TE/Prabhupada 0737 - కాబట్టి మొదటి ఆధ్యాత్మిక జ్ఞానం ఇది, నేను శరీరం కాదు.
Lecture on BG 4.1 -- Bombay, March 21, 1974
ప్రభుపాద: శరీరం భిన్నముగా తయారు చేయబడినది ఆత్మ అదే. నీ ఆత్మ, నా ఆత్మ, ఒక్కటే. కానీ నీ శరీరం అమెరికన్ శరీరం అంటారు, నా శరీరం భారతీయ శరీరం అంటారు. ఇది తేడా. మీరు వేరే దుస్తులు పొందారు అలాగే. నాకు వేరే దుస్తులు ఉన్నాయి. వాసాంసి జీర్ణాని యథా వి... శరీరం కేవలం దుస్తుల వంటిది.
కాబట్టి మొదటి ఆధ్యాత్మిక జ్ఞానం ఇది, "నేను శరీరం కాదు." ఆధ్యాత్మిక జ్ఞానం అప్పుడు ప్రారంభమవుతుంది. లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎటువంటి అవకాశం లేదు. యస్యాత్మా బుద్ధిః కునపె త్రి- ధాతుకె స్వ-ధీః కలత్రాధిషు భౌమ యిజ్య-ధీః ( SB 10.84.13) నేను శరీరాన్ని,ఇది నేను అని చేస్తున్నవాడు అతడు మూర్ఖుడు, జంతువు. అంతే.ఈ మూర్ఖ జంతుప్రవ్రుత్తి, ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది. నేను అమెరికన్ ,"నేను భారతీయుడను," "నేను బ్రాహ్మణుడను," "నేను క్షత్రియుడను." ఇది మూర్ఖత్వం. మీరు దీనికి అతీతముగా ఉండాలి. అప్పుడు అక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. అది భక్తి యోగ.
- మాం చ యో 'అవ్యభిచారేన భక్తి -యోగేన
- సేవతే స గుణాన్ సమతీత్యైతాన్
- బ్రహ్మ- భూయాయ కల్పతె
- ( BG 14.26)
అహం బ్రహ్మాస్మి. ఇది అవసరం. ఈ యోగ పద్ధతి ని అర్థం చేసుకోవడానికి భక్తి యోగ... ఎందుకంటే కేవలం భక్తి యోగ ద్వారానే మీరు ఆధ్యాత్మిక స్థితికి రావచ్చు.
అహం బ్రహ్మస్మి. నాహం విప్రో... చైతన్య మహాప్రభు అన్నారు, నాహం విప్రొ న క్షత్రియ... ఆ శ్లోకము ఏమిటి?
భక్తుడు: కిబా విప్ర కిబా న్యాసి...
ప్రభుపాద: నేను బ్రాహ్మణుడిని కాదు, నేను క్షత్రియుడుని కాదు, నేను వైశ్యుడిని కాదు, నేను ఒక శూద్రుడిని కాదు. నేను బ్రహ్మచారిని కాదు, నేను గృహస్థున్ని కాదు, వానప్రస్థుడను కాదు... ఎందుకంటే మన వైదిక నాగరికత వర్ణాశ్రమము పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చైతన్య మహాప్రభు ఈ అన్ని విషయాలను ఖండించారు: "నేను వాటిలో ఏ ఒక్క దానికి చెందను." అప్పుడు మీ స్థానం ఏమిటి? గోపీ-భర్తుః పద కమలయోర్ దాస-దాసానుదాసః ( CC madhya 13.80) నేను గోపాల సంరక్షకుడికి నిత్య సేవకునిగా ఉన్నాను. అంటే కృష్ణుడు. ఆయన ప్రచారం చేసారు: జీవేర స్వరూప హయ నిత్య-కృష్ణ-దాస( CC Madhya 20.108-109) అది మన గుర్తింపు కృష్ణుడి శాశ్వత సేవకులము. అందుచేత కృష్ణుడిపై తిరుగుబాటు చేసిన సేవకులు, వారు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చారు. అందువల్ల ,ఈ సేవకులను తిరిగి కలుసుకోవడానికి, కృష్ణుడు వస్తారు . కృష్ణుడు చెప్పాడు,
- పరిత్రాణాయ సాధూనాం
- వినాశాయచ దుష్క్రతాం
- ధర్మ-సంస్థాపనార్థాయ
- సంభవామి యుగే యుగే
- ( BG 4.8)
కృష్ణుడు వస్తారు. ఆయన దయతో ఉంటాడు.
కాబట్టి కృష్ణుడు రాబోతున్న ప్రయోజనాన్ని తీసుకుందాం. ఆయన ఈ భగవద్గీతను వెనుక ఇచ్చినారు, అది పరిపూర్ణంగా చదవండి, మీ జీవితం సంపూర్ణం చేసుకోండి . ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. ఇది బూటకపు ఉద్యమం కాదు. ఇది చాలా శాస్త్రీయమైన ఉద్యమం. కాబట్టి భారతదేశం వెలుపల, ఈ యూరోపియన్లు, అమెరికన్లు, వారు ప్రయోజనం తీసుకుంటున్నారు. ఈ భారతీయ యువకులు ఎందుకు తీసుకోకూడదు? అక్కడ తప్పు ఏమిటి? ఇది మంచిది కాదు. మనం అందరం కలుద్దాము, ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును చాలా తీవ్రంగా ప్రారంభించండి , ఈ బాధలో ఉన్న మానవులను తరించండి. అది మా ఉద్దేశ్యం. జ్ఞానం కోసం వారు బాధపడుతున్నారు. అంతా ఉంది, పూర్తిగా . కేవలం నిర్వహణ లోపం వల్ల ...కేవలం ఇది పోకిరీలు దొంగల ద్వారా నిర్వహించబడుతుంది. తీసుకోండి. మీరు కృష్ణ చైతన్య ఉద్యమంలో పరిపూర్ణం అవ్వండి తరువాత నిర్వహణ తీసుకోండి మీ జీవితం విజయవంతం చేసుకోండి.
చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