TE/Prabhupada 0791 - ఒకరు కేవలం ప్రేమ మరియు భక్తియుక్త సేవ ద్వారాభగవంతుని సంతృప్తి పరచవచ్చు
Lecture on SB 7.9.11 -- Montreal, August 17, 1968
ఇప్పుడు మునుపటి శ్లోకములో ఇది వివరించబడింది అది ఏ భౌతిక ఐశ్వర్యము అయినా, లేదా పన్నెండు ఉన్నతమైన అర్హతలు కలిగి ఉన్న ఒక బ్రాహ్మణుడు కూడా అటువంటి వాటిని సంపాదించడము ద్వారా భగవంతుని సంతృప్తి పరచలేరు. ఒకరు కేవలం ప్రేమ మరియు భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని సంతృప్తి పరచవచ్చు. ఎందుకు? కాదు, అతను కాదు... అప్పుడు ఎందుకు చాలా ఐశ్వర్యము సృష్టించబడింది చక్కని ఆలయం లేదా చర్చిలను కట్టడంలో, చాలా డబ్బు ఖర్చు చేయబడుతుంది? ఇది భగవంతుని సంతృప్తిపరచడమా? ఎందుకు వారు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు? ఆధునిక ఆర్థికవేత్త ఇది అనుత్పాదక పెట్టుబడి అని చెబుతున్నాడు. ఎందుకంటే మీరు ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలనుకుంటే ఉదాహరణకు భారతదేశంలో మనము చాలా ఆలయాలు కలిగి ఉన్నాము, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ప్రతి ఒక్కటీ ఒక కోట, చాలా గొప్ప కోటలా ఉంటుంది. అక్కడ రంగనాథం లో ఆలయం ఉంది, ఇది కొన్ని మైళ్ళ మేర ఉన్న ఆలయం. ఏడు ద్వారాలు ఉన్నాయి. చాలా గొప్ప ఆలయం. అనేక ఇతర దేవాలయాలు. అదేవిధముగా, మీ దేశంలో కూడా చాలా మంచి చర్చిలు ఉన్నాయి. నేను అమెరికా అంతటా వెళ్ళాను, నేను చాలా గొప్ప చర్చిలను చూశాను. ఇక్కడ కూడా, మాంట్రియల్ లో, అనేక గొప్ప చర్చిలు ఉన్నాయి. ఈ విధంగా ఎందుకు వారు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆధునిక ఆర్థికవేత్త అది అనుత్పాదక పెట్టుబడి అని చెప్తారు
కాబట్టి ఈ చర్చి భవనం లేదా ఆలయ భవనం లేదా మసీదు భవనం ప్రాచీనమైన సమయం నుండి మన వరకు వచ్చింది. ప్రజలు వారి డబ్బు పెట్టుబడి పెడుతున్నారు, కష్టపడి సంపాదించిన డబ్బును. ఎందుకు? వృథాగానా? అనుత్పాదకమా? లేదు. వారికి తెలియదా. అది ఎంత ఉత్పాదకమును ఇస్తుందో వారికి తెలియదా. అందువలన ఈ దుష్ట నాగరికతలో వారు చక్కని, అలంకరించబడినవి నిర్మించడమును నిలిపివేశారు... వృందావనములో ఏడు అంతస్తులు ఉన్న గోవిందజీ ఆలయం ఉంది. రాజకీయ కారణాల వలన ఔరంగజేబు నాలుగు అంతస్తులను పగులగొట్టినాడు. ఇప్పటికీ, మూడు అంతస్తులు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఎవరైనా అక్కడకు వెళితే, ఆ దేవాలయంలో ఎంత అద్భుతమైన పనితనం ఉందో చూస్తారు. కావున దీనికర్థం అప్పటి రాజులు లేదా ధనవంతులైన వ్యక్తులు మూర్ఖులా? కేవలము ప్రస్తుత సమయంలో మనము చాలా తెలివైనవారిగా ఉన్నామా? లేదు. వారు మూర్ఖులు కాదు. అది ప్రహ్లాద మహారాజ ప్రార్థనలలో వివరించబడింది. Naivātmanaḥ prabhur ayaṁ nija-lābha-pūrṇo. మహోన్నతమైన భగవంతుని ఒక మంచి ఆలయాన్ని నిర్మించడం ద్వారా మీరు సంతృప్తి పరచలేరు, కానీ ఆయన సంతృప్తి చెందాడు. అయినప్పటికీ, ఆయన సంతృప్తి చెందాడు. ఆయన నిజ-లాభ-పూర్ణ. ఆయన తనకు తాను పూర్తిగా సంతృప్తి చెందివున్నాడు ఎందుకంటే ఆయనకు ఎటువంటి అవసరం ఉండదు. మనకు అవసరం ఉంది. ఉదాహరణకు నేను ఒక చిన్న అపార్ట్మెంట్ లో అద్దెకు ఉన్నాను అనుకుందాం. ఎవరైనా చెప్పినప్పుడు, "స్వామిజీ, రండి, నేను చాలా సుందరమైన వైభవంగల ఆలయాన్ని నిర్మిస్తాను, మీరు ఇక్కడకు రండి." ఓ... నేను తప్పకుండా అంగీకరిస్తా. కానీ కృష్ణుడు లేదా భగవంతుడు అలాంటివాడా? ఆయన చాలా చక్కని లోకములు నిర్మించవచ్చు, ఒకటి రెండు మాత్రమే కాదు, కానీ లక్షల కోట్లు, చాలా చక్కని సముద్రాలతో మరియు కొండలతో మరియు పర్వతాలతో మరియు అడవులతో, పూర్తిగా జీవులతో. నేను నిర్మించే ఆలయం కొరకు ఆయన ఎందుకు ఆరాటపడతాడు? కాదు వాస్తవం కాదు.