TE/Prabhupada 0904 - మీరు భగవంతుని ఆస్తిని దొంగలించారు



730418 - Lecture SB 01.08.26 - Los Angeles


మీరు భగవంతుని ఆస్తిని దొంగలించారు కుంతీ చెప్తుంది ఈ మత్తు స్థితి, madaḥ, edhamāna-madaḥ ( SB 1.8.26) పెరుగుతుంది, పుమాన్, అటు వంటి వ్యక్తులు, naivārhati, వారు ఆనందముగా చెప్పలేరు: జయ రాధామాధవ. వారు ఇష్టముగా అనలేరు. అది సాధ్యం కాదు. వారి భావన, ఆధ్యాత్మిక భావన, నష్ట పోయినది. వారు ఇష్ట పూర్వకముగా చెప్పలేరు, ఎందుకంటే వారు తెలుసుకోలేరు. ఓ, ఈ భగవంతుడు పేదవాని కోసం. వారికి తగినంత ఆహారం ఉండదు. వారిని చర్చికి వెళ్లి, ఓ, ప్రభు, మా రోజువారీ రొట్టెను ఇవ్వండి.' మాకు తగినంత రొట్టె ఉంది. నేను చర్చికి ఎందుకు వెళ్ళాలి? "ఇది వారి అభిప్రాయం. కాబట్టి ఈ రోజుల్లో, ఆర్థిక అభివృద్ధి ఉన్న రోజుల్లో, ఎవరికి చర్చికి లేదా ఆలయమునకు వెళ్ళడానికి ఆసక్తి లేదు. ఈ అర్థంలేనిది ఏమిటి? రొట్టెని అడిగేందుకు నేను ఎందుకు చర్చికి వెళ్ళాలి? మనము ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేశాము మరియు తగినంత రొట్టె సరఫరా ఉంటుంది. "

ఉదాహరణకు కమ్యూనిస్టు దేశం లాగానే, వారు అలా చేస్తారు. కమ్యూనిస్ట్ దేశం, వారు గ్రామాలలో ప్రచారం చేస్తారు. ప్రజలను చర్చికి వెళ్లి రొట్టెను అడగమని అడుగుతారు. వారు, అమాయక ప్రజలు, వారు సాధారణముగా అడుగుతారు: "ఓ, ప్రభు, మాకు మా రోజువారీ రొట్టెను ఇవ్వండి." అప్పుడు వారు చర్చి నుండి బయటకు వచ్చినప్పుడు, ఈ కమ్యునిస్ట్ ప్రజలు ఇలా అడుగుతారు: "మీకు రొట్టె దొరికిందా?" వారు అంటున్నారు: "అయ్యా లేదు." "అయితే, మమ్మల్ని అడగండి." ఆపై వారు ఇలా అడుగుతారు: "ఓ కమ్యూనిస్ట్ స్నేహితుడా, నాకు రొట్టె ను ఇవ్వండి." (నవ్వు) కమ్యునిస్ట్ స్నేహితుడు రొట్టె యొక్క ఒక ట్రక్ లోడ్ ను తీసుకు వస్తాడు "మీకు నచ్చినంతగా తీసుకోండి, తీసుకోండి. ఎవరు మంచి వారు? మేము మంచివారమా లేదా మీ భగవంతుడు మంచి వాడా? " వారు అంటారు: "కాదు, అయ్యా , మీరు మంచివారు."ఎందుకంటే వారికి ఎటువంటి బుద్ధి లేదు. వారు ఇలా ప్రశ్నిoచరు: "మూర్ఖుడా, నీవు ఈ రొట్టె ఎక్కడ నుండి తీసికొని వచ్చావు? (నవ్వు) మీరు మీ కర్మాగారంలో తయారు చేసారా? మీరు మీ కర్మాగారంలో గింజలు, రొట్టె పదార్థాలు తయారు చేయగలరా? ". ఎందుకంటే వారికి ఎటువంటి బుద్ధి లేదు.

శూద్ర, వారిని శూద్ర అని పిలుస్తారు. శూద్ర అంటే అర్థం బుద్ధి లేని వారు. వారు తీసుకుంటారు, దానిని యధాతధముగా. కానీ ఎవరైతే బ్రాహ్మణుడో, బుద్ధిలో ఉన్నత స్థానములో ఉన్నరో, ఆయన వెంటనే విచారణ చేస్తాడు: మూర్ఖుడా, నీవు ఈ రొట్టెను ఎక్కడ నుండి తీసుకున్నావు? అది బ్రాహ్మణుని యొక్క ప్రశ్న. మీరు రొట్టెని తయారు చేయలేరు. మీరు కేవలం భగవంతుని ధాన్యమును రూపాంతరం చేసినారు... ధాన్యం, గోధుమ భగవంతుని ద్వారా ఇవ్వబడుతుంది, మీరు కేవలం మార్చారు. కానీ దేని నుండో దేనినో పరివర్తించినంత మాత్రమున, అది మీ ఆస్తి కాదు.

ఉదాహరణకు నేను ఎవరైనా ఒక వడ్రంగికి కొంత చెక్కను, కొన్ని పనిముట్లను, జీతం ఇస్తాను. ఆయన ఒక మంచి, అందమైన అలమర తయారు చేస్తాడు. ఈ అలమర ఎవరికి చెందుతుంది? వడ్రంగికా, లేదా పదార్థాలు సరఫరా చేసిన వ్యక్తికా ? ఇది ఎవరికి చెందుతుంది? వడ్రంగి చెప్పలేడు: "నేను ఈ చెక్కని మంచి అలమర మార్చాను కనుక, అది నాది." కాదు. ఇది నీది కాదు. అదేవిధముగా, ఎవరు పదార్థములను సరఫరా చేస్తున్నారు, మూర్ఖుడా? అది కృష్ణుడు. కృష్ణుడు చెపుతాడు: bhūmir āpo 'nalo vāyuḥ khaṁ mano buddhir eva prakṛtir me aṣṭadhā... ( BG 7.4) ఇది నా ఆస్తి. మీరు ఈ సముద్రం, భూమి, ఆకాశం, అగ్ని, గాలి సృష్టించలేరు ఇది మీ సృష్టి కాదు. మీరు ఈ వస్తువులను రూపాంతరము చేయవచ్చు, tejo-vāri-mṛdāṁ vinimayaḥ, కలపడం మరియు పరివర్తించడం ద్వారా. భూమి నుండి మట్టిని తీసుకొని, నీవు సముద్రం నుండి నీటిని తీసుకొని, దాన్ని కలిపి దానిని అగ్నిలో ఉంచండి. ఇది ఒక ఇటుక అవుతుంది. ఆపై మీరు అన్నిటిని ఒక దాని పై ఒకటి పెట్టి ఒక ఆకాశహర్మ్యం భవనం తయారు చేయండి. కానీ మీరు ఈ ఆకాశహర్మ్యం మీది అని చెప్తున్నారు, మీరు ఈ పదార్థములను ఎక్కడ నుండి పొందారు, మూర్ఖుడా? ఇది తెలివైన ప్రశ్న. మీరు భగవంతుని ఆస్తిని దొంగిలించారు, ఇది మీ ఆస్తి అని మీరు చెప్తారు. ఇది జ్ఞానం. ఇది జ్ఞానం