TE/Prabhupada 0778 - మానవ సమాజానికి గొప్ప సహయము చేయడము అంటే జ్ఞానము ఇవ్వడము



Lecture on SB 6.1.17 -- Denver, June 30, 1975


నితాయ్: "ఈ భౌతిక ప్రపంచంలో, పవిత్రమైన భక్తుల మార్గాన్ని అనుసరిస్తూ ఎవరైతే చక్కగా ప్రవర్తిస్తారో, పూర్తిగా మొదటి తరగతి అర్హతలను కలిగి ఉంటారో వారు పూర్తిగా నారాయణ సేవను తీసుకొని ఉండటము వలన వారి జీవితం మరియు ఆత్మ తప్పకుండా చాలా శుభకరమైనదిగా ఉండటము వలన, ఏ భయం లేకుండా, శాస్త్రముచే ద్వారా ప్రామాణికముగా అనుమతించబడినారు. "

ప్రభుపాద:

sadhrīcīno hy ayaṁ loke
panthāḥ kṣemo 'kuto-bhayaḥ
suśīlāḥ sādhavo yatra
nārāyaṇa-parāyaṇāḥ
(SB 6.1.17)

అందువల్ల శాస్త్రము చెప్తుంది భక్తుల సాంగత్యము వలన... నారాయణ-పరాయణః అంటే భక్తులు. నారాయణ-పరాయణః అంటే జీవితములో అంతిమ లక్ష్యంగా నారాయణుడిని తీసుకున్న వ్యక్తి. నారాయణ, కృష్ణ, విష్ణు-వారు ఒకే తత్వము, విష్ణు-తత్త్వము. కావున ప్రజలకు ఇది తెలియదు, ఆ స్థితిని చేరుకోవటానికి నారాయణుడిని లేదా విష్ణువు లేదా కృష్ణుడిని పూజించడము, ఇది అత్యంత ఉన్నతమైనది, ఏమంటారు అంటే, హామీ ఇవ్వబడిన స్థితి. మనము భీమా పొందడం లాగే, ఇది హామీ ఇవ్వబడుతుంది. ఎవరి ద్వారా హామీ ఇవ్వబడింది? కృష్ణుడు హామీ ఇస్తాడు. కృష్ణుడు హామీ ఇస్తున్నాడు, ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi ( BG 18.66) Kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati ( BG 9.31) Api cet sudurācāro bhajate mām ananya-bhāk, sādhur eva sa man... ( BG 9.30) చాలా హామీలు ఉన్నాయి. నారాయణ పరా నేను నిన్ను కాపాడుతాను అని కృష్ణుడు వ్యక్తిగతంగా చెప్పాడు. పాపపు ప్రతిక్రియ, అజ్ఞానం కారణంగా ప్రజలు బాధపడుతున్నారు. అజ్ఞానము వలన, వారు పాపపు కర్మ చేస్తారు, మరియు పాపపు ప్రతి క్రియ జరుగుతుంది. ఒక పిల్లవాడి వలె, అమాయకుడు, వాడు మండుతున్న అగ్నిని తాకుతాడు అది చేతిని కాలుస్తుంది, వాడు బాధపడతాడు. మీరు చెప్పలేరు "పిల్లవాడు అమాయకుడు అని, అగ్ని కాల్చింది అని." లేదు. ఇది ప్రకృతి యొక్క చట్టము. అజ్ఞానం. కాబట్టి పాపములు అజ్ఞానం వలన చేయబడతాయి. అందువలన ఒకరు జ్ఞానముతో ఉండాలి. చట్టం తెలియక పోవడము వలన మన్నించడం ఉండదు. మీరు కోర్టుకు వెళ్లితే, మీరు విజ్ఞప్తి చేస్తే, "అయ్యా, నాకు బాధపడాలని నాకు తెలియదు, నేను దొంగిలించాను కనుక నేను ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలి. నాకు ఇది తెలియదు... "కాదు, తెలిసినా లేదా తెలియక పోయినా, మీరు జైలుకు వెళ్లాలి.

కాబట్టి మానవ సమాజానికి గొప్ప సహయము చేయడము అంటే జ్ఞానము ఇవ్వడము. వారిని అజ్ఞానంలో ఉంచడము, చీకటిలో, అది మానవ సమాజం కాదు, అది పిల్లులు మరియు కుక్కలు '... వారు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఎవరూ వారికి జ్ఞానం ఇవ్వలేరు, ఇచ్చినా వారు తీసుకోలేరు. అందువల్ల మానవ సమాజంలో జ్ఞానం ఇవ్వడానికి ఏర్పాటు ఉంది. ఇది గొప్ప సహయము. ఆ జ్ఞానం, సర్వోత్తమ జ్ఞానం, వేదాలలో ఉంది. Vedaiś ca sarvaiḥ ( BG 15.15) అన్ని వేదాలు నిర్ధారిస్తున్నాయి, భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది కావలసినది. (పక్కన:) ఆ ధ్వని చేయవద్దు. Vedaiś ca sarvaiḥ. ప్రజలకు ఇది తెలియదు. ఈ మొత్తం భౌతిక ప్రపంచం, వాస్తవ జ్ఞానం అంటే ఏమిటో తెలియదు. వారు తాత్కాలిక పనులలో తీరిక లేకుండా ఉన్నారు ఇంద్రియ తృప్తితో, కానీ జ్ఞానం యొక్క వాస్తవ లక్ష్యం ఏమిటో వారికి తెలియదు. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) జ్ఞానం యొక్క లక్ష్యం విష్ణువుని, భగవంతుడిని తెలుసుకోవడం. ఇది జ్ఞానం యొక్క లక్ష్యం. Athāto brahma jijñāsā. Jīvasya tattva-jijñāsā ( SB 1.2.10) ఈ జీవితం, మానవ జీవితం, సంపూర్ణ సత్యమును అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది. అదే జీవితం. పరమ సత్యమును అర్థం చేసుకోకుండా, మనం కేవలము కొంచము సౌకర్యవంతంగా ఉండటానికి తీరిక లేకుండా ఉంటే కొంచము సౌకర్యవంతంగా నిద్ర పోవడానికి లేదా ఎలా కొంచము సౌకర్యవంతంగా మైథునము కలిగి ఉండటానికి ఇవి జంతు కార్యక్రమాలు. ఇవి జంతువుల కార్యక్రమాలు. మానవ కార్యక్రమాలు అంటే భగవంతుడు అంటే ఏమిటో తెలుకోవడము. అది మానవ కార్యక్రమము. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇuṁ durāśayā ye bahir-artha-māninaḥ ( SB 7.5.31) ఇది తెలియకుండా, వారు జీవితములో పోరాడుతున్నారు. bahir-artha-māninaḥ మార్చడం ద్వారా వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజలు, నాయకులు, andhā yathāndhair upanīyamānāḥ ( SB 7.5.31) గొప్ప, గొప్ప శాస్త్రజ్ఞులను, తత్వవేత్తను అడగండి, "జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?" వారికి తెలియదు. వారు కేవలం సిద్ధాంతీకరిస్తారు, అంతే. జీవితం యొక్క వాస్తవమైన లక్ష్యం భగవంతుని అర్థము చేసుకొనుట.