TE/Prabhupada 0906 - మీరు సున్నాలను కలిగి ఉన్నారు. కృష్ణుడిని ఉంచుకోండి. మీరు పది అవుతారు



730418 - Lecture SB 01.08.26 - Los Angeles


మీరు సున్నాను కలిగి ఉన్నారు. కృష్ణుడిని ఉంచుకోండి. మీరు పది అవుతారు ప్రభుపాద: రాష్ట్రంలో వలె, ఒక మనిషి వీధిలో పడి ఉన్నందున, పేదవాడు, ఎటువంటి సహాయము లేదు? నేను అతన్ని చంపనా? ప్రభుత్వము నన్ను క్షమిస్తుందా? కాదు. ఒక పేదవాడిని నేను చంపాను. ఆయన అవసరం లేదు. సమాజానికి ఆయన అవసరం లేదు. మరి ఆయన ఎందుకు బ్రతకాలి? " ప్రభుత్వము నన్ను క్షమిస్తుందా: "మీరు చాలా మంచి పని చేసారు."? లేదు, ఆ పేదవాడు కూడా ముఖ్యమైనవాడు, లేదా రాష్ట్ర పౌరుడు. మీరు చంపలేరు. ఎందుకు ఈ తత్వమును విస్తరించకూడదు, నిస్సహాయమైన జంతువు, చెట్లు, పక్షులు, జంతువులు, అవి కూడా భగవంతుని కుమారులుగా ఉన్నారు. మీరు చంపలేరు. మీరు బాధ్యత వహించవలసి ఉంది. మిమ్మల్ని ఉరి తీస్తారు. ఉదాహరణకు వీధిలో ఒక పేదవానిని చంపడం ద్వారా ఎట్లాగైతే మిమ్మల్ని ఉరి తీస్తారో. ఇది నిస్సహాయమైనది అయినప్పటికీ. అదేవిధముగా భగవంతుని దృష్టిలో, అలాంటి వివక్ష ఉండదు. భగవంతుని గురించి ఏమి మాట్లాడతాము, జ్ఞానవంతులైన మానవుని దృష్టిలో కూడా, అలాంటి వివక్ష లేదు, ