TE/Prabhupada 0769 - వైష్ణవుడు చాలా ఆనందంగా ఉంటాడుఎందుకంటే ఆయన కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు



Lecture on SB 6.1.6-7 -- Honolulu, June 8, 1975


పరీక్షిత్ మహారాజు ఒక వైష్ణవుడు. వైష్ణవుడు అంటే భక్తుడు. అందువల్ల ఆయన ఒక వ్యక్తి ఆ విధముగా బాధపడటమును అభినందించలేదు. ఇది ఒక వైష్ణవుని స్వభావం. వైష్ణవుడు తనకు తాను చాలా ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే ఆయన కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆయనకు ఎటువంటి ఫిర్యాదు లేదు, ఎందుకంటే వైష్ణవుడు కేవలం కృష్ణుడికి సేవ చేయడము ద్వారా సంతృప్తి చెందుతాడు. అంతే. ఆయనకు ఏదీ అవసరం లేదు.

చైతన్య మహా ప్రభు మాత్రమే మనకు బోధిస్తున్నాడు. చైతన్య మహాప్రభు చెప్పినారు, na dhanaṁ na janaṁ na sundarīṁ kavitāṁ vā jagad-īśa kāmaye ( CC Antya 20.29) ధనం అర్థం సంపద, జనమ్ అంటే చాలామంది అనుచరులు లేదా కుటుంబ సభ్యులు, గొప్ప కుటుంబం, గొప్ప ఫ్యాక్టరీ. అనేకమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, వారు గొప్ప కర్మాగారాలను నడుపుతున్నారు, వేలమంది వ్యక్తులు ఆయన నిర్దేశములో పనిచేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఐశ్వర్యం. గొప్ప మొత్తం డబ్బు కలిగి ఉండటము, అది కూడా సంపద. ధనమ్ జనం. మరొక సంపద, ఒక మంచి భార్యను కలిగి ఉండటము, అందమైన, వినమ్రతతో , చాలా సంతోషమును ఇచ్చేది. కాబట్టి ఇవి భౌతిక అవసరాలు. ప్రజలు సాధారణంగా ఈ మూడు విషయాలను కోరుతున్నారు: సంపద, అనేకమంది అనుచరులు, ఇంట్లో మంచి భార్య. కానీ చైతన్య మహా ప్రభు చెప్పినారు, న ధనమ్: "నాకు ధనం అవసరము లేదు." కేవలం వ్యతిరేకం. అందరికి డబ్బు కావాలి. ఆయన చెప్పాడు, "లేదు, నాకు ధనం అవసరము లేదు." న ధనం న జనమ్: "నా అనుచరులుగా చాలామంది వ్యక్తులు నాకు అవసరము లేదు." కేవలం వ్యతిరేకము చూడండి. అందరూ కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు, యోగులు, స్వాములు, ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, నాకు వందలు మరియు వేల అనుచరులు ఉండవచ్చు. కానీ చైతన్య మహా ప్రభు అన్నారు, "లేదు, నాకు అవసరము లేదు." Na dhanaṁ na janaṁ na sundarīṁ kavitāṁ vā jagad-īśa kāmaye. నాకు చాలా మంచి, అందమైన, విధేయురాలైన భార్య అవసరము లేదు. అప్పుడు నీకు ఏమి కావాలి? Mama janmani janmanīśvare bhavatād bhaktir ahaitukī: జన్మ జన్మలకి, నన్ను మీ యొక్క నమ్మకమైన సేవకునిగా ఉండనివ్వండి.

