TE/Prabhupada 0840 - ఒక వేశ్య ఉంది ఆమె ఒక లక్ష వజ్రాలను ఖరీదుగా కోరుతుంది
751204 - Lecture SB 07.06.03 - Vrndavana
కాబట్టి ఒక వేశ్య కథ ఉంది, Lakṣahīra. ఒక వేశ్య ఉంది ఆమె ఒక లక్ష వజ్రాలను ఖరీదుగా కోరుతుంది. అది పెద్ద వజ్రమా లేదా చిన్న వజ్రమా అనేది పట్టింపు కాదు. అది ఆమె ఖరీదు. కాబట్టి ఒక వ్యక్తి కుష్టు వ్యాధి తో బాధపడుతున్నాడు, ఆయనకు సహాయము తీసుకుంటున్నాడు, ఆయనకు అతని భార్య, చాలా నమ్మకమైన భార్య సహాయం చేస్తుంది. అయినా, ఆయన బాధగా ఉన్నాడు. భార్య తన భర్తను అడిగింది, "ఎందుకు మీరు బాధగా ఉన్నారు? నేను మీకు చాలా సేవలను చేస్తున్నాను. మీరు కుష్ఠురోగి, మీరు కదలలేరు. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ... నేను ఒక బుట్టలో పెట్టుకొని, ఎత్తుకొని వెళ్తాను. అయినప్పటికీ, మీరు దుఃఖముగా ఉన్నారు? " కాబట్టి ఆయన "అవును" అని ఒప్పుకున్నాడు. ఓ", కారణం ఏమిటి?" ఇప్పుడు నేను వేశ్య దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాను. Lakṣahīra. చూడండి. ఆయన కుష్ఠురోగి, ఒక పేదవాడు, ఆయన ఒక వేశ్య దగ్గరకు వెళ్ళడానికి ఆశపడుతున్నాడు ఎవరైతే 100,000 వజ్రాలను అడుగుతుందో కాబట్టి ఏమైనప్పటికీ, ఆమె విశ్వాసము గల భార్య. ఆమె తన భర్తను సంతృప్తి పరచాలని కోరుకున్నాది. ఏదో ఒక మార్గము ద్వారా, ఆమె ఏర్పాటు చేసింది. అప్పుడు, కుష్ఠరోగి వేశ్య ఇంటిలో ఉన్నప్పుడు, వేశ్య ఆయనకి చాలా మంచి ఆహార పదార్ధాలను ఇచ్చింది, కానీ ప్రతిదీ రెండు గిన్నెలలో , ప్రతిదీ - ఒకటి బంగారు గిన్నె , మరొకటి ఇనుము గిన్నె. అతడు భోజనము చేయుచుండగా అతడు వేశ్యను అడిగాడు, "నీవు నాకు రెండు గిన్నెలలో ఎందుకు ఇచ్చావు?" అని అడిగాడు. ఇప్పుడు, ఎందుకంటే మీరు వివిధ గిన్నెలలో వివిధ రుచులను అనుభూతి చెందుతారేమో అని తెలుసుకోవాలనుకున్నాను. కావున ఆయన చెప్పాడు, "లేదు, నేను రుచిలో ఏ తేడాను కనుగొనలేదు. బంగారు గిన్నెలో సూప్ ఇనుము గిన్నెలో సూప్, రుచి ఒకే విధముగా ఉన్నది. " అప్పుడు నీవు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఇది మూర్ఖత్వం. మొత్తం ప్రపంచం ఇలాగే వెళ్ళుతుంది వారు కేవలం వివిధ గిన్నెలలో అదే విషయమును రుచి చూడడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే. వారు రుచి కోల్పోవడము లేదు. "అయ్యా ఇంకా వద్దు, నేను తగినంత రుచి చూసాను." వాస్తవం కాదు. దీనిని వైరాగ్య-విద్య అని అంటారు, ఇక రుచి చూడను: ఇది అంతా ఒకటే, నేను ఈ గిన్నెలో లేదా ఆ గిన్నెలో తీసుకున్నా.
అందు వలన ఇది అది sukham aindriyakam, ఇంద్రియ ఆనందం, మీరు ఒక కుక్కగా లేదా మానవుడిగా లేదా దేవతగా మీరు ఆనందించినా అది పట్టింపు లేదు, లేదా యూరోపియన్ గా లేదా అమెరికన్ గా లేదా భారతీయుని వలె - రుచి ఒకటే ఉంది. ఇది చాలా ముఖ్యం. మీరు మెరుగైన రుచిని పొందలేరు. మెరుగైన రుచి కృష్ణ చైతన్యము మాత్రమే . Paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) మీరు కృష్ణ చైతన్యము కోసం మీ రుచిని పెంచుకోకపోతే, అప్పుడు మీరు ఈ గిన్నెలో లేదా ఆ గిన్నెలో రుచి చూడడానికి ప్రయత్నిస్తారు. అది చట్టం. మీరు మీ వ్యాపారమును కొనసాగిస్తారు మరియు మీ వ్యాధిని కొనసాగిస్తారు, ఈ గిన్నెలో లేదా ఆ గిన్నెలో రుచి చూడడానికి: "ఇది ఈ గిన్నెలో చాలా రుచిగా ఉండవచ్చు, చాలా రుచిగా ఉండవచ్చు ..." ప్రపంచం మొత్తం ఇలానే జరుగుతోంది. ఈ దుష్టులు, వారు మైథున జీవితం రుచి కోసం వివిధ దేశాలకు వెళతారు. వారు పారిస్ కి వెళ్తారు ... (బ్రేక్) ...sukham aindriyakaṁ daityā, sarvatra labhyate daivād yathā duḥkham ( SB 7.6.3) ఉదాహరణకు దుఃఖము. దుఃఖము అంటే అసంతృప్తి. ఒక లక్షాధికారి టైఫాయిడ్తో బాధపడుతున్నాడు ఒక పేద వ్యక్తి టైఫాయిడ్తో బాధపడుతున్నడు అనుకుందాం. అంటే పేదవాని కంటే లక్షాధికారికి తక్కువ బాధ ఉంటుందా? టైఫాయిడ్ జ్వరము వచ్చినప్పుడు, మీరు ధనవంతుడు లేదా పేదవారు అయినా, టైఫాయిడ్ జ్వరం యొక్క బాధలు ఒకేలా ఉంటాయి. "ఈ వ్యక్తి చాలా ధనవంతుడు, ఆయన టైఫాయిడ్ నుండి బాధపడటం లేదు." అని కాదు. అసంతృప్తి వివిధ గిన్నెలలో ఒకే విధముగా ఉంటుంది, అదేవిధముగా, సంతోషం కూడా వివిధ గిన్నెలలో అదే ఉంటుంది. ఇది జ్ఞానం. ఎందుకు నేను నా సమయం వృధా చేయాలి రుచి చూడడానికి, వివిధ గిన్నెలలో ఆనందం మరియు బాధను రుచి చూడడానికి? వేర్వేరు గిన్నెలు అంటే ఈ భిన్నమైన శరీరములు.
కాబట్టి ఇది మన కర్తవ్యము కాదు. మన కర్తవ్యము మన వాస్తవ చైతన్యం, కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుట. ప్రస్తుత క్షణం నేను ఏ గిన్నెలో ఉన్నానో అనేది పట్టింపు లేదు. Ahaituky apratihatā ( SB 1.2.6) మీరు ఎటువంటి సంకోచం లేకుండా కృష్ణ చైతన్యమును రుచి చూడవచ్చు, ఎలాంటి అడ్డంకి లేకుండా, ఎలాంటి ఆటంకము లేకుండా. మీరు కలిగి ఉండవచ్చు. కేవలం మన చైతన్యములోకి, లోపలికి చూసి మరియు మనము చైతన్యమును సరిదిద్దుకోవాలి. ఈ మానవ రూపంలో ఇది అవసరం. అందువల్ల ప్రహ్లాద మహారాజు ప్రారంభంలో చెప్తారు, durlabhaṁ mānuṣaṁ janma ( SB 7.6.1) ఈ అవగాహన, ఈ జ్ఞానం, కేవలము మానవ రూపంలో మాత్రమే పొందవచ్చు. అసంతృప్తి మరియు బాధ యొక్క ఈ విశ్లేషణ మానవునికి వివరించవచ్చు. నేను ఇక్కడ మూడు డజన్ల కుక్కలను పిలిచి వాటిని అడుగుతాను, "ఇప్పుడు భాగవతము వినండి," అది సాధ్యం కాదు. కుక్క శ్రీమద్-భాగవతమును అర్థం చేసుకోలేదు, కానీ ఒక వ్యక్తి, ఆయన ఎంత అధమమైనా, కొంచము తెలివితేటలు కలిగి ఉన్నట్లయితే, అతడు అర్థం చేసుకోగలడు. అందువల్ల ప్రహ్లాద మహారాజు చెప్తాడు, durlabhaṁ mānuṣaṁ janma. భాగవత-ధర్మము అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం ఉన్నది. పిల్లులు మరియు కుక్కలు లాగా కోల్పోవద్దు.
చాలా ధన్యవాదాలు