TE/Prabhupada 0780 - కానీ పరమ సత్యము గురించి కొంచము తెలుసుకొనవచ్చు
Lecture on SB 7.6.20-23 -- Washington D.C., July 3, 1976
ప్రభుపాద: ఈ దేవీ-ధామం అత్యంత శక్తివంతమైన శక్తిచే నియంత్రించబడుతుంది. దుర్గ Sṛṣṭi-sthiti-pralaya-sādhana-śaktir eka (Bs 5.44). కానీ ఆమె ఛాయేవా గా వ్యవహరిస్తుంది, ఇది భగవంతుని యొక్క నీడగా. ఇది భగవద్గీతలో కూడా సంగ్రహించబడింది:
- mayādhyakṣeṇa prakṛtiḥ
- sūyate sa-carācaram
- hetunānena kaunteya
- jagad viparivartate
- (BG 9.10)
కాబట్టి ఈ విధముగా, మనము శాస్త్రమును అధ్యయనం చేస్తే, ప్రతీదీ ఉంది. మీరు సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఎలా? శాస్త్ర చక్షుశా ( SB 10.84.36) శాస్త్రము ద్వారా. వేదముల జ్ఞానం ద్వారా, మీరు సంపూర్ణ సత్యమును తెలుసుకుంటారు. మనము వాస్తవానికి వేదము అంటే జ్ఞానము అని అంగీకరిస్తే... Vetthi veda vida jñāne. వేద అంటే జ్ఞానం కాబట్టి వేదాంతం, జ్ఞానము యొక్క చివరి, ఆఖరి దశ. విజ్ఞానము యొక్క చివరి దశ పరమ సత్యము. మీరు అక్కడి వరకు వెళ్ళాలి. కావున ఆ సంపూర్ణ సత్యము, మీరు కల్పనలు చేస్తూ వెళ్ళితే... Panthās tu koṭi-śata-vatsara-sampragamyo (Bs. 5.34). అది సాధ్యం కాదు. Śata-vatsara-sampragamyo వందల వందల సంవత్సరాల తరువాత, మీరు వేగం తో వెళ్ళి ఉంటే... ఆ వేగం ఏమిటి? Panthās tu koṭi-śata-vatsara-sampragamyo vāyor athāpi. విమానం, విమానం, వాయుర్ అథాపి. ఆ వేగము ఏమిటి? Vāyor athāpi. Panthās tu koṭi-śata-vatsara sampragamyo vāyor athāpi. మనసో వాయు: గాలి మరియు మనస్సు యొక్క వేగంతో. మనస్సు చాలా వేగవంతమైనది. మీరు ఇక్కడ కూర్చోని ఉన్నారు, మీకు వెంటనే పదివేల మైళ్ళ దూరములో ఉన్నది గుర్తుకు రావచ్చు, అది చాలా వేగవంతమైనది. కాబట్టి మనస్సు యొక్క వేగంతో కూడా కాదు, ఆకాశములో వెళ్ళినా, కోటి-శత వత్సర, అనేక మిలియన్ల సంవత్సరాల అప్పటికీ తెలియదు. పరమ సత్యమును అర్థం చేసుకునేందుకు ఇది మార్గం కాదు, కానీ మనము వేదముల పద్ధతిను అంగీకరించినట్లయితే, అవరోహ పంతా, జ్ఞానం సంపూర్ణ సత్యము నుండి వచ్చినప్పుడు, అది సాధ్యమే.
కాబట్టి మనము కృష్ణ చైతన్యవంతులము, భక్తులము పరమ సత్యము యొక్క దయతో సంపూర్ణ సత్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. పరమ సత్యము అనేది కృష్ణుడు. కృష్ణుడు చెప్తాడు,mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañjaya ( BG 7.7) "నేను భగవంతుడను" Vedaiś ca sarvair aham eva vedyam ( BG 15.15) ఈ విధముగా, ఆయన కృష్ణుడు చెప్పిన విధముగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, శాస్త్రములో చెప్పినట్లుగా, ఆచార్యులు చెప్పినట్లుగా పరమ సత్యము యొక్క కొన్ని ఆధారాలను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు కృష్ణుడు చెప్పినట్లుగా,
- athavā bahunaitena
- kiṁ jñātena tavārjuna
- viṣṭabhyāham idaṁ kṛtsnam
- ekāṁśena sthito jagat
- (BG 10.42)
పరమ సత్యము యొక్క విస్తరణ, ఇది ఎలా పనిచేస్తుంది, కాబట్టి అర్జునుడికి కృష్ణుడు సంగ్రహముగా వివరించారు, ఈ భౌతిక ప్రపంచం, భౌతిక ప్రపంచం... Ekāṁśena sthito jagat, ఈ భౌతిక ప్రపంచం. ఆ భౌతిక ప్రపంచం ఏమిటి? ఈ భౌతిక ప్రపంచములో, మనము ఒకే ఒక విశ్వాన్ని మాత్రమే చూస్తాము. అదేవిధముగా, లక్షలాది విశ్వములు ఉన్నాయి. Yasya prabhā prabhavato jadad-aṇḍa koṭi (Bs. 5.40).). జగదాండ అంటే ఒక విశ్వం, ప్రతి విశ్వంలో, koṭiṣu aśeṣa. Yasya prabhā prabhavato jagad-aṇḍa-koṭi-koṭisv aśeṣu vibhūti-bhinnam. లక్షలాది లోకములు ఉన్నాయి, ప్రతి లోకము అక్కడ భిన్నంగా ఉంటుంది. ఇది భగవంతుని సృష్టి. కాబట్టి ఇవన్నీ కలిపి, ekāṁśena sthito jagat, ఈ భౌతిక ప్రపంచం భగవంతుని యొక్క సృష్టిలో నాలుగవ భాగం. మూడు వంతుల భాగము ఆధ్యాత్మిక ప్రపంచములో ఉంది. వైకుంఠ లోకములో ఉంది. కాబట్టి కల్పన, మన పరిశోధన ద్వారా, అది అసాధ్యం, కానీ పరమ సత్యము గురించి కొంచము తెలుసుకొనవచ్చు పరమ సత్యమును, కృష్ణుడి ద్వారా మనము దీనిని తెలుసుకున్నప్పుడు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము.
చాలా ధన్యవాదాలు.
భక్తులు: జయ శ్రీల ప్రభుపాద.