TE/Prabhupada 0802 - కానీ ఈ కృష్ణ చైతన్య ఉద్యమం చాలా బాగుంది,ఆ అధీర, ధీరా కావచ్చు
Lecture on SB 1.7.18 -- Vrndavana, September 15, 1976
కాబట్టి మనము ధీరా కావాలి. అప్పుడు మనం మరణం గురించి భయపడము. మనము ధీర అయితే తప్ప... వ్యక్తులలో రెండు వర్గాలు ఉన్నారు: ధీర మరియు అధీర. ధీర అనగా కలత చెందటానికి కారణం ఉన్నప్పటికీ కలవరపడని వ్యక్తి. కలత చెందటానికి కారణం లేనప్పుడు ఒకరు కలవరపడకపోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మనం పడటము లేదు, ప్రస్తుతం, ప్రస్తుత క్షణంలో మనం మరణానికి భయపడటము లేదు. కానీ మనము భూకంపం వస్తుందని తెలుసుకున్న వెంటనే, మనము భయపడతాము ఈ భవనం పడిపోతుంది, కలత యొక్క కారణం, అప్పుడు మనం చాలా కలత పడతాము -కొన్నిసార్లు పెద్దగా ఏడుస్తాము. కాబట్టి ఎవరైతే కలతకు కారణం ఉన్నప్పటికీ, కలవరపడని వ్యక్తి, ఆయనను ధీరా అని పిలుస్తారు. ధీరస్తత్ర న ముహ్యతి. ఇది భగవద్గీత ప్రకటన. మనము అధీరా నుండి ధీరా అవ్వాలి. కానీ ఈ కృష్ణ చైతన్య ఉద్యమం చాలా బాగుంది, ఆ అధీర, ధీరా కావచ్చు. ఇది ఈ ఉద్యమం యొక్క లాభం. Kṛṣṇotkīrtana-gāna-nartana-parau premāmṛtāmbho-nidhī dhīrādhīra. Kṛṣṇotkīrtana-gāna-nartana-parau premāmṛtāmbho-nidhī dhīrādhīra-jana-priyau. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఈ ఇద్దరు వ్యక్తులకు సంతోషాన్ని ఇస్తుంది, అనగా ధీరా మరియు అధీరా. ఇది చాలా బాగుంది. Dhīrādhīra-jana-priyau priya-karau nirmatsarau pūjitau. ఇది చైతన్య మహాప్రభుచే ప్రవేశపెట్టబడింది, ఆ తరువాత ఆరుగురు గోస్వాములు అనుసరించారు. Vande rūpa-sanātanau raghu-yugau śrī-jīva-gopālakau.
కాబట్టి ఇది ఉద్యమము, ఒక అధీరాను ధీరా ఎలా చేయాలనేది. ప్రతి ఒక్కరూ అధీర. ఎవరు కాదు... ఎవరు మరణానికి భయపడడం లేదు? ఎవరు భయపడడం లేదు...? అయితే, వారు పూర్తిగా విశ్వాసము లేనివారు, వారు మర్చిపోయారు. కానీ బాధ ఉంది. ఒకరు మరణించే సమయంలో ఎలా బాధపడుతున్నారో మనం చూడవచ్చు. కొందరు మృతి చెందుతున్నారు... ఈ రోజుల్లో చాలా సాధారణమైనది... కోమా. ఒకరు మంచంలో పడి వారాలు, రెండు వారాలు; ఏడుస్తుంటారు జీవితం సజావుగా వెళ్ళడం లేదు, ఎవరు చాలా, చాలా పాపము చేసారో వారు. కాబట్టి మరణం సమయంలో గొప్ప బాధ ఉంది. జన్మించే సమయంలో గొప్ప బాధ ఉంది, మీకు వ్యాధి ఉన్నప్పుడు చాలా బాధ ఉంది, మీరు వృద్ధులైనప్పుడు చాలా బాధలు ఉంటాయి. శరీరం బలంగా లేదు. మనము చాలా రకాలుగా బాధపడుతున్నాము, ముఖ్యంగా కీళ్ళవాతం మరియు అజీర్ణం. ఇంకా రక్తపోటు, తలనొప్పి, చాలా విషయాలు. అందువల్ల ఎలా ధీర అవ్వాలి అనే దానికి ప్రతి ఒక్కరు శిక్షణ తీసుకోవాలి. ఈ విషయాలు, అవాంతరాలు, మనలను అధీరాని చేస్తాయి, మనము ధీరా అయ్యే వరకు శిక్షణ తీసుకోవాలి. అది ఆధ్యాత్మిక విద్య. ప్రతి ఒక్కరూ దానిని తెలుసుకోవాలి, mātrā-sparśās tu kaunteya śītoṣṇa-sukha-duḥkha-dāḥ ( BG 2.14) ఈ బాధలు, మాత్రా-స్పర్శాః, తన్-మాత్రా. ఇంద్రియాల వలన, ఇంద్రియ అనుభవము వలన, మనము బాధపడుతున్నాము. ఇంద్రియాలు భౌతిక ప్రకృతి స్వభావం తో తయారు చేయబడినవి. అందువల్ల ఒకరు భౌతిక ప్రకృతిని అధిగమించినచో, అప్పుడు ఆయన ధీరా అవుతాడు. లేకపోతే, ఒక వ్యక్తి అధీర కావలసి ఉంటుంది. ధీరాధీర -జన-ప్రియౌ ప్రియ-కరౌ