ఇది వైష్ణవుడు అంటే. ఆయనకు ఏమి అవసరం లేదు. ఎందుకు ఆయన కోరుకుంటున్నారు? ఆయన కృష్ణుడి సేవకునిగా ఉంటే, అప్పుడు ఆయన ఏమి కోరుతాడు? మీరు చాలా, చాలా గొప్ప మనిషి యొక్క సేవకునిగా ఉంటే, మీరు కోరుకోవలసిన అవసరము ఏమిటి? ఇది బుద్ధి. ఏ గొప్ప వ్యక్తి యొక్క సేవకుడు ఎవరైనా, ఆయన తన యజమాని కంటే గొప్పవాడు, ఎందుకంటే ఆయన ఇవ్వబడతాడు ... యజమానిచే చాలా రకాల ఆహారాన్ని ఇవ్వబడతాడు. యజమాని కొద్దిగా తీసుకొని, మిగతాది సేవకులు భుజిస్తారు. (నవ్వుతూ) కావున ఆయనకు అవసరము ఎక్కడ ఉంది? అవసరము అనే ప్రశ్నేలేదు. నీవు కేవలము భగవంతుని సేవకునిగా ఉండటానికి ప్రయత్నించండి, నీ అవసరాలన్నీ సరిగ్గా నెరవేరుతాయి. ఇది బుద్ధి. ఉదాహరణకు ధనవంతుని పిల్ల వాని వలె, ఆయనకు తండ్రి నుండి ఏదైనా కావాలా? లేదు, ఆయన కేవలం తండ్రిని, తల్లిని కోరుకుంటాడు. తండ్రికి, తల్లికి తెలుసు, వాడు ఏమి కోరుకుంటున్నాడు, వాడు ఎలా సంతోషంగా ఉంటాడు. ఇది తండ్రి మరియు తల్లి యొక్క కర్తవ్యము. అదేవిధముగా , ఇది చాలా మంచి బుద్ధి: కృష్ణుడి యొక్క నిజాయితీగల సేవకునిగా ఉండటానికి ప్రయత్నించండి. జీవితం యొక్క అన్ని అవసరాలు తగినంతగా సరఫరా చేయబడతాయి. అడగవలసిన ప్రశ్నే లేదు

కాబట్టి తెలివైన భక్తుడు, వారు అడగరు, జ్ఞానము లేని భక్తుడు చర్చికి వెళ్లి భగవంతుడిని ప్రార్థిస్తాడు, "మా రోజు వారి రొట్టెను మాకు ఇవ్వండి." అతను భగవంతుని సేవకుడు, ఆయన మీకు రొట్టెను ఇవ్వాడా? నీవు భగవంతుని అడగాలా? కాదు ఎనభై లక్షల ఇతర జీవులకు భగవంతుడు రొట్టెను ఇస్తున్నాడు. పక్షులు, మృగములు, పులులు, ఏనుగులకు, రొట్టెను అడగడానికి అవి చర్చికి వెళ్ళడము లేదు. కానీ అవి దాన్ని పొందుతున్నాయి. భగవంతుడు ప్రతి ఒక్కరి ఆహారాన్ని సరఫరా చేస్తుంటే, ఎందుకు ఆయన మీకు సరఫరా చేయడు? ఆయన సరఫరా చేస్తున్నాడు. కాబట్టి మనం కొంత భౌతిక ప్రయోజనము కొరకు భగవంతుని దగ్గరకు వెళ్ళకూడదు. ఇది వాస్తవ భక్తి కాదు. మనము ఆయన సేవలో ఎలా వినియోగించబడి ఉండాలో వేడుకొనుటకు భగవంతుని దగ్గరకు వెళ్ళాలి. ఇది మనము యాచించ వలసినది: "హరే కృష్ణ," అనగా... హరే అనగా "ఓ భగవంతుని యొక్క శక్తి, కృష్ణా, ఓ కృష్ణా, భగవాన్ కృష్ణా, దయచేసి మీ సేవలో నన్ను నిమగ్నం చేయండి.

హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే
హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే.

కేవలం ఇది ప్రార్థించండి, "ఓ నా ప్రభు కృష్ణా, ఓ శ్రీమతి రాధారాణి , కృష్ణుడి యొక్క శక్తి, దయచేసి మీ సేవలో నన్ను నిమగ్నం చేయండి. "అంతే అన్ని పనులు పూర్తయ్యాయి. ఇది వైష్ణవుడు అంటే. కాబట్టి వైష్ణవునికి అవసరం లేదు. ఆయనకు తెలుసు "నాకు అవసరం లేదు, నా ఏకైక కర్తవ్యము కృష్ణుడికి సేవ చేయడము." కాబట్టి ఆయన అన్ని పరిస్థితులలో సంతోషంగా ఉంటాడు