TE/Prabhupada 0831 - మనం ఆసాధు మార్గాన్ని అనుసరించలేము. మనం సాధు మార్గాన్ని అనుసరించ వలెను



The Nectar of Devotion -- Vrndavana, November 13, 1972


ప్రద్యుమ్న: “ఇప్పుడు ఈ సాధన- భక్తి, లేదా భక్తి యుత సేవ యొక్క అభ్యాసం కూడా రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం నియమిత సూత్రాలు అంటారు. ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞ పైన లేదా ప్రామాణిక శాస్త్రాల యొక్క బలంతో ఈ విభిన్న నియమిత సూత్రాలను పాటించాలి.

ప్రభుపాద: అవును. నియమిత సూత్రాలు అంటే మీరు దేనినీ తయారు చేయరు. నియమిత సూత్రాలు అంటే ప్రామాణికం- ప్రామాణిక శాస్త్రాలలో పేర్కొన్నవి. ఇవి ఆధ్యాత్మిక గురువు చేత ద్రువీకరించబడినవి. ఎందుకంటే మనకు తెలియదు. ఇది ఆధ్యాత్మిక గురువు చేత నిర్ధారించబడినప్పుడు, అవును ఇది సరైనది. Sādhu guru, sādhu-śāstra-guru-vākya, tinete kariyā aikya. నరోత్తమ దాస ఠాకూర అదే ప్రకటన. సాధువు, అనుసరించే సూత్రాలు,sadhu-Marga anugamanam. మనం ఆసాధు మార్గాన్ని అనుసరించలేము. మనం సాధు మార్గాన్ని అనుసరించ వలెను. mahajano yena gatah sa panthah( cc Madhya 17.186) మనము ఒక మూర్ఖుని అనుసరించలేము, ఏదో ఒక పాటను తయారుచేస్తూ, ఏవో ఆలోచనలను తయారు చేయలేము. మనము దానిని అనుసరించలేము. ప్రామాణిక కీర్తన ఏమిటి, మనము దానిని పాడెదము. ప్రామాణిక పద్ధతి ఏమిటి, మనము అనుసరించాలి.Sādhu-guru-śāstra-vākya. సాధువు మరియు గురువు అంటే శాస్త్రం ఆధారంగా. శాస్త్రము అంటే సాధువు మరియు గురువు యొక్క ప్రకటనలు. కాబట్టి సాధువు, మరియు గురువు, మరియు శాస్త్రము ఒకేలా ఉన్నారు. కాబట్టి అవి ద్రువీకరించబడాలి. ఎవరైనా సాధువు శాస్త్రమునకు విరుద్ధముగా మాట్లాడితే, అతడు సాధువు కాదు. ఎవరైనా గురువు శాస్త్రమునకు వ్యతిరేకముగా వెళుతుంటే, ఆయన గురువు కాదు. శాస్త్రము అంటే ఆది గురువు మరియు సాధువు. శాస్త్రము అంటే ఏమిటి? శ్రీమద్- భాగవతములో ఉన్న విధముగానే. శ్రీమద్- భాగవతము అంటే మనము. నిజమైన సాధువు మరియు గురువు గురించి చదువుతున్నాము. ఉదాహరణకు ప్రహ్లాద మహారాజు, ప్రహ్లాద- చరిత్ర, ధృవ- చరిత్ర, అంబరీష- చరిత్ర, పాండవులు- భీష్ముని వలె. కాబట్టి భాగవతము అంటే భగవంతుడు ఇంకా భగ, భక్తుల మహిమలు అంతే. ఇది భాగవతము. కాబట్టి sādhu-guru-śāstra-vākya, tinete kariyā aikya.

కాబట్టి ఇది సాధనా- భక్తి. మనము ఆధ్యాత్మిక గురువు నుండి ఉపదేశము తీసుకోవాలి. Ādau gurvāśrayam, sad-dharma-pṛcchāt. ఎవరికి ఆధ్యాత్మిక గురువు అవసరం? ఎవరైతే సధర్మము గురించి ఆసక్తిగా ఉన్నారో, అసధర్మము గురించి కాదు. Sad-dharma-pṛcchāt. Tasmād guruṁ prapadyeta jijñāsuḥ śreya uttamam ( SB 11.3.21) ఎప్పుడైతే ఒకరు ఆధ్యాత్మిక జ్ఞానము తెలుసుకొనుటకు ఆసక్తి చూపుతారో అతడికి ఆధ్యాత్మిక గురువు కావాలి. ఒక ఆధ్యాత్మికం, ఒక ఆధ్యాత్మిక గురువు... ఆధ్యాత్మిక గురువును అంగీకరించడం ఒక సంప్రదాయం కాదు. ఏ విధముగా అయితే మనము ఒక కుక్కను ఉంచుకొనుట వలె, పెంపుడు జంతువు, అదేవిధముగా, మనము ఒక ఆధ్యాత్మిక గురువును పెట్టుకున్నట్లయితే, పెంపుడు ఆధ్యాత్మిక గురువు, నా పాపములన్నింటినీ మంజూరు చేయటానికి, అది ఆధ్యాత్మిక గురువును అంగీకరించటం కాదు. ఆధ్యాత్మిక గురువు అంటే tad viddhi praṇipātena paripraśnena sevayā ( BG 4.34) మీరు పూర్తిగా శరణాగతి పొందగలరు అనుకున్న వారిని మీరు ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించాలి. మీ సేవను అందించాలి. అది ఆధ్యాత్మిక గురువు. Sādhu-mārga-anugamanam. Sad-dharma-pṛcchāt. కాబట్టి ఆధ్యాత్మికం విషయముపై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే గురువు యొక్క అవసరం ఉంది. Tad viddhi praṇipātena paripraśnena sevayā. Tad-vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12). Tad-vijnana, ఆ విజ్ఞానము, ఆధ్యాత్మిక జీవితం యొక్క విజ్ఞాన శాస్త్రం. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం యొక్క విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తుడై ఉంటాడో, ఆధ్యాత్మిక గురువును ఒక సంప్రదాయము కోసము పెట్టుకోకూడదు. కాదు. ఒకరు తీవ్రముగా ఉండాలి.Tasmād guruṁ prapadyeta jijñāsuḥ śreya uttamam ( SB 11.3.21) మొదటిగా, ఎటువంటి విషయంలో ఒకరు ఆసక్తిగా ఉన్నారో తెలుసుకోవాలి, భౌతిక విషయములలోనా లేక ఆధ్యాత్మిక విషయములలోనా. అతడు వాస్తవముగా ఆధ్యాత్మిక విషయములలో ఆసక్తి కలిగి ఉంటే. అప్పుడు అతడు సరైన, ప్రామాణిక ఆధ్యాత్మిక గురువును వెతకాలి. Gurum eva abhigacchet. తప్పనిసరిగా కనుగొనాలి. అది ఎంపిక కాదు. ఇది తప్పని సరి తప్పనిసరిగా, మీరు దానిని నివారించలేరు. ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు లేకుండా, మీరు ఒక్క అడుగు ముందుకు వెయ్యలేరు