TE/Prabhupada 0816 - ఈ శరీరం ఒక యంత్రం, కాని మనము యంత్రమును నేనుగా అంగీకరిస్తున్నాము



751015 - Lecture SB 01.07.05-6 - Johannesburg


yayā sammohito jīva
ātmānaṁ tri-guṇātmakam
paro 'pi manute 'narthaṁ
tat-kṛtaṁ cābhipadyate
(SB 1.7.5)

కావున మన ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది, ఆ సమ్మోహితా, భ్రాంతి చెందినది మాయ ద్వారా తికమక పెట్టబడినది. మనము దేవుడు యొక్క శాశ్వత భాగము, కాని ఈ భౌతిక శక్తి వలన మంత్రించ బడటము వలన, లేదా దేవుడి బాహ్య శక్తి వలన, మనము మనల్ని మర్చిపోయాము, మనము ఇప్పుడు చిక్కుకొన్నాము. మన జీవిత లక్ష్యాన్ని మరచిపోయాము. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇuṁ durāśayā ye bahir-artha-māninaḥ ( SB 7.5.31) బద్ధ జీవాత్మ ... బద్ధ జీవాత్మ అంటే ప్రాణము ఉన్న జీవి అని అర్థము. భౌతిక ప్రకృతి యొక్క ఈ చట్టాలకు అలవాటు పడిన ఆత్మ. భౌతిక ప్రకృతి యొక్క చట్టాల ప్రకారము మీ ప్రవృత్తికి అనుగుణంగా మీరు ఒక నిర్దిష్ట శరీరాన్ని అంగీకరించాలి. మనము ప్రవృత్తిని సృష్టించుకుంటాము. కృష్ణుడు చాలా దయతో ఉంటాడు ఆయన మీకు ఈ సదుపాయాన్ని ఇస్తాడు: "అది సరే." ఉదాహరణకు పులి వలె, ఆయన రక్తం పీల్చుకోవాలని కోరుకుంటాడు. లేదా ఎవరైనా, ఆయన రక్తాన్ని పీల్చుకోవాలని కోరుకుంటాడు అప్పుడు ఆయనకు ఒక పులి శరీరం యొక్క సౌకర్యం ఇవ్వబడుతుంది. ఒక వ్యక్తికి తినడానికి వివక్ష లేనప్పుడు - ఏది అందుబాటులో ఉన్నా, ఆయన తినగలిగితే - అప్పుడు ఆయనకు ఒక పందిగా మారే సౌకర్యం ఇవ్వబడుతుంది. మలము వరకు, ఆయన తినవచ్చు.

కాబట్టి ఇది భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది:

īśvaraḥ sarva-bhūtānāṁ
hṛd-deśe 'rjuna tiṣṭhati
bhrāmayan sarva-bhūtāni
yantrārūḍhāni māyayā
(BG 18.61)


ఇది చాలా ముఖ్యమైనది. Yantrārūḍhāni māyayā. మనము ఒక యంత్రం మీద స్వారీ చేస్తున్నాం. ఈ శరీరం ఒక యంత్రం, కాని మనము యంత్రమును నేనుగా అంగీకరిస్తున్నాము. దీనిని సమ్మోహితా అంటారు, "తికమకపెట్టే." మీరు కారులో ప్రయాణిస్తుంటే, "నేను కారు," అని మీరు అనుకుంటే ఇది మూర్ఖత్వం కనుక, అదేవిధముగా, నేను ఈ యంత్రాన్ని కలిగి ఉన్నాను, యంత్రం, శరీరం, అది నేను లోపల ఉండటము వలన పనిచేస్తుంది, లేదా నేను డ్రైవ్ చేస్తున్నాను, లేదా కృష్ణుడు నాకు నడపటానికి బుద్ధిని ఇస్తున్నాడు. కాని ఈ శరీరముతో నన్ను నేను గుర్తించినట్లయితే, సరిగ్గా ఒక వెర్రి మనిషి వలె - ఆయన కారు డ్రైవ్ చేస్తున్నాడు, ఆయన కారుతో తనను తాను గుర్తిస్తే, ఆయన ఒక వెర్రివాడు - కాబట్టి దీనిని సమ్మోహితా అంటారు. Yayā sammohito jīva. ఉదాహరణకు, నేను చెప్పాను ... గత రాత్రి, మనము డ్రైవర్ను చూడడము లేదు, డ్రైవర్ వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు మనము కారు కదలకుండా ఉండటము చూస్తాము, అప్పుడు నేను అర్థం చేసుకోవచ్చు, "ఓ, డ్రైవర్, నా తండ్రి లేదా నా కుమారుడు, వెళ్ళిపొయినాడు." మనము కొన్నిసార్లు ఏడుస్తాము "నా తండ్రి చనిపోయాడు" లేదా "నా కొడుకు చనిపోయాడు," కాని మనము సమ్మోహితా కనుక, మనము నిజానికి ఎప్పుడూ తండ్రిని లేదా కుమారుడిని చూడలేదు. మనము తండ్రి మరియు కొడుకుగా ఈ చొక్కా - ప్యాంటు శరీరాన్ని అంగీకరించాము. దీనిని సమ్మోహ అంటారు, భ్రాంతి.

