TE/Prabhupada 0699 - ప్రేమలో ఉన్న భక్తుడు, తన వాస్తవ రూపంలో కృష్ణుడిని ప్రేమిస్తాడు



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


భక్తుడు: ప్రభుపాద, ఈ రోజు ఉదయము మనము భగవద్గీత చదువుతున్నాము- కృష్ణుడి విశ్వ రూపము గురించి - ఆయన అర్జునుడికి తనకు తాను వెల్లడి చేసినపుడు - ఆయన చెప్పాడు దేవతలు మరియు భక్తులు, ఈ విశ్వరూపం చూసినప్పుడు రాక్షసులు అందరూ భయపడ్డారు. ఎలా? కృష్ణుడి భక్తులు ఉదాహరణకు దేవతలు, వారు విశ్వరూపాన్ని చూసినప్పుడు భయపడ్డారు?

ప్రభుపాద: ఎందుకంటే వారు విశ్వరూపాన్ని ప్రేమించలేరు. అది అర్థమైనదా? మీరు విశ్వరూపాన్ని ప్రేమిస్తారా? కృష్ణుడు నీ ముందు విశ్వరూపములో వస్తే (నవ్వుతూ) మీరు మీ ప్రేమను మరచిపోతారు విశ్వారూపాన్ని ప్రేమించవద్దు. శ్యామసుందరుడిని ప్రేమించండి అంతే. యుద్ధ సమయములో విశ్వరూపములో కృష్ణుడిని మేము చూశాము. డిసెంబరు 1942 లో,తేది నేను మర్చిపోయాను. కలకత్తాలో నేను అప్పుడే తినడం మొదలు పెట్టాను. బాంబు దాడి జరగనున్నట్లు సైరన్ వచ్చింది. మీరు చూడండి? కాబట్టి ఏర్పాటు ఏమిటంటే, బాంబు యొక్క సైరన్ ఉన్న వెంటనే, ప్రభుత్వం ఒక ప్రదేశమును, ఆశ్రయం గదిని ఎంపిక చేసింది, మీ ఇంట్లో ఈ గది ఆశ్రయం గదిగా ఉంటుంది అందువల్ల మేము ఆ ఆశ్రయ గదిలోకి వెళ్ళవలసి వచ్చింది బాంబు దాడి ప్రారంభమైంది - (బాంబు ధ్వని అనుకరిస్తున్నారు). కాబట్టి మేము ఆ విశ్వరూపమును చూసాము, ఆ సమయంలో మీరు చూడండి అయితే నేను ఆలోచిస్తున్నాను, ఇది కూడా కృష్ణుడి యొక్క మరొక రూపం. కానీ ఆ రూపం చాలా ప్రేమించదగిన రూపం కాదు, మీరు చూడండి? (నవ్వు) ప్రేమలో ఉన్న భక్తుడు, తన వాస్తవ రూపంలో కృష్ణుడిని ప్రేమిస్తాడు. ఈ విశ్వరూపము ఆయన వాస్తవ రూపం కాదు. ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తాడు, అది ఆయన సంపూర్ణ-శక్తి. కానీ కృష్ణుడి ప్రేమపూర్వక రూపం, శ్యామసుందర.

ఉదాహరణకు ఒక బాలుడి తండ్రి ఒక పోలీసు అధికారి అని అనుకుందాం. అయితే తండ్రి రివాల్వర్తో పేలుస్తున్న పోలీసు అధికారిగా వస్తే, పిల్లవాడు కూడా తనను ప్రేమిస్తున్న తండ్రిని మర్చిపోతాడు. మీరు చూడండి? కాబట్టి సహజంగా పిల్లవాడు తండ్రిని ప్రేమిస్తాడు ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఒక తండ్రి వలె ఉంటే అదేవిధముగా మనము కృష్ణుడిని ఇష్టపడుతున్నాము ఆయన వలె - శ్యామ సుందరునిగా. విశ్వరూపము దుష్టులైన మానవజాతిని హెచ్చరించడానికి అర్జునుడికి చూపించబడింది. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు, "నేను భగవంతుణ్ణి." కృష్ణుడిని అనుకరించడం, చాలామంది దుష్టులు "నేను భగవంతుడను" అని ప్రకటించుకుంటున్నారు. అందువల్ల అర్జునుడు అడిగాడు, "నాకు మీ విశ్వరూపమును చూపించండి." అందువల్ల ఈ దుష్టులను కూడా అతనిని తన విశ్వరూపమును చూపించమని అడగవచ్చు. మీరు భగవంతుడు అయితే, మీ విశ్వరూపమును నాకు చూపించండి. అది వారు చేయలేరు. అవును?

