TE/Prabhupada 0851 - నమిలినదే తిరిగి నమలడము. ఇది భౌతిక జీవితము
750306 - Lecture SB 02.02.06 - New York
నమిలినదే తిరిగి నమలడము. ఇది భౌతిక జీవితము నితాయ్: "ఈ విధముగా స్థిరపడి, ఒకరు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న సర్వ శక్తిమంతుడు అయిన పరమాత్మకు సేవ చేయాలి. ఎందుకంటే ఆయన సర్వ శక్తిమంతుడు, భగవంతుడు, శాశ్వతమైనవాడు మరియు అపరిమితమైనవాడు, ఆయన జీవితము యొక్క అంతిమ లక్ష్యం, ఆయనని ఆరాధించడం ద్వారా బద్ధ స్థితి యొక్క కారణాన్ని ముగించవచ్చు."
ప్రభుపాద:
- evaṁ sva-citte svata eva siddha
- ātmā priyo 'rtho bhagavān anantaḥ
- taṁ nirvṛto niyatārtho bhajeta
- saṁsāra-hetūparamaś ca yatra
- (SB 2.2.6)
గత రాత్రి మనం తన నిర్వహణ గురించి ఎందుకు ఆలోచించాలి అని మనము చర్చించాము మరియు సంపదతో గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి వేడుకోవాలా. ఆయన తన సొంత జీవన స్థితిని ఏర్పాటు చేసుకోగలడు. జీవన పరిస్థితి āhāra-nidrā-bhaya-maithunaṁ (Hitopadeśa 25). జీవితములో సన్యాస ఆశ్రమములో ఉన్నవారు... ఆయన మొదట మైథునజీవితమును మరియు భయమును పూర్తిగా త్యజించాలి. ఇది పరిత్యజించడము. ఉదాహరణకు ఇక్కడ చాలా బ్రహ్మచారులు మరియు సన్యాసులు ఉన్నారు. వారు ప్రతీదీ పరిత్యజించ వలసి ఉంది. ప్రత్యేకంగా సన్యాసి, వానప్రస్త మరియు బ్రహ్మచారులు. పరిత్యజించారు. మొట్టమొదట ఇంద్రియ తృప్తిని త్యజించవలెను. అందువల్ల సన్యాస ఆశ్రమములో ఉన్న వ్యక్తిని స్వామి అంటారు. స్వామి అంటే యజమాని. లేదా గోస్వామి. కాబట్టి గో అంటే అర్థం "ఇంద్రియాలు," స్వామి అంటే "యజమాని" తన ఇంద్రియాలకు యజమాని అయినవాడు, ఆయన గోస్వామి లేదా స్వామి. లేకపోతే, తన ఇంద్రియాలకు సేవకుడు అయితే, ఆయన ఎలా స్వామి లేదా గోస్వామి అవుతాడు? ప్రతి పదమునకు అర్థం ఉంది. అందువలన ఒకరు త్యజించాలి. ఇది భౌతిక జీవితం. భౌతిక జీవితం అంటే అర్థం ప్రతి ఒక్కరూ ఇంద్రియాల తృప్తి కోసం నిమగ్నమై ఉన్నారు, అది నాగరికత యొక్క అభివృద్దిగా తీసుకోబడుతుంది. అదే ఇంద్రియ తృప్తి భిన్నమైన రీతిలో, అదే నిషా, అదే మాంసం తినడం, అదే మైథునజీవితం; క్లబ్ కు వెళ్ళడము లేదా నగ్నముగా ఉండే క్లబ్ కు లేదా ఈ క్లబ్కు వెళ్ళడము. అందువల్ల ఈ సాధన ఒకే విధముగా ఉంది. Punaḥ punaś carvita-carvaṇānām ( SB 7.5.30) నమిలిన దానిని తిరిగి నమలడము ఇది భౌతిక జీవితం.
కాబట్టి సన్యాస ఆశ్రమము అంటే ఆపడము అని అర్థం; ఆపడము కాదు, కనీసం ఇంద్రియ తృప్తిని నియంత్రించడము. అది సన్యాస ఆశ్రమము సన్యాస ఆశ్రమములో లేకుండా మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళలేరు. ఉదాహరణకు, మీ చేయి ఉంది, మీరు మీ చేయిలో ఏదో కలిగి ఉన్నారు. అది మంచిది కాదు, మీరు ఏదైనా మంచిది కావాలనుకుంటే, మీరు దానిని వదిలి మరొక మెరుగైన దానిని తీసుకోవాలి. మీరు రెండింటిని ఉంచుకోలేరు. అది సాధ్యం కాదు. కాబట్టి, భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి మధ్య తేడా ఏమిటి? భౌతిక జీవితము అంటే ప్రతి దశలో, పూర్తిగా సమస్యలు. Padaṁ padaṁ yad vipadāṁ ( SB 10.14.58) కేవలం ప్రమాదకరమైనది. మనము కాడిలాక్ కారు లేదా మోటారు కారులో చాలా చక్కగా, సౌకర్యవంతంగా, ప్రయాణము చేస్తున్నాం, కానీ మనము ప్రమాదం మీద ప్రయాణము చేస్తున్నాం, అంతే. మనము నడుపుతున్నాము; ఏ సమయంలోనైనా ముఖ్యముగా మీ దేశంలో కారు ప్రమాదానికి గురికావచ్చు. ఏ క్షణములో నైనా. కావున నేను ఇంట్లోనే కూర్చోనా? ఇంట్లో కూడా చాలా ప్రమాదాలు ఉండవచ్చు. మనము ప్రమాదాలలో ఉన్నాము. మనము దీనిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాము. దీనిని నాగరికత అభివృద్ది అని పిలుస్తారు. జంతువులు, అవి ప్రకృతి రక్షణపై ఆధారపడతాయి. కానీ మనం మానవులం. మనము మన ఉన్నత చైతన్యాన్ని, అధిక బుద్ధిని ఉపయోగించుకుంటున్నాము- అదే విషయము రష్యా, ఒక ఆయుధం, అణుబాంబు అనే పిలువబడే దానిని తయారు చేస్తుంది కావున...
భక్తుడు: న్యూక్లియర్ ఆయుధములు.
ప్రభుపాద: న్యూక్లియర్, అవును. అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. పిల్లి కుక్క, అవి వాటి గోర్లు మరియు పళ్ళు ద్వారా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి వాస్తవమైన ప్రశ్న రక్షణ. కాబట్టి రక్షణ ఉంది... అది మనం మంచి జీవితం పొంది ఉన్నాము అని కాదు పిల్లులు మరియు కుక్కలకు మన వలె రక్షించుకోవలసిన అవసరము లేదు. మనము కాపాడుకోవాలి. ఇది... కానీ మైరుగైన మార్గములో. ఇది మైరుగైన మార్గము కాదు, ఏమైనప్పటికీ మనం చనిపోవాలి. కాబట్టి ఏమైనప్పటికీ, అది మంచి రక్షణ మార్గమని మనము భావిస్తున్నాము