Yayā sammohito jīva ātmānam: the spirit soul, ātmānaṁ tri-guṇātmakam... ఈ శరీరం త్రిగుణాత్మకం . భౌతిక ప్రకృతి గుణాల ప్రకారం ఈ శరీరము తయారు చేయబడింది: kāraṇaṁ guṇa-saṅgo 'sya ( BG 13.22) అంతా స్పష్టంగా భగవద్గీతలో వివరించారు. ఇది మరింత చెప్పబడినది. భగవద్గీతలో ... మీరు భగవద్గీతని అర్థం చేసుకుంటే, మీరు వాస్తవమునకు కృష్ణుడికి శరణాగతి పొందితే ... కృష్ణుడి యొక్క ఆఖరి పదం sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) మీరు వాస్తవమునకు భగవద్గీతని అర్థం చేసుకుంటే, ఇది ఫలితం. శ్రీమద్-భాగవతములో చెప్పబడింది, tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ hareḥ ( SB 1.5.17) స్వ-ధర్మ. కృష్ణుడు చెప్తాడు, sarva-dharmān parityajya. అంటే అర్థము మనలో ప్రతి ఒక్కరు ... ధర్మ అంటే వృత్తిపరమైన కర్తవ్యము. అది ధర్మ, లక్షణం. కాబట్టి కృష్ణుడు ఆదేశించాడు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) మనం అంగీకరిస్తే, మూఢ విశ్వాసం ద్వారా కూడా... ఇది శ్రీమద్-భాగవతం లో ధృవీకరించబడింది. Tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ hareḥ patet tato yadi, bhajann apakvo 'tha. నారద ముని చెప్తాడు "ఎవరైనా మూఢ విశ్వాసం ద్వారా అయినా - అది సరే, కృష్ణుడు sarva-dharmān parityajya. అని చెప్తాడు. ఇతర పనులను నిలిపివేద్దాం, కృష్ణ చైతన్య వంతుడిని చేద్దాము వ్యక్తి ఒక మూఢ విశ్వాసం వలన అయినా అంగీకరించినా, పూర్తిగా అర్థము చేసుకోకపోయినా, ఆయన కూడా అదృష్టవంతుడు" ఆయన వాస్తవమైన విషయమును అంగీకరించాడు కనుక ఆయన కూడా అదృష్టంతుడు. అందువల్ల నారద ముని చెప్తారు," మూఢ విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరు అంగీకరిస్తున్నారు, తర్వాత, bhajann apakvo 'tha, "భక్తియుక్త సేవ అమలు చేయడములో ఆయన పరిపక్వత పొందకపోతే , ఆయన పతనము అవుతాడు, అప్పుడు, "నారద ముని చెప్తాడు, yatra kva vābhadram abhūd amuṣya kim, ఆ వ్యక్తికి నష్టం ఎక్కడ ఉంది? మరొక వైపు, దీనిని అంగీకరించని వ్యక్తి ఎవరైనా- ఆయన చాలా నిత్యము తన బాధ్యతలను అమలు చేస్తుంటే..., భౌతిక బాధ్యతలను - ఆయన దాని వలన ఏమి పొందుతాడు? "ఇది అభిప్రాయం. కృష్ణ చైతన్యమును మూఢ విశ్వాసం వలన అయినా అంగీకరించినట్లయితే, ఆ తరువాత, ఆయన పతనము అయినా కూడా, నష్టము లేదు. మనము మన భౌతిక బాధ్యతలకు విధేయతగా చాలా నమ్మకముగా ఉంటే, అప్పుడు నారద ముని చెప్తాడు, "మనము ఏమి లాభము పొందుతాము?" కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయము