TE/Prabhupada 0774 - మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మన స్వంత మార్గాలను తయారు చేయలేము



Lecture on SB 7.6.2 -- Toronto, June 18, 1976


కృత లో, అంటే సత్య-యుగం, ప్రజలు నివసించేవారు వంద వేల సంవత్సరాలు, ఆ సమయంలో అది సాధ్యం. ఉదాహరణకు వాల్మీకి ముని 60 వేల ఏళ్లపాటు ధ్యానం తపస్సు చేసినాడు. కాబట్టి వాస్తవానికి ఈ ధ్యానం తపస్సు, ధ్యానం, ధారణా , ప్రాణాయామం, ప్రత్యాహార, యోగ పద్ధతి, ఇది శాస్త్రములో సిఫార్సు చేయబడింది, భగవద్గీతలో కూడా ఉంది, కానీ ఈ కాలములో అది సాధ్యం కాదు. అర్జునుడు కూడా తిరస్కరించాడు. కృష్ణా, మీరు యోగ పద్ధతిని పాటించమని నాకు సిఫార్సు చేస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు. Tasyāhaṁ nigrahaṁ manye vāyor iva suduṣkaram ( BG 6.34) "ఇది సాధ్యం కాదు." కానీ అర్జునుడు పవిత్రమైన భక్తుడు. ఆయన ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఇతర కర్తవ్యము లేదు. అందువల్ల కృష్ణుడు, అర్జునుడిని ప్రోత్సహించడానికి "నిరాశ చెందవద్దు. అని చెప్పెను. ఎందుకంటే విష్ణువుపై ధ్యానం చేయడానికి మీరు అర్హత కలిగి లేరని మీరు అనుకుంటున్నారు, నిరాశ చెందకండి. మొదటి-తరగతి యోగి... మీరు మొదటి -తరగతి యోగి. " ఎందుకు? ఎందుకంటే,

yoginām api sarveṣāṁ
mad-gatenāntarātmanā
śraddhāvān bhajate yo māṁ
sa me yuktatamo mataḥ
(BG 6.47)

కృష్ణుడి గురించి ఎల్లప్పుడూ హృదయంలోనే ఆలోచించే ఎవరైనా, ఆయన మొదటి-తరగతి యోగి. అందువల్ల kalau tad dhari-kīrtanāt ( SB 12.3.52) ఇది మొదటి తరగతి యోగ పద్ధతి. ఈ యుగమునకు, చైతన్య మహాప్రభు సిఫార్సు చేసెను, శాస్త్రంలో కూడా ఇది సిఫార్సు చేయబడి ఉంది, అది harer nāma harer nāma harer nāma eva kevalam kalau nāsty eva nāsty eva nāsty eva ( CC Adi 17.21)

కాబట్టి మనము శాస్త్రం యొక్క ఉత్తర్వును అనుసరించాలి. మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మన స్వంత మార్గాలను తయారు చేయలేము. అది సాధ్యం కాదు.

yaḥ śāstra-vidhim utsṛjya
vartate kāma-kārataḥ
na sa siddhim avāpnoti
na sukhaṁ na parāṁ gatim
(BG 16.23)

శాస్త్రములో లో సిఫారసు చేయబడిన క్రమబద్ధమైన సూత్రాలను అతిక్రమించే వారు ఎవరైనా, śāstra-vidhi, yaḥ śāstra-vidhim utsṛjya, శాస్త్ర - విధిని వదిలేసేవారు, vartate kāma-kārataḥ, చపలముగా, వెర్రిగా ఏదో చేస్తారు, na siddhiṁ sa avāpnoti, ఆయన ఎన్నడూ విజయము పొందడు. ఆయన ఎన్నడూ విజయవంతం కాడు . Na siddhiṁ na parāṁ gati: ఎటువంటి ముక్తిని పొందడు. Na siddhim, na sukham: ఏ భౌతిక ఆనందమును కూడా పొందడు. కాబట్టి మనం తప్పనిసరిగా శాస్త్ర - విధిని అంగీకరించాలి. శాస్త్ర - విధి, యధాతథముగా... శాస్త్రంలో అది చెప్పబడింది, నేను ఇప్పటికే ఉదహరించాను,

kṛte yad dhyāyato viṣṇuṁ
tretāyāṁ yajato makhaiḥ
dvāpare paricaryāyāṁ
kalau tad dhari-kīrtanāt
(SB 12.3.52)

ఈ యుగములో శాస్త్ర - విధి హరి-కీర్తనయే. మీరు హరే కృష్ణ మహా మంత్రం మరింత ఎక్కువ కీర్తన చేస్తే మీరు మరింత పరిపూర్ణత పొందుతారు. ఇది శాస్త్ర - విధి. చైతన్య మహాప్రభు దీనిని ధృవీకరించారు. సాధు-శాస్త్రము-గురు-వాక్య. మనము స్థిరపడి వుండాలి, మొదటగా, శాస్త్రం యొక్క ఉత్తర్వు ఏమిటి. తరువాత సాధువు ఏమి, ఎవరైతే భక్తులో, వారు ఏమి చేస్తున్నారు. వారు ఏమి చేస్తున్నారు, సాధు, శాస్త్ర , గురు. గురువు ఏమి అడుగుతున్నారు. మనము ఈ మూడు సూత్రాలను అనుసరించాలి. Sādhu-guru-śāstra-vākya tīnete koriyā aikya. సాధువు అంటే ఎవరు?ఎవరైతే శాస్త్రం యొక్క ఉత్తర్వుకు కట్టుబడి ఉన్నారో. లేదా గురు? గురువు అనగా అతడు కూడా శాస్త్రము యొక్క ఉత్తర్వు ద్వారా కట్టుబడి ఉంటాడు. అప్పుడు ఆయన గురువు, ఆయన సాధు. ఆయన సాధువు. ఒకవేళ ఒకరు, śāstra vidhim, yaḥ śāstra-vidhim utsṛjya... , శాస్త్ర - విధిని మీరు వదిలేస్తే, అప్పుడు గురువు సాధువు అనే ప్రశ్న ఎక్కడుంది? Na siddhim. ఆయన సిద్ధ కాదు. ఆయన పరిపూర్ణమును సాధించలేదు, ఎందుకనగా ఆయన శాస్త్రం యొక్క సూత్రాలను తిరస్కరించాడు. అందువలన ఆయన నకిలీ, మోసగాడు. మనము అలాంటి పరీక్ష చేయాలి, గురువు అంటే ఎవరు