TE/Prabhupada 0872 - మానవ సమాజం నాలుగు విభాగాలుగా విభజించబడాలి అనేది చాలా అవసరం



750519 - Lecture SB - Melbourne


మానవ సమాజం నాలుగు విభాగాలుగా విభజించబడాలి అనేది చాలా అవసరం కాబట్టి ప్రస్తుత క్షణం లో, ఆచరణాత్మకంగా బ్రాహ్మణుడు లేడు, క్షత్రియుడు లేడు , వైశ్యులు లేరు, కేవలం శూద్రులు మాత్రమే, నాలుగో తరగతి వ్యక్తులు. మీరు నాల్గవ తరగతి వ్యక్తుల ద్వారా మార్గనిర్దేశం పొందితే ఏ ఆనందం ఆశించలేము. అది సాధ్యం కాదు. అందువలన మొత్తం ప్రపంచవ్యాప్తంగా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. ఎవరూ సంతోషంగా లేరు. కాబట్టి మానవ సమాజం నాలుగు విభాగాలుగా విభజించబడాలి అనేది చాలా అవసరం బ్రాహ్మణ తరగతి అంటే మొదటి తరగతి ఆదర్శ వ్యక్తులు, కాబట్టి వారి పాత్ర, వారి ప్రవర్తన చూసినప్పుడు, ఇతరులు అనుసరించడానికి ప్రయత్నిస్తారు. Yad yad ācarati śreṣṭhaḥ ( BG 3.21) కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే మనం కొందరు మొదటి -తరగతి వ్యక్తులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది కృష్ణ చైతన్యము, ఈ ఉద్యమం. కాబట్టి మనము ఈ నియమాలు నిబంధనలను కలిగి ఉన్నాము అక్రమ లైంగిక సంబంధం వుండరాదు, మాంసం తినరాదు, మత్తు తీసుకోరాదు, జూదం ఆడరాదు. ఇది మొదటి-తరగతి వ్యక్తుల యొక్క ప్రాథమిక అర్హత. కాబట్టి కొందరు వ్యక్తులను ఆదర్శవంతమైన మొదటి -తరగతి వ్యక్తులుగా చేయటానికి మనం రవ్వంత ప్రయత్నిస్తున్నాము. కానీ గతంలో అది ఉంది. చాతుర్...

ఇప్పటికీ ఉంది. అందరు వ్యక్తులు అదే బుద్ధి లేదా అదే వర్గం అని మీరు భావించకండి. కాదు. ఇప్పటికీ తెలివైన తరగతి వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకు వారు శాస్త్రవేత్తలు లేదా తత్వవేత్తలు, మతాధికారులు, వారు మొదటి తరగతి వ్యక్తులమని భావిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు, ఎవరు మొదటి తరగతి మరియు చివరి తరగతి అనేది ఇప్పుడు ఎవరూ గుర్తించలేరు. కాబట్టి మొత్తం సమాజం యొక్క సరైన నిర్వహణ కోసం మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి వ్యక్తులు తప్పనిసరిగా అక్కడ ఉండాలి. ఉదాహరణకు మీ శరీరం లో శరీరం యొక్క వివిధ భాగాలు ఉన్నాయి : తల, చేయి, బొడ్డు కాలు. ఇది సహజమైనది. కాబట్టి తల లేకుండా, మనము కేవలం చేతులు బొడ్డు కాళ్ళు కలిగి ఉంటే, ఇది ఒక మృతదేహం. కాబట్టి మీరు మార్గనిర్దేశం పొందకపోతే, మానవ సమాజం, మొదటి తరగతి వ్యక్తుల ద్వారా, మొత్తం సమాజం చనిపోయిన సమాజం. Cātur-varṇyaṁ mayā sṛṣṭha guṇa-karma ... ( BG 4.13) ప్రకారం తప్పనిసరిగా విభజన ఉండాలి. జన్మ ద్వారా కాదు , కానీ లక్షణముల ద్వారా. కాబట్టి ఎవరైనా అతని ఇష్ట ప్రకారం మొదటి తరగతి, రెండవ తరగతి వ్యక్తిగా శిక్షణ పొందవచ్చు. దానిని నాగరికత అంటారు.

కొందరు వ్యక్తులను మొదటి -తరగతి వ్యక్తులుగా వలె శిక్షణ ఇవ్వాలి కొందరు వ్యక్తులను రెండవ తరగతి వ్యక్తులుగా శిక్షణ ఇవ్వాలి, కొందరు వ్యక్తులను మూడవ తరగతి వ్యక్తులుగా శిక్షణ ఇవ్వాలి, సమతౌల్యం, ఎవరు శిక్షణ పొందలేరో, వారు ఇతర మూడు ఉన్నత తరగతి వారికి సహాయం చేయవచ్చు. దానిని శూద్ర అని పిలుస్తారు.... (బ్రేక్)...

అది సాధ్యం కాదు. ఒక మనిషి, ఆయన సరిగ్గా శిక్షణ పొందినట్లయితే, ఆయన ఉపదేశము తీసుకొనుటకు ఇష్టపడితే, ఆయనను మొదటి తరగతి గా తయారు చేయవచ్చు. పర్వాలేదు. జన్మ ద్వారా ఒకరు తక్కువ తరగతి లో జన్మించి ఉండవచ్చు, అది పట్టింపు లేదు. కానీ శిక్షణ ద్వారా, ఆయన మొదటి తరగతి వ్యక్తి కావచ్చు. ఇది భగవద్గీత యొక్క ఉత్తర్వు.

māṁ hi pārtha vyapāśritya
ye 'pi syuḥ pāpa-yonayaḥ
striyaḥ śūdrāḥ tathā vaiśyā
te 'pi yānti parāṁ gatim
(BG 9.32)

Parāṁ gatim. Parāṁ gatim అంటే ఇంటికి తిరిగి వెళ్లుట భగవత్ ధామమునకు తిరిగి వెళ్లుట అది మన వాస్తవమైన ఇల్లు, ఆధ్యాత్మిక ప్రపంచం- అక్కడ శాశ్వతంగా, ఆనందంగా, పూర్ణ జ్ఞానంతో నివసించండి. ఇది మన వాస్తవమైన పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం భౌతిక ఆనందం కోసం ఈ భౌతిక ప్రపంచం లోకి వచ్చాము. అంతేకాక మనం ఆనందం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాం, మనం చిక్కుకుపోతున్నాం. అది మనకు తెలియదు. వారు భౌతిక ఇంద్రియ అనుభవము జీవితం యొక్క లక్ష్యం అని ఆలోచిస్తున్నారు. లేదు, అది జీవిత లక్ష్యం కాదు. అది ఇంకా ఇంకా చిక్కుకుపోవడానికి మార్గం