TE/Prabhupada 0742 - భగవంతుని దేవాదిదేవుని యొక్క అనూహ్యమైన శక్తి



Lecture on CC Adi-lila 1.10 -- Mayapur, April 3, 1975


ఇప్పుడు, చాలా ప్రశ్నలు ఉన్నాయి: "ఎలా ఈ సముద్రాలు సృష్టించబడతాయి?" ఇది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువు కలయిక అని శాస్త్రవేత్త చెప్తాడు. కాబట్టి ఈ వాయువు ఎక్కడ నుంచి వచ్చినది? సమాధానం ఇక్కడ ఉంది. వాస్తవానికి, వాయువు నుండి, నీరు బయటకు వస్తుంది. మీరు ఒక మరిగే కుండను కప్పి ఉంచితే, వాయువు, ఆవిరి వస్తుంది, మీరు నీటి బిందువులను కనుగొంటారు. కాబట్టి వాయువు నుండి, నీరు వస్తుంది, నీటి నుండి, వాయువు వస్తుంది. ఇది ప్రకృతి యొక్క మార్గం. కాని వాస్తవ నీరు ఈ గర్భోదకశాయి విష్ణువు యొక్క చెమట నుండి వచ్చినది. ఉదాహరణకు మీకు చెమట వచ్చినట్లుగా. ఉదాహరణకు ఒక గ్రాము లేదా, ఒక ఔన్స్ నీటిని మీ శరీర వేడి ద్వారా మీరు ఉత్పత్తి చేయవచ్చు మనము ఆచరణాత్మక అనుభవం కలిగి ఉన్నాము. కావున మీరు మీ శరీరం నుండి ఒక ఔన్స్ నీటిని ఉత్పత్తి చేయగలిగితే, ఎందుకు భగవంతుడు తన శరీరం నుండి వాల్యూమ్స్ మిలియన్ల టన్నుల నీటిని ఉత్పత్తి చేయలేడు? అర్థం చేసుకోవడంలో కష్టం ఎక్కడ ఉంది? మీరు ఒక చిన్న ఆత్మ, మీరు ఒక చిన్న శరీరమును కలిగి ఉన్నారు. మీ చెమట ద్వారా మీరు ఒక ఔన్స్ నీటిని ఉత్పత్తి చేయవచ్చు. ఎందుకు భగవంతుడు , ఎవరైతే అతిగొప్ప శరీరం కలిగి ఉన్నారో, ఆయన నీటిని తయారు చేయలేడు, గర్భోదకశాయి , గర్భోదక నీరు? దానిని నమ్మక పోవడానికి ఏ కారణం లేదు.

దీనిని అచింత్య-శక్తి అంటారు, అనూహ్యమైన శక్తి. మనము భగవంతుని దేవాదిదేవుని యొక్క అనూహ్యమైన శక్తిని అంగీకరించకపోతే తప్ప, భగవంతుడు అంటే అర్థం లేదు. మీరు "ఒక వ్యక్తి" అంటే నా లాగా లేదా మీ వలె అని అనుకుంటే... అవును, నా లాగా లేదా నీలాగే, భగవంతుడు కూడా వ్యక్తి. ఇది వేదాలలో అంగీకరించబడింది: నిత్యో నిత్యానాం చేతనాశ్చేతనానాం. (కఠోపనిషత్తు 2.2.13). అనేక చేతనాలు, జీవులు ఉన్నారు, వారు అంతా శాశ్వతంగా ఉన్నారు. వారు చాలా, బహువచన సంఖ్య. నిత్యో నిత్యానాం చేతనాశ్చేేతనానాం. కాని మరొక నిత్య, నిత్యో నిత్యానాం, రెండు. ఒకటి ఏక సంఖ్య, ఒకటి బహువచన సంఖ్య. వ్యత్యాసం ఏమిటి? వ్యత్యాసం ఏకో యో బహూనా విదధాతి కామాన్. ఆ ఏక సంఖ్య ముఖ్యంగా చాలా శక్తివంతమైనది అన్ని బహు సంఖ్య అవసరాలకు ఆయన సరఫరా చేస్తున్నాడు. బహువచన సంఖ్య, లేదా జీవులు, అనంతాయ కల్పతే, వారు... మీరు ఎన్ని జీవులు ఉన్నారో లెక్కించలేరు. కాని వారు ఏక సంఖ్య ద్వారా నిర్వహించబడతారు. ఇది వ్యత్యాసం. భగవంతుడు వ్యక్తి; మీరు కూడా వ్యక్తి; నేను కూడా వ్యక్తి. భగవద్గీతలో చెప్పినట్లుగా మనము శాశ్వతముగా జీవిస్తున్నాము. కృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు, "నీవు, నేను, ఈ సైనికులు రాజులు, ఇక్కడ సమావేశమైన వారందరూ వారు గతంలో జీవించి లేరన్నది కాదు. వారు ప్రస్తుతం జీవించి ఉన్నారు, వారు భవిష్యత్తులో ఆ విధముగా జీవితమును కొనసాగిస్తారు." దీనిని నిత్యానాం చేతనానాం అని పిలుస్తారు