TE/Prabhupada 0818 - సత్త్వ గుణము యొక్క స్థితిపై, పరిపుర్ణమైన మంచిని అర్థం చేసుకోవచ్చు



Lecture on SB 7.9.8 -- Seattle, October 21, 1968


తమాల కృష్ణ: మనము సత్త్వ గుణాల్లోకి ఎలా ప్రవేశించగలము?

ప్రభుపాద: కేవలం నాలుగు సూత్రాలు అనుసరించటానికి ప్రయత్నించండి. మత్తు పదార్థాలు, జూదం, అక్రమ లైంగికత్వము, మాంసం తినటం ఉండకూడదు. అంతే. ఇది సత్త్వ గుణము. ఇది సత్త్వ గుణము. ఈ నిషేధాలు ఉన్నాయి. ఎందుకు? కేవలం సత్త్వ గుణములో మిమ్మల్ని నిలపడానికి. ప్రతి ధర్మములో.... ఇప్పుడు, టెన్ కమాండ్మెంట్స్ లో కూడా,  "చంపకూడదు" అని నేను చూసాను. అదే విషయము ఉంది, కానీ ప్రజలు పాటించటము లేదు. అది వేరే విషయం. ఏ ధార్మికమైన వ్యక్తి అయినా .... అతడు సత్త్వ గుణములో ఉండక పోతే అతడు ధార్మికంగా ఉండలేడు. రజో గుణంలో ఉన్న వ్యక్తి లేదా తమో గుణంలో ఉన్న వ్యక్తి, వారు ధార్మిక స్థితికి ఎదగలేరు. ధార్మిక స్థితి అంటే సత్త్వ గుణము. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. సత్త్వ గుణము యొక్క స్థితిపై, పరిపుర్ణమైన మంచిని అర్థం చేసుకోవచ్చు. మీరు తమోగుణ స్థితిలో ఉన్నట్లయితే, మీరు రజోగుణ స్థాయిలో ఉన్నట్లయితే, మీరు అంతా - మంచిని ఎలా అర్థం చేసుకోగలరు! అది సాధ్యం కాదు. అందువల్ల ఒకరు తనను తాను సత్త్వ గుణములో ఉంచుకోవాలి, సత్త్వ గుణము అంటే నిషేధాలను పాటించాలి. మీరు పది ఆజ్ఞలను లేదా నాలుగు ఆజ్ఞలను అనుసరించినా, అంతా ఒకటే. అంటే మిమ్మల్ని మీరు సత్త్వ గుణములో నిలుపుకోవాలి. సత్త్వ గుణములో స్థిరముగా ఉండాలి. భగవద్గీతలో చెప్పబడింది, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ( BG 10.12) కృష్ణుని అత్యంత పవిత్రునిగా అర్జునుడు అంగీకరించాడు. మీరు  పవిత్రము కాకపోతే పరమ పవిత్రుణ్ణి ఎలా చేరగలరు? కాబట్టి పవిత్రముగా మారటానికి ఇది పునాది, ఎందుకంటే మనం కలుషితమై ఉన్నాము. కాబట్టి పవిత్రముగా మారటానికి.... ఏకాదశి, ఎందుకు మనం పాటిస్తాము? పవిత్రముగా మారటానికి. బ్రహ్మచర్యము తపస్సు, తపస్సు, బ్రహ్మచర్యము, మనస్సును ఎల్లప్పుడూ కృష్ణచైతన్యములో ఉంచుకొని, శరీరాన్ని ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచడం - - ఈ విషయాలు మనల్ని సత్త్వ గుణంలో ఉండుటకు సహాయం చేస్తాయి. సత్త్వ గుణం లేకుండా, అది సాధ్యం కాదు. కానీ కృష్ణ చైతన్యం చాలా బాగుంది ఎవరో ఒకరు రజో గుణం లేక తమో గుణంలో ఉన్నా కూడా, ఒకేసారి అతడు సత్త్వ గుణము యొక్క స్థితికి ఉద్ధరింపబడతాడు, హరే కృష్ణ జపిస్తూ నియమ నిబంధనలను పాటించుటకు అంగీకరిస్తే ఈ హరే కృష్ణ జపము నియమ నిబంధనలను అనుసరించుట మనల్ని సత్త్వ గుణంలో ఉంచుతుంది. హామీ ఇవ్వబడినది, వైఫల్యం లేకుండా. అది చాలా కష్టమా? హుహ్? ఫర్వాలేదు.