TE/Prabhupada 0752 - కృష్ణుడు విరహములో మరింత తీవ్రంగా ఉంటాడు



Lecture on SB 1.8.39 -- Los Angeles, May 1, 1973


ఎల్లప్పుడూ మనము కీర్తనలో నిమగ్నమై ఉండాలి: హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. కాబట్టి కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు. మనము ఏ పాపములును తెలిసి చేయకూడదు. అది ఒక విషయము. తెలియకుండా కూడా మనము చేయకూడదు. అప్పుడు మనము బాధ్యత వహించాలి. కావున మీరు కృష్ణ చైతన్యములో ఉంటే, మీ మనసులో కృష్ణుడిని ఎల్లప్పుడూ ఉంచుకుంటే, అప్పుడు... ఉదాహరణకు సూర్యుడు ఉన్నప్పుడు, చీకటి ఉండదు. అదేవిధముగా, మీరు కృష్ణ సూర్యను ఉంచుకుంటే, కృష్ణ సూర్య... అది మన బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక (భగవద్ దర్శన్ యొక్క నినాదము):kṛṣṇa sūrya sama māyā andhakāra (CC Madhya 22.31). కృష్ణుడు ప్రకాశవంతమైన సూర్య కాంతి లాంటి వాడు, మాయ, అజ్ఞానం, చీకటి లాంటిది కానీ ఎప్పుడైనా లేదా ఎక్కడైనా సూర్యుడు ఉంటే, అక్కడ ఎటువంటి చీకటి ఉండదు. అదేవిధముగా, మీరు ఎల్లవేళలా కృష్ణుడిని మీ చైతన్యములో ఉంచుకుంటే, ఎటువంటి అజ్ఞానము ఉండదు; ఏ చీకటి ఉండదు. మీరు కృష్ణుడి యొక్క ప్రకాశవంతమైన సూర్య కాంతిలో చాలా స్వేచ్ఛగా నడుస్తూ ఉంటారు కృష్ణుని మరచి పోవడానికి ప్రయత్నించ వద్దు. ఇది కుంతీ దేవి యొక్క ప్రార్థన. నా ప్రియమైన కృష్ణా, నీవు ద్వారకకు వెళ్తున్నావు... ఇది ఒక ఉదాహరణ. వారు వెళ్ళడం లేదు. కృష్ణుడు పాండవుల చెంత నుండి వెళ్ళడం లేదు. ఉదాహరణకు వృందావనములో లాగానే. వృందావనములో, కృష్ణుడు వృందావనమును వదిలి మథురకు వెళ్ళినప్పుడు... కాబట్టి శాస్త్రంలో ఇలా చెప్పబడింది: vṛndāvanaṁ parityajya padam ekaṁ na gacchati ( CC Antya 1.67) కృష్ణుడు వృందావనము వదిలి ఒక్క అడుగు కూడా బయటకు వెళ్ళడు. ఆయన వెళ్ళడు. ఆయనకు వృందావనము అంటే చాలా ఆసక్తి. అయితే కృష్ణుడు వృందావనమును వదిలి, మథుర వెళ్ళాడు అని చూస్తాము. ఎలా, ఆయన అంత దూరము వెళ్ళాడు? అనేక సంవత్సరాలు తిరిగి రాలేదు? కాదు. కృష్ణుడు వాస్తవానికి వృందావనమును విడచి పెట్టలేదు. ఎందుకంటే కృష్ణుడు వృందావనమును వదిలినప్పుడు, అక్కడ నివాసము వుండే గోపికలు అందరూ, వారు కేవలం కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, ఏడుస్తూన్నారు. అంతే. అది వారి పని. తల్లి యశోద, నంద మహారాజు, రాధారాణి, గోపికలు అందరూ, అన్ని ఆవులు, అన్ని దూడలు, గోప బాలురు అందరూ, వారి ఏకైక పని కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, ఏడవటము. లేకపోవడము వలన, విరహము. కాబట్టి కృష్ణుడిని భావించవచ్చు...

కృష్ణుడు విరహములో మరింత తీవ్రంగా ఉంటాడు. ఇది చైతన్య మహాప్రభువు యొక్క ఉపదేశము: విరహములో కృష్ణుడిని ప్రేమించడం. ఉదాహరణకు విరహములో చైతన్య మహాప్రభు లాగానే: govinda-viraheṇa me. Śūnyāyitaṁ jagat sarvaṁ govinda-viraheṇa me ( CC Antya 20.39 Śrī Śikṣāṣṭakam 7) ఆయన "కృష్ణుడు లేకుండా గోవిందుడు లేకుండా ప్రతీదీ శూన్యముగా ఉంది." అని ఆలోచిస్తున్నాడు కాబట్టి ప్రతీదీ శూన్యముగా ఉంది, కానీ కృష్ణ చైతన్యము ఉంది. కృష్ణ చైతన్యము ఉంది. అది అత్యున్నతమైనది పరిపూర్ణమైనది... మనము ఎప్పుడైతే ప్రతీదీ శూన్యము అని చూస్తామో, అప్పుడు కృష్ణ చైతన్యము మాత్రమే ఆస్తి. ఇది అత్యున్నతమైనది; అది గోపికలు. అందువలన గోపికలు చాలా ఉన్నతమైన వారు. ఒక్క క్షణము కూడా వారు కృష్ణుడిని మర్చిపోలేదు. ఒక్క క్షణం కూడా. కృష్ణుడు తన ఆవులు మరియు దూడలతో అడవిలో వెళుతున్నాడు, ఇంట్లో గోపికలు, వారు మనస్సులో కలతకు గురయ్యారు, ఓ, కృష్ణుడు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. చాలా రాళ్ళు మరియు ముళ్ళు ఉన్నాయి. కృష్ణుడి కమల పాదాలను గుచ్చుకుంటున్నాయి, అవి చాలా మృదువైనవి, కృష్ణుడు తన కమల పాదాలను మన రొమ్ముపై పెట్టినప్పుడు మన రొమ్ము చాలా గట్టిగా ఉందని మనము భావిస్తున్నాము. అయినప్పటికీ ఆయన నడుస్తున్నాడు. "వారు ఆయన ఆలోచనలో నిమగ్నమై ఉండేవారు. మరియు వారు ఏడుస్తున్నారు. కాబట్టి వారు సాయంత్రం కృష్ణుడు తిరిగి ఇంటికి వచ్చేటంత వరకు చాలా ఆతృతగా ఉండేవారు వారు మార్గంలో నిలబడి ఉంటారు, ఇంటి పైకప్పు పైన, ఇప్పుడు కృష్ణుడు తన ఆవులతో వాటితో తిరిగి వస్తున్నాడు... ఇది కృష్ణ చైతన్యము. ఇది... కృష్ణుడు తన భక్తుని నుండి దూరము కాడు ఎపుడైతే కృష్ణ భక్తుడు, కృష్ణుడి ఆలోచనలలో పూర్తిగా నిమగ్నమవ్వుతాడో. ఇది కృష్ణ చైతన్యము యొక్క పద్ధతి.


ఇక్కడ కుంతీదేవి చాలా ఆతృతతో ఉంది ఇంక కృష్ణుడు తమతో ఉండడు అని. కానీ ప్రభావము ఏమిటంటే, ఎప్పుడైతే కృష్ణుడు ప్రత్యక్షముగా శారీరికముగా ఉండడో, ఆయన మరింతగా ఉంటాడు, నేను చెప్పేది ఏమిటంటే భగవంతుడు భక్తుని యొక్క మనస్సులో పరిపూర్ణంగా ఉంటాడు. కాబట్టి చైతన్య మహా ప్రభు యొక్క ఉపదేశము ఆ విప్రలంబ -సేవ. ఆయన ఆచరణాత్మక జీవితము ద్వారా. ఆయన కృష్ణుడిని తెలుసుకుంటున్నాడు. గోవింద-విరహేనమే. Śūnyāyitaṁ jagat sarvaṁ govinda-viraheṇa me. ఆ శ్లోకము ఏమిటి? Cakṣuṣā prāvṛṣāyitam, cakṣuṣā prāvṛṣāyitam, śūnyāyitaṁ jagat sarvaṁ govinda-viraheṇa me ( CC Antya 20.39 Śrī Śikṣāṣṭakam 7) ఆయన ఏడుస్తున్నాడు ఆయన కళ్ళ నుండి నీరు వర్షము వరద వలె వస్తున్నది. ఆయన శూన్యముగా భావిస్తున్నాడు కృష్ణుడి కోసము, విరహములో. విప్రలంబ. కాబట్టి సంభోగ, విప్రలంబ. కృష్ణుడిని కలవడములో రెండు దశలు ఉన్నాయి. సంభోగా అంటే ఆయన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అర్థం. దీనిని సంభోగా అని పిలుస్తారు. వ్యక్తిగతంగా మాట్లాడటము, వ్యక్తిగతంగా కలసుకోవడము, వ్యక్తిగతంగా ఆలింగనం చేసుకోవడము, దీనిని సంభోగ అని పిలుస్తారు. మరొకటి, విప్రలంబ. భక్తుడు ఈ రెండు మార్గాల ద్వారా ప్రయోజనము పొందవచ్చు.