TE/Prabhupada 0788 - మనము ఎందుకు సంతోషముగా లేమో అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి



Lecture on BG 4.10 -- Vrndavana, August 2, 1974


ప్రభుపాద:

vīta-rāga-bhaya-krodhā
man-mayā mām upāśritāḥ
bahavo jñāna-tapasā
pūtā mad-bhāvam āgatāḥ
(BG 4.10)

భవమ్ అంటే ప్రకృతి అని అర్థము కూడా ఉంది. ఉదాహరణకు మనము ప్రకృతిని స్వభావ, స్వభావ అని పిలుస్తాము కావున మద్ భావం... ఇది ఒక ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి... ఇది కూడా కృష్ణుడి భావమ్, అంటే కృష్ణుడి యొక్క ప్రకృతి అని అర్థం.కృష్ణుడికి మించి ఏమీ లేదు, కానీ ఇది బాహ్య ప్రకృతి. Bhūmir āpo 'nalo vāyuḥ... ( BG 7.4) bhinnā me prakṛtir aṣṭadhā. భిన్నా అంటే వేరు చేయబడిన శక్తి. శక్తి పని చేస్తుంది. ఇది కృష్ణుడి ప్రకృతి అయినప్పటికీ, ఇప్పటికీ, ఇది వేరు చేయబడిన ప్రకృతి.

ఉదాహరణకు నేను మాట్లాడుతున్నాను, అది రికార్డు చెయ్యబడుతుంది. అది తిరిగి ప్లే చేసినప్పుడు, మీరు అదే ధ్వనిని వింటారు, కానీ అయినప్పటికీ, ఇది నా నుండి వేరు చేయబడింది. అదేవిధముగా, ఈ భౌతిక ప్రకృతి కూడా కృష్ణుడి ప్రకృతి.

కృష్ణుడికి మించి ఏదీ లేదు. రెండు ప్రకృతులు ఉన్నాయి: ఆధ్యాత్మిక ప్రకృతి మరియు భౌతిక ప్రకృతి. కాబట్టి భౌతిక ప్రకృతి అంటే అర్థం బాహ్య శక్తి, ఆధ్యాత్మిక ప్రకృతి అంటే అంతరంగ శక్తి అని అర్థం. మనము, మనము కూడా ఆధ్యాత్మిక ప్రకృతి, తటస్తముగా ఉన్నాము. మనము భౌతిక ప్రకృతిలో లేదా ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉండగలము. అందువలన మనం తటస్త స్వభావము కలిగి ఉన్నాము. మూడు ప్రకృతులు ఉన్నాయి: బాహ్య, అంతర్గత మరియు తటస్త. కాబట్టి, ఎంత కాలము మనం భౌతిక ప్రకృతిలో ఉంటామో, బాహ్య ప్రకృతిలో, మనము సంతోషంగా ఉండలేము ఇది పరిస్థితి.

ఉదాహరణకు ఒక చేప లాగా, అది భూమి మీద పెట్టినప్పుడు, అది దుఃఖముతో ఉంటుంది లేదా మరణిస్తుంది. అదేవిధముగా, మీరు, భూమి యొక్క జీవి, మీరు నీటిలో పెట్టబడి ఉంటే, మీరు సంతోషంగా ఉండరు. మరణిస్తారు. కాబట్టి మనము ఆధ్యాత్మిక ప్రకృతికి చెందితే... ఇది కృష్ణుడిచే వివరించబడినట్లు, ఈ భౌతిక ప్రకృతి అపరా అని. అపరా అంటే అర్థం న్యూన అని, మనకు సరిపోయేది కాదు. అందువలన మనము సంతోషంగా లేము. ఎంత కాలము మనము భౌతిక ప్రకృతిలో ఉంటామో, మనము సంతోషంగా ఉండలేము.

ఉదాహరణకు ఈ శరీరం వలె. ఈ శరీరం భౌతిక ప్రకృతిచే తయారు చేయబడినది, మనము ఈ శరీరం లోపల ఉన్నాము. Dehino 'smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā ( BG 2.13) ఎంత కాలము మనము ఈ శరీరాన్ని కలిగి ఉంటామో, భౌతిక శరీరాన్ని, మనము సంతోషంగా ఉండలేము. మొదటగా, మనము ఎందుకు సంతోషముగా లేమో అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనము ఈ భౌతిక శరీరంలో ఉన్నాము కనుక మనము సంతోషంగా లేము. ఈ అసంతృప్తి ఏమిటి? ఇది నాలుగు సూత్రాలలో ముగుస్తుంది, janma-mṛtyu-jarā-vyādhi ( BG 13.9) జన్మించడము మరలా చనిపోవడము, ఎంత కాలము మనం జీవించి ఉంటామో, మనము కొన్ని రోగాలతో బాధపడాలి, మనము ముసలి వారము అవ్వాలి. సాదారణ సత్యము.

కాబట్టి తెలివితేటలు కలిగిన వ్యక్తి దుర్భర పరిస్థితుల గురించి తెలుసుకోవాలి ఈ భౌతిక ఉనికి గురించి మరియు దాని నుండి బయట పడటానికి ప్రయత్నించాలి. ఏదైనా సందేహం ఉందా? EH? ఇది సత్యము. కాబట్టి మన ఏకైక కర్తవ్యము ఈ భౌతిక జీవితము నుండి ఎలా బయటపడాలి. అది మన ఏకైక పని. అంతే కానీ, మన పరిస్థితులను సర్దుబాటు చేసుకొని ఇక్కడ సంతోషముగా ఉండటము కాదు దానిని కర్మీ, మూర్ఖులు అని అంటారు. ఇది వాస్తవము ఎంత కాలము మీరు ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడ ఉంటారో అయితే మీరు సంతోషంగా ఉండటానికి విషయాలు సర్దుబాటు చేయడానికి ఎంత ప్రయత్నించినా, ఇది సాధ్యం కాదు. ఇది ఎప్పటికీ సాధ్యపడదు. వారు పాశ్చాత్య ప్రపంచంలో భౌతికముగా ఆనందముగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు ఆనందం అంటే వాస్తవానికి వారికి తెలియదు, కానీ భౌతిక ఆనందము అంటే లైంగిక జీవితం. మైథున జీవితమును వారు ప్రతి రోజు ఆనందిస్తున్నారు ఇప్పటికీ, వారు ఆనందం పొందటానికి నగ్న నృత్యము ఉంటే చూడటానికి వెళ్ళుతున్నారు. ఎందుకు ఆనందం ఉంటుంది? ఎటువంటి ఆనందం అక్కడ ఉండదు. కానీ ఇది సర్దుబాటు. వారు ఈ విధముగా లేదా ఆ విధముగా ప్రయత్నిస్తున్నారు. అంతే.