TE/Prabhupada 0893 - ఇది అందరి అంతర్గత ఉద్దేశం. ఎవరూ పని చేయాలని కోరుకోవటం లేదు
730417 - Lecture SB 01.08.25 - Los Angeles
ఇది అందరి అంతర్గత ఉద్దేశం. ఎవరూ పని చేయాలని కోరుకోవటం లేదు. భక్తుడు: అనువాదం: "నేను సకల విపత్తులు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను తద్వారా మేము మిమ్మలను మళ్ళీ మళ్ళీ చూడగలము, మిమ్మల్ని చూడటం అంటే, మేము పునరావృతమవుతున్న జనన మరణాలను ఎంతమాత్రమూ చూడబోము. "
ప్రభుపాద:కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన శ్లోకము, విపదం, విపత్తులు, ప్రమాదం, అలాంటి ప్రమాదం మరియు విపత్తులు నాకు కృష్ణుడిని గుర్తు చేస్తే అవి చాలా మంచివి. అది చాలా మంచిది. Tat te 'nukampāṁ su-samīkṣamāṇo bhuñjāna evātma-kṛtaṁ vipākam ( SB 10.14.8) ఒక భక్తుడు, ఆయన విపత్కర పరిస్థితిని ఎలా స్వీకరిస్తాడు? విపత్తులు తప్పక వాటిల్లుతాయి. విపత్తు ... ఎందుకంటే ఈ ప్రదేశము, ఈ భౌతిక ప్రపంచం అనేక విపత్తులచే నిండివుంది. ఈ మూర్ఖులు, వారికి తెలియదు. వారు ప్రమాదాలను నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే జీవన పోరాటం. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి మరియు ప్రమాదాలను నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే భౌతిక జగత్తు యందలి ముఖ్య కార్యము. Ātyantika-sukham. Ātyantika-sukham. అత్యున్నత సుఖము. ఒక మనిషి పని చేస్తూ, ఆలోచిస్తున్నాడు: "ప్రస్తుతం నేను చాలా కష్టపడి పని చేస్తాను, మరియు నేను కొంత బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉంటాను అలాచేసినట్లయితే నాకు వృదాప్యం వచ్చినప్పుడు నేను ఏ పని చేయకుండా జీవితాన్ని ఆనందిస్తాను." ఇది అందరి అంతర్గత ఉద్దేశం. ఎవరూ పని చేయాలని కోరుకోవటం లేదు. ఎప్పుడైతే ఆయన కొంత డబ్బు సంపాదించిన వెంటనే తన పని నుండి విరమణ పొందాలని అనుకుంటాడు,మరియు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అది సాధ్యం కాదు. మీరు ఆ విధముగా సంతోషంగా ఉండలేరు.
ఇక్కడ చెప్పబడింది: apunar bhava-darśanam ( SB 1.8.25) వాస్తవమైన ప్రమాదం ఏమంటే ... ఆమె చెబుతోంది apunaḥ. అపునః అంటే ... అ అంటే లేదు, పునర్ భవః అంటే జనన మరణ చక్రము అని అర్థం. వాస్తవమైన ప్రమాదం జనన మరణచక్రములో చిక్కుకోవడం.అది ఆపివేయబడాలి. మరియు పేరుకు ప్రమాదాలు అనబడే ఇవి కావు. ఇవన్నీ ... భౌతిక ప్రపంచం ప్రమాదాలతో నిండి ఉంది. Padaṁ padaṁ yad vipadām ( SB 10.14.58) ఎలాగంటే మీరు సముద్రంలో ఉన్నట్లయితే. మీరు సముద్రంలో ఉంటే, మీరు చాలా బలమైన ఓడను కలిగి ఉండవచ్చు, చాలా సురక్షితమైన ఓడ, కానీ అది సురక్షితం కాదు. ఎందుకంటే మీరు సముద్రంలో ఉన్నందున, ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించవచ్చు. బహుశా మీకు గుర్తుండవచ్చు, మీ దేశానికి చెందిన,ఏమిటది, టైటానిక్?
భక్తుడు: టైటానిక్.
ప్రభుపాద: అంతా సురక్షితంగా ఉంది, కానీ మొదటి సముద్రయానంలో అది మునిగిపోయింది, మరియు మీ దేశంలోని ప్రముఖ వ్యక్తులు, వారు తమ ప్రాణాలను కోల్పోయారు. మీరు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నందున ప్రమాదం తప్పక సంభవించవచ్చు. అసలు ఈ భౌతిక ప్రపంచమే ప్రమాదాలకు నిలయం. కాబట్టి మన కర్తవ్యము ఏమంటే ... ఆ ప్రమాదం తప్పక సంభవించవచ్చు. ప్రస్తుతం మన కార్యము వీలైనంత త్వరగా సముద్రాన్ని దాటడం. ఎంతవరకైతే మీరు సముద్రంలో ఉంటారో, అంతవరకు మీరు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లు, మీరు ఎంత బలమైన ఓడనైనా కలిగివుండవచ్చు. అది వాస్తవము. కాబట్టి మీరు సముద్రపు తరంగాలచే కలత చెందకూడదు. కేవలము సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించండి.ఆవలి వైపుకు వెళ్ళండి. అది మీ కర్తవ్యము. అదేవిధముగా, ఎంతవరకైతే మనం ఈ భౌతిక ప్రపంచంలో వుంటామో,అంతవరకు ప్రమాదకరమైన విపత్తులు వుంటాయి. ఎందుకంటే ఇది విపత్తులకు నిలయం. కాబట్టి మన కర్తవ్యము, ఈ విపత్తులలో కూడా, ప్రమాదాలలో కూడా, ఎలా మనము మన కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకొని, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, మన స్వధామానికి,కృష్ణుని వద్దకు తిరిగి వెళ్లడం. అది మన కర్తవ్యం అయి ఉండాలి. పేరుకు విపత్తులు అని పిలవబడేవాటి వలన మనం కలవరపడకూడదు. అవి పేరుకు పిలవబడడంలేదు; అవి వాస్తవమైనవే.