భక్తుడు: మనం మాయను గౌరవించాలి కదా ఆయన శక్తిగా...?

ప్రభుపాద: హ్? భక్తుడు: మనము మాయాదేవిని మనం గౌరవంగా చూడాలి కదా?

ప్రభుపాద: మీరు కృష్ణుడిని గౌరవిస్తే, మీరు ప్రతి ఒక్కరితో గౌరవప్రదంగా ఉంటారు. అది భక్తుడి యొక్క అర్హత. మీరు ఒక చీమ పట్ల కూడా గౌరవప్రదంగా ఉంటారు. మాయ గురించి ఏమి మాట్లాడాలి? కృష్ణుడు యొక్క ముఖ్యమైన శక్తిలో మాయ ఒకటి. ఎందుకు మీరు మాయను గౌరవించకూడదు? మనం... మాయ, దుర్గను మనము ప్రార్థిస్తాము, "దుర్గ" - sṛṣṭi-sthiti-pralaya-sādhana-śaktir ekā chāyeva yasya (BS 5.44) మనము దుర్గను ప్రార్థిస్తే, అంటే మనము కృష్ణుడిని ప్రార్థిస్తున్నాము వెంటనే ఎందుకనగా మనము కృష్ణుడిని ప్రతిచోటా చూడవలసి ఉంటుంది. మనము మాయ యొక్క కార్యక్రమాలను చూస్తున్నాము. కాబట్టి మనము వెంటనే కృష్ణుడిని చూడవలసి ఉంటుంది - "ఈ మాయ కృష్ణుడి దర్శకత్వంలో చాలా చక్కగా నడుచుకుంటుంది." కాబట్టి పోలీసు అధికారిని గౌరవించడము అంటే ప్రభుత్వాన్ని గౌరవించడము. ఎంత కాలము ఆ వ్యక్తి ఉద్యోగములో ఉంటాడో, మనము గౌరవము ఇస్తాము. ఉద్యోగములో లేకపోతే. ఉద్యోగములో ఉన్నా, లేకపోయినా ఒక మర్యాదస్తుడు గౌరవముగా చూస్తాడు. అది పట్టింపు లేదు. అయితే వాస్తవానికి మీరు ఒక పోలీసుకు గౌరవము ఇస్తే - మాయ అంటే పోలీసు విభాగముగా వ్యవహరిస్తుంది. అంటే మీరు ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారు అని అర్థం. కాబట్టి ఇది గౌరవము ఇవ్వటము. గోవిందం ఆది పురుషం.

sṛṣṭi-sthiti-pralaya-sādhana-śaktir ekā
chāyeva yasya bhuvanāni vibharti durgā
icchānurūpam api yasya ca ceṣṭate sā
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.44)

ఈ దుర్గా, ఈ భౌతిక శక్తి, చాలా శక్తివంతమైనది - ఇది సృష్టించగలదు, ఇది నాశనము చేయగలదు, ఇది నిర్వహించగలదు. కానీ ఆమె కృష్ణుడి దర్శకత్వంలో నడుచుకుంటుంది. అందువల్ల నా గౌరవప్రదమైన ప్రణామములు గోవిందునకు అర్పిస్తున్నాను. ఆయన మార్గనిర్దేశములో ఆమె నడుచుకుంటుంది కాబట్టి మీరు మాయను గౌరవిస్తే, అంటే మనము వెంటనే కృష్ణుడిని గౌరవిస్తున్నాము అని అర్థము.