TE/Prabhupada 0717 - నా తండ్రి భక్తుడు, ఆయన నాకు శిక్షణ ఇచ్చారు



Room Conversation -- January 26, 1975, Hong Kong


ప్రభుపాద: ప్రహ్లాద మహారాజు వలె, మీ జీవితం యొక్క ప్రారంభం నుండి, kaumāra ācaret prājño dharmān bhāgavatān iha ( SB 7.6.1) ఆయనకు ఐదు సంవత్సరాలు, తన జీవిత ప్రారంభము నుండి ఆయన కృష్ణ చైతన్యమును కలిగి ఉన్నాడు, ఆయన తన తరగతి స్నేహితుల మధ్య కృష్ణ చైతన్యముని ప్రచారము చేసే వాడు. ప్రహ్లాద మహారాజా, పాఠశాలలో, ఆయన చిన్న పిల్లలకు కృష్ణ చైతన్యమును ప్రచారము చేసేవాడు. కాబట్టి అనుసరించడానికి ప్రయత్నించండి, mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) ప్రహ్లాద మహారాజు, ధ్రువ మహారాజు వలె గొప్ప వ్యక్తుల అడుగుజాడలను అనుసరించండి. వారు పిల్లలు ;అయినప్పటికీ వారు అత్యంత ఉన్నతమైన భక్తులు అయ్యారు. చాలా మంది ఇతరులు ఉన్నారు. కుమారాస్, వారు చాలా ఉన్నతమైన భక్తులు. కాబట్టి దీనికి చిన్న ప్రయత్నం అవసరం. ప్రహ్లాద మహారాజు తండ్రి రాక్షసుడు, నాస్తికులలో మొదటి వాడు. అయినప్పటికీ, ప్రహ్లాద మహారాజుకు నారదముని నుండి శ్రవణము చేయడానికి అవకాశం వచ్చినది ఆయన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు. నారదముని తన తల్లికి సూచన ఇస్తున్నాడు, కానీ ప్రహ్లాద మహారాజు తన తల్లి గర్భంలోనే నారద ముని నుండి ప్రతిదీ విన్నారు. తల్లి గర్భంలో నుండి బయటకు రావడానికి ముందు ఆయన భాగవత తత్వమును అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన జీవితపు ప్రారంభం నుండి ఆయన భాగవతుడు. భాగవతుడు అంటే భక్తుడు.

కాబట్టి మనము ప్రహ్లాద మహారాజును, ధ్రువ మహారాజును అనుసరించవచ్చు. అయితే, తల్లిదండ్రుల సహాయం అవసరం. లేకపోతే, మనము భాగవత -ధర్మము లేదా భక్తి-యోగాను అభ్యసిస్తే మన జీవితపు ప్రారంభం నుండి ఇది విజయవంతమైన జీవితం. అదృష్టవశాత్తూ, నాకు బాల్యం నుండి భాగవత-ధర్మము నేర్చుకోవటానికి మంచి అవకాశము లభించినది. నా తండ్రి భక్తుడు, ఆయన నాకు శిక్షణ ఇచ్చారు. అందువల్ల భాగవత-ధర్మములో పిల్లలకు శిక్షణ ఇవ్వడము అందరి తల్లిదండ్రుల బాధ్యత ఇది. అప్పుడు జీవితం విజయవంతమవుతుంది. లేకపోతే జీవితం విజయవంతం కాదు. పతనము అయ్యే అవకాశము ప్రతి ఒక్కరికి ఉంటుంది. క్రింద పడిపోవడం అంటే జీవితం ఆధ్యాత్మిక జీవితం యొక్క స్థితి పైకి రావడము కోసం ఉద్దేశించబడింది. మనము అలా చేయకపోతే, మనం జంతువుల స్థాయికి వస్తాము. అనేక జీవ జాతులు ఉన్నాయి. మీరు మీ ముందు చూసినట్లు. ఒకరు పిల్లులు మరియు కుక్కలు కూడా కావచ్చు. ఒక గొప్ప శాస్త్రం ఉంది, కానీ ప్రజలకు జ్ఞానం లేదు, పాఠశాలలో, కళాశాలల్లో ఈ విషయాలు భోదించరు. ఉపాధ్యాయులు చదువుకున్న వ్యక్తులు అని పిలవబడే వారు వారికీ తెలియదు. వారికీ తెలియదు.

వీలైనంతవరకూ ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిoచండి హరే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తన చేయండి మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు. మీకు తగినంత సమయం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభ్యర్థన. మనము ప్రపంచ వ్యాప్తంగా ప్రచారము చేస్తున్నాము.