TE/Prabhupada 0740 - మనము మన శాస్త్రము యొక్క పేజీల ద్వారా చూడాలి
Lecture on CC Adi-lila 1.7 -- Mayapur, March 31, 1975
Advaita acyuta anādi ananta-rūpam. ఈ క్షిరోదక్షయ విష్ణువు వ్యక్తి ప్రతి ఒక్కరిలో హృదయములో ఉన్న జీవి, హృదయములో. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61) ఆ īśvara, antaryāmī, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు అది క్షిరోదక్షయ విష్ణువు. అన్ని జీవుల యొక్క హృదయంలోనే కాకుండా, ఆయన అణువులో కూడా ఉన్నాడు. Aṇḍāntara-stha-paramāṇu-cayā... Paramāṇu. Paramāṇu అంటే అణువు. ఈ విధముగా విష్ణు విస్తరణలు ఉన్నాయి. ఇది మనకు అనూహ్యమైనది, కానీ కృష్ణుని దయతో, మనము శాస్త్రముల వివరణ నుండి పాక్షికంగా అర్థం చేసుకోగలము. లేకపోతే, ఈ విషయాలు ఎలా జరిగాయో ఊహించలేము, కానీ అది జరుగుతుంది. మనము అంగీకరించాలి. Śāstra-cakṣuṣaḥ. మనము మన శాస్త్రము యొక్క పేజీల ద్వారా చూడాలి. లేకపోతే అది సాధ్యం కాదు.
మనము విష్ణు-తత్వమును తెలుసుకోవాలంటే, కృష్ణుణ్ణి తెలుసుకోవాలంటే, ఆయన ఉన్నతమైన స్థానము, అప్పుడు ఇక్కడ శాస్త్రము యొక్క వివరణ ఉన్నది. మనం వాటిని యధాతధముగా తీసుకుంటే తప్పుడు వివరణ లేకుండా, మనము ఏ అసాధారణ మేధస్సును చూపించకుండా... ఇది సాధ్యం కాదు. మనము అంగీకరించాలి. కాబట్టి సూచన ఏమిటంటే మీరు శాస్త్రము యొక్క ప్రకటనలను అంగీకరించాలి అని. అంటే... భగవద్గీత కూడా చెప్తుంది ,yaḥ śāstra-vidhim utsṛjya vartate-kāma-kārataḥ ( BG 16.23) మీరు శాస్త్రము యొక్క వివరణను అనుసరించకపోతే మీరు ఏదైనా ఉత్పత్తి చేస్తే, అప్పుడు na siddhiṁ sa avāpnoti, "అప్పుడు మీరు పరిపూర్ణము ఎప్పటికీ సాధించరు." మనం శాస్త్రమును అనుసరించాలి; లేకపోతే కృష్ణుడి యొక్క ఉన్నతమైన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ఏ ఇతర ప్రత్యామ్నాయం లేదు, విష్ణువుగా నారాయణగా ఆయన వివిధ రూపాల్లో ఎలా విస్తరిస్తున్నాడు. కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం అని కొన్నిసార్లు వాదిస్తున్నారు. అది కూడా సత్యము. మీరు చైతన్య లో కనుగొంటారు... ఈ విధముగా సత్యమును, ఏ అవతారం వచ్చినా, ఆయన Kṣīrobdhi-śāyī విష్ణువు ద్వారా వస్తాడు. కానీ Kṣīrobdhi-śāyī కృష్ణుని యొక్క పాక్షిక విస్తరణ. విషయము చాలా క్లిష్టంగా ఉంటుంది, కానీ మనము శాస్త్రమును అనుసరిస్తే దానిని అంగీకరించాలి, అప్పుడు కొంత స్పష్టమైన భావనను మనము కలిగి ఉండవచ్చు.
కావున నిత్యనంద రామా... కావున yasyāṁśa sa nityānanda-rāmaḥ. నిత్యానందుడు బలరాముడు. అందువలన ఆయన చెప్పినాడు,nityānandākhya-rāmaḥ. ఉదాహరణకు శ్రీ చైతన్య మహాప్రభులాగానే ... Kṛṣṇāya-kṛṣṇa-caitanya nāmne: నేను కృష్ణు చైతన్యగా అవతరించిన కృష్ణుడికి గౌరవప్రదమైన ప్రణామములు అర్పిస్తున్నాను. ఆయన కృష్ణుడు. అదేవిధముగా, నిత్యానందుడు బలరాముడు. కావున balarāma hoilo nitāi. అందువల్ల ఇక్కడ చెప్పబడింది, nityānandākhya-rāmaḥ: ఆయన రామా, బలరామా, కానీ ప్రస్తుత సమయంలో ఆయన నిత్యానందా అనే పేరుతో ఆవిర్భవించారు.
చాలా ధన్యవాదాలు.
భక్తులు: హరిబోల్! (ముగింపు)