TE/Prabhupada 0866 - ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులుఅన్ని, అంతా



750520 - Morning Walk - Melbourne


ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులు అన్ని, అంతా

హరి-సౌరి: శ్రీల ప్రభుపాద, మానవ రూపం దేవతల కంటే అల్పము అయితే , అయినప్పటికీ, ఇది ఎంతగానో ఆశించబడుతుంది, ఈ మానవ రూపం, దేవతలచే కూడా?

ప్రభుపాద: అవును, మానవ రూపంలో భగవంతుణ్ణి తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది. ఉదాహరణకు పాశ్చాత్య దేశాలు భారతదేశం మధ్య ఉన్న తేడా. భారతదేశములో, భగవంతుని అర్థం చేసుకోవడానికి అవకాశం చాలా త్వరగా ఉంటుంది. వాతావరణం చాలా బాగుంది. అందువల్ల ఈ లోకము భగవంతుని సాక్షాత్కారము కొరకు మంచిది, భారతదేశం ఉత్తమమైన ప్రదేశం.

హరి-సౌరి:మన దేవాలయాలు, అవి అదే వాతావరణం కలిగి ఉంటాయి అని భావిస్తారు?

ప్రభుపాద:అవును.

హరి-సౌరి: భారతదేశంలో పవిత్ర స్థలాల వలె శక్తివంతమైన వాటి వలె ఉండాలా?

ప్రభుపాద:, అవును. మీరు ఈ లోకము లోపల ఎక్కడైనా మీరు ఆ శక్తిని సృష్టించవచ్చు. భక్తుడు: శ్రీలప్రభుపాద, వర్షాలు, వర్షాల వలన అన్ని మంచి విషయములు వస్తాయి అని చెప్తున్నారు, మంచి యజ్ఞం కారణంగా వర్షాలు వస్తాయి. కాబట్టి ఈ లోకము లో అందరూ మాంసం తినే వారు, లేదా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ పాపములు చేసేవారు.

ప్రభుపాద: అందువల్ల ఇది తగ్గుతోంది. మీరు ఎంత పాపత్ములు అయితే , అంత వర్షం తగ్గుతుంది.

భక్తుడు: ఇప్పుడు అది తగ్గుతోంది.

ప్రభుపాద: అవును. చివరిలో ఏ వర్షం ఉండదు. ఈ మొత్తం ప్రపంచము అగ్నితో మండుతుంది. అది విధ్వంసం ప్రారంభం. అందరూ చనిపోతారు- చెట్లు, మొక్కలు, జంతువులు అన్ని, ప్రతిదీ. అది అగ్నిచే బూడిదగా తయారవుతుంది. ఆపై వర్షం ఉంటుంది, బూడిద కరుగుతుంది, మొత్తం విశ్వం నాశనము అవుతుంది.

భక్తుడు : నేను కూడా చదివాను, శ్రీల ప్రభుపాద, మహారాజు యుధిష్టర కాలంలో, రాత్రిపూట మాత్రమే వర్షపాతం నమోదైంది. ఇది నిజామా?

ప్రభుపాద: రాత్రివేళ?

భక్తుడు : రాత్రి వేళలో వర్షం పడేది, అందుచే...

ప్రభుపాద: లేదు ఎవరు చెప్పారు రాత్రి అని?

శృతికారి: ఇది కృష్ణ పుస్తకంలో పేర్కొన బడినది సాయంత్రం వర్షం పడుతుందని.

భక్తుడు : పగటిపూట ప్రజల కార్యక్రమాలను భంగపరచకుండా. ప్రభుపాద: అవును, అది మార్గం. రాత్రి సమయంలో అది వర్షాలు పడి పగటిపూట సూర్యరశ్మి ఉంటే, అప్పుడు భూమి ఉత్పత్తి చేయడానికి చాలా సారవంతమవుతుంది. అవును. బెంగాల్ లో సాధారణ సామెత ఉంది, dine jal rātre tārā sei janme sukha dhārā(?). పగటి సమయములో వర్షాలు పడతాయి రాత్రి పూట మీరు నక్షత్రాలను చూస్తారు, అప్పుడు వర్షపు కొరత ఉంటుందని మీరు తెలుసుకోవాలి. వర్షాల కొరత మరియు ఆహార ధాన్యాల కొరత ఉంటుంది. ఉత్తమ విషయము రాత్రి పూట భారీ వర్షం ఉండాలి, పగటి పూట సూర్యరశ్మి ఉండాలి.