TE/Prabhupada 0885 - ఆధ్యాత్మిక ఆనందానికి ముగింపు లేదు.అది పెరుగుతూ ఉంటుంది



730413 - Lecture SB 01.08.21 - New York


ఆధ్యాత్మిక ఆనందానికి ముగింపు లేదు.అది పెరుగుతూ ఉంటుంది. ఎవరో ఒక భాగ్యశాలి యైన జీవి మాత్రమే కృష్ణుని మరియు కృష్ణ భక్తుల సాంగత్యాన్ని పొందే ఈ అవకాశాన్ని పొందుతాడు. అప్పుడు అతని జీవితం అద్భుతంగా మారుతుంది.

ei rūpe brahmāṇḍa bhramite kona bhāgyavān jīva
guru-kṛṣṇa-kṛpāya pāya bhakti-latā-bīja

( CC Madhya 19.151)

ఈ భక్తి-లతా-బీజం, భక్తియుక్త సేవ అనబడే విత్తనం, హరే కృష్ణ మంత్రాన్ని జపించడం.

కాబట్టి కుంతీదేవి ఇలా తెలుపుతున్నారు "అలక్ష్య, అగోచరుడు, అటువంటి వ్యక్తి ఎవరో తెలుపుతున్నారు?" అతనే, కృష్ణుడు. కృష్ణుడు? చాలా మంది కృష్ణులు ఉన్నారు. వాసుదేవాయ, వసుదేవుని కుమారుడు. చాలా మంది వాసుదేవులు ఉన్నారు. కాదు, nanda-gopaya, nandanāya ( SB 1.8.21) నందమహారాజు యొక్క పెంపుడు కుమారుడు. మూడు సార్లు ఆమె తెలుపుతోంది: "కృష్ణుడు ఇతను అని." కృష్ణుడు దేవకి వసుదేవుల కుమారుడిగా ప్రామాణికంగా తన జననాన్ని తీసుకుంటాడు, కానీ ఆయన చిన్నతనంలో యశోదమాత మరియు నంద మహారాజుల యొక్క సాన్నిధ్యంలో ఆనందిస్తాడు. ఇవి కృష్ణ లీలలు.

కాబట్టి అనంద-లీలామయ-విగ్రహాయ. అనంద-లీల, కృష్ణలీలలు, ఆ లీలలన్నీ ఆనందకరమైనవి. ఆనంద-లీలామయ. Ānandamayo 'bhyāsāt (Vedānta-sūtra 1.1.12). ఆయన స్వభావతా ఆనందమయుడు. కృష్ణుడు, మీరు విచారవదనంతో వున్న కృష్ణున్ని ఎప్పుడూ చూడలేరు. కృష్ణుడు ఎప్పుడూ విచారంగా వుండడు. కృష్ణుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. కాబట్టి nanda-gopa-kumārāya govindāya ( SB 1.8.21) ఆయన సంతోషంగా ఉన్నాడు, ఎవరైతే ఆయనతో అనుబంధము కలిగి ఉంటారో వారు కూడా సంతోషంగా ఉంటారు. గోవిందాయ. మనము ఇంద్రియాలను తృప్తి పరుచుకోవడానికి చూస్తుంటాం. గో అంటే ఇంద్రియాలు. మీరు కృష్ణుడితో అనుబంధం కలిగివుంటే, మీ ఇంద్రియాలను దివ్యంగా ఆనందించగలరు. ఎలాగంటే గోపికలు కృష్ణుడితో నృత్యం చేస్తున్నట్లుగా. అందులో ఇంద్రియ తృప్తికి కొదవ లేదు. కానీ అది ఇలాంటి స్థూల ఇంద్రియ తృప్తికి సంబంధించిన ఇంద్రియ భోగము కాదు, అది ఆధ్యాత్మిక ఇంద్రియానుభవము. అది ఆధ్యాత్మిక ఇంద్రియభోగము. Ānanda-cinmaya-sad-ujjvala-vigrahasya (BS 5.32). మనము ప్రతి రోజు ఆలాపిస్తాము. ఆ ఇంద్రియానుభవము, ఆధ్యాత్మిక ప్రపంచంలో మీరు పొందేది, ఆనంద చిన్మయము. అది ఈ భౌతిక ఇంద్రియాలచే పొందబడే తుఛ్ఛమైన ఆనందం లాంటిది కాదు. ఇది ఆనందం కాదు. ఇది ఒక భ్రమ. ఇది భ్రాంతి. మనము "నేను ఆనందిస్తున్నాను" అని అనుకుంటున్నాము. కానీ అది ఆనందం కాదు. ఈ ఆనందం అసలైనది కాదు, ఎందుకనగా ఈ భౌతిక ఇంద్రియ సుఖాన్ని మనం సుదీర్ఘకాలం ఆనందించలేము. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవంలోని విషయమే. అది ముగుస్తుంది. దానికి అంతం వుంది. కానీ ఆధ్యాత్మిక ఆనందానికి అంతం లేదు. అది పెరుగుతూ వుంటుంది. అదే తేడా. Ānanda-cinmaya-sad-ujjvala-vigrahasya govindam ādi-puruṣam (BS 5.32).

కాబట్టి మీరు గోవిందునితో అనుబంధాన్ని కలిగివుండాలి. ఇక్కడ కూడా, గోవిందాయ నమో నమః అని చెప్పబడింది: గోవిందునికి నా గౌరవప్రదమైన ప్రణామములు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమము చాలా రమ్యమైనది, మీరు నేరుగా గోవిందునితో సంబంధంలో ఉంటారు. ఈ అర్చామూర్తి ఆరాధన కూడా గోవిందునితో నేరుగా సంబంధం కలిగి ఉంది. Śrī-vigrahārādhana-nitya-nānā-śṛṅgāra-tan-mandira-mārjanādau. ఈ విగ్రహం, కృష్ణుడి యొక్క అర్చామూర్తి, ఇది కూడా కృష్ణుడి యొక్క కృప. ఎందుకనగా కృష్ణుడు అలక్ష్య, అగోచరుడు, మీ సౌలభ్యం కోసం మీరు దర్శించేందుకు అనుగుణంగా, ఆయన మీకు కనిపిస్తున్నాడు. అయినప్పటికీ... కృష్ణుడు రాయి అని లేదా కృష్ణుడు కలప అని, లేదా కృష్ణుడు లోహం అని కాదు. కృష్ణుడు ఎప్పుడూ కృష్ణుడే. కానీ అలా ఆయన అవతరిస్తారు ... ఎందుకంటే మీరు చెక్క, రాయి, లోహాలను తప్ప ఇతరాన్ని చూడలేరు కాబట్టి, ఆయన ఆ చెక్క, రాయి లేదా లోహం వలె దర్శనమిస్తాడు. కానీ ఆయన చెక్క, రాయి లేదా లోహం కాదు. మీరు అచ్చం కృష్ణుని సాంగత్యాన్ని పొందిన సౌలభ్యాన్నే పొందుతారు, మీరు కృష్ణుడితో అనుబంధము ఏర్పర్చుకుంటే, అనుబంధము ఏర్పర్చుకుంటే కానీ ప్రస్తుతానికి, కృష్ణుడు కనిపించని కారణంగా, అందువలన అతను చాలా దయతో మీరు కనిపించే ఒక రూపం తీసుకున్నారు. ఇది కృష్ణుని యొక్క దయ. ఇలా అనుకోవద్దు, "ఓ, ఇక్కడ కృష్ణుడు వున్నాడు, రాతి కృష్ణుడు." కృష్ణుడు సర్వము నందు కలడు. కృష్ణుడు ప్రతిదీ, కాబట్టి కృష్ణుడు రాతి కూడా. కృష్ణుడు రాయి కూడా, కానీ అతను ఎటువంటి ప్రతి స్పందన లేని రాయి కాదు. కృష్ణుడు రాయి రూపంలో కూడా వర్తించగలడు. కృష్ణుడు లోహ రూపంలో కూడా వర్తించగలడు. మరియు మీరు దాన్ని గ్రహించగలరు. Svayam eva sphuraty adaḥ. మీరు ఎంతగా సేవిస్తే, అందుకు తగ్గట్టు అంతగా ఆ విగ్రహం మీతో ప్రతిస్పందిస్తుంది. ఇందుకు చాలా నిదర్శనాలు వున్నాయి