వాస్తవముగా అర్థము చేసుకుంటారు. అదే వాస్తవముగా అనే పదమును పద్దెనిమిదవ అధ్యాయంలో ఉపయోగించబడింది, నా గురించి తెలుసుకోవాలంటే, కృష్ణుడు లేదా భగవంతుడిని, అప్పుడు ఆయన భక్తి-యోగ పద్ధతి ద్వారా వెళ్ళాలి. Bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ( BG 18.55) ఇది స్పష్టంగా చెప్పబడింది. వేదాలలో కూడా చెప్పబడింది: కేవలం భక్తి ద్వారా, భక్తియుక్త సేవ, మీరు అత్యధిక పరిపూర్ణ దశకు చేరుకోవచ్చు. ఇతర యోగ పద్ధతులలో భక్తి యొక్క మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. కానీ భక్తి-యోగా అనేది స్వచ్చమైన భక్తి. అందువల్ల భక్తి-యోగ యొక్క ఈ ప్రత్యక్ష పద్ధతి ఈ యుగమునకు సిఫార్సు చేయబడింది, ఎందుకంటే వారికి తగినంత సమయము లేదు అన్ని నియమాలను అమలు చేయడానికి, ఇతర ఏ యోగా పద్ధతి యొక్క. చాలా ధన్యవాదాలు. (విరామం)