TE/Prabhupada 0843 - వారి జీవిత ప్రారంభమే పొరపాటుగా ఉంది. వారు ఈ శరీరమే నేను అని అనుకుంటున్నారు



761215 - Lecture BG 16.07 - Hyderabad


కాబట్టి ఈ అసురులైన ప్రజలు, వారికి వారి గమ్యం ఏమిటో తెలియదు. వారు సొంత-ఆసక్తి అని చెప్తారు, కానీ ఈ మూర్ఖులకు, వారికి సొంత-ఆసక్తి అంటే ఏమిటో వారికి తెలియదు, ఎందుకంటే వారి జీవిత ప్రారంభమే పొరపాటుగా ఉంది. వారు ఈ శరీరమే నేను అని అనుకుంటున్నారు. కాబట్టి వారికి సొంత-ఆసక్తి ఎలా తెలుస్తుంది? ప్రాథమిక సూత్రమే తప్పుగా ఉంది. దేహాత్మ బుద్ధి. కుక్కలు, పిల్లులు, అవి "నేను ఈ దేహము అని అనుకుంటాయి." కావున అదే ఆసక్తి కలవాడు, అసురుడు. వారికి తెలియదు, కానీ వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. Dehino 'smin yathā dehe ( BG 2.13) ఈ శరీరములో ఆత్మ ఉంది. వారు అర్థం చేసుకోలేరు. కాబట్టి వారి సొంత-ఆసక్తి తప్పుగా ఉంది. వాస్తవమైన స్వార్థగతి "నేను ఆత్మను, నేను భగవంతుని కుమారుడిని. నా తండ్రి చాలా చాలా ధనవంతుడు, సంపన్నమైనవాడు. నేను నా తండ్రి సాంగత్యమును విడిచిపెట్టాను మరియు, అందుచే నేను బాధపడుతున్నాను. " లేకపోతే బాధ యొక్క ప్రశ్నేలేదు. మాకు అనుభవము ఉంది. చాలా ధనవంతుడి కుమారుడు, ఎందుకు ఆయన బాధపడాలి? కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ahaṁ bīja-pradaḥ pitā ( BG 14.4) నేను అన్ని జీవులకు విత్తనాన్ని ఇచ్చే తండ్రిని. అప్పుడు... భగవంతుడు అంటే ṣaḍ-aśśvarya-pūrṇaḥ, ఆరు రకాల సంపదలు ఉన్నాయి. ఆయన పూర్ణంగా కలిగిఉన్నాడు. ఆయన ప్రతి దాని యొక్క యజమాని, bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram ( BG 5.29) ప్రతి ఒక్క దాని యొక్క యజమాని అయిన ఒక వ్యక్తి యొక్క కుమారుడిని అయితే,, అప్పుడు నేను బాధ పడే ప్రశ్న ఎక్కడ ఉంది? కాబట్టి సొంత-ఆసక్తి యొక్క ప్రాథమిక సూత్రం కోల్పోతుంది.

కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వారి చైతన్యమును పునరుద్ధరించడానికి ఉంది మీరు ఈ శరీరము కాదు, మీరు ఆత్మ. మీరు భగవంతుని యొక్క భాగము. ఎందుకు మీరు బాధపడాలి? కాబట్టి కృష్ణ చైతన్యమును పెంచుకోండి, కేవలం కృష్ణ చైతన్యముని పెంచుకోవడము ద్వారా మీరు తిరిగి భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్తారు, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. " దీనిని కృష్ణుడు నిర్ధారిస్తున్నాడు. Duḥkhālayam aśāśvatam, nāpnuvanti mahātmānaḥ saṁsiddhiṁ paramāṁ gatāḥ, mām upetya ( BG 8.15) ఎవరైనా నా దగ్గరకు వస్తే, మాముపేత్య, అప్పుడు ఆయన తిరిగి ఈ భౌతిక ప్రపంచములోనికి రాడు, duḥkhālayam aśāśvatam ( BG 8.15) ఈ ప్రదేశము బాధ పడటానికి ఉన్న ప్రదేశము. వారికి సొంత ఆసక్తి తెలియదు కనుక, వారు బాధలు అనుభవించే ప్రదేశమును ఆనందించే ప్రదేశముగా అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇది బాధలను అనుభవించే ప్రదేశము.

ఎందుకు మీరు ఈ శరీరమును కప్పుకుంటున్నారు? శరీరమే బాధలు పడటానికి కారణము మరియు వాతావరణముతో సంబంధము వలన నేను చాలా బాధను అనుభూతి చెందుతున్నాను. అందువలన నేను కప్పుకోవాలి. ఇది బాధలను ఉపశమింపచేసే మార్గము. పరిస్థితి బాధ కలిగించేదిగా ఉంది, కానీ ఎట్లాగైతేనే మనము బాధను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధముగా, వేసవి కాలంలో కూడా, బాధ ఉంది. ఆ సమయంలో మనము ఈ కవచాన్ని కోరుకోము; మనకు విద్యుత్ ప్యాన్లు కావాలి. కాబట్టి ఎల్లప్పుడూ బాధ ఉంటుంది. వేసవి కాలంలో లేదా చలి కాలములో, కష్టాలు తప్పకుండా ఉంటాయి. అది మనము అర్థం చేసుకోలేము. ఇది మన ఆసురిక స్వభావమునకు కారణము. కాబట్టి మనము ప్రశ్నించము. వేసవి కాలంలో మరియు శీతాకాలంలో... వేసవి కాలములో, మనము ఏదైనా చల్లని వాటిని ఇష్టపడతాము, శీతాకాలంలో మనము ఏదైనా వెచ్చని వాటిని కోరుకుంటాము. కాబట్టి రెండు విషయాలు ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు వెచ్చదనం బాధగా ఉంటుంది; కొన్నిసార్లు ఈ చల్లదనము కూడా బాధ ఉంటుంది. కావున ఆనందం ఎక్కడ ఉంది? మనము కేవలం ఆకాంక్షిస్తున్నాము "ఈ సమయంలో, వెచ్చదనము ఉంటే..." కానీ వెచ్చదనము కూడా బాధగా ఉంటుంది. అందువల్ల కృష్ణుడు ఇలా అంటాడు "ఈ బాధ గురించి ఆలోచించకండి, అది కొనసాగుతూ ఉంటుంది. వేసవి కాలంలో మీరు దేనినో చాలా ఆనందము అని ఆలోచిస్తారు. శీతాకాలంలో అదే విషయము ఆనందముగా ఉండదు. అందువల్ల అవి వచ్చి వెళ్తాయి. ఈ బాధ మరియు ఆనందము అని పిలవబడే వాటి గురించి ఆలోచించ వద్దు. మీ కర్తవ్యమును చేయండి, కృష్ణ చైతన్యమును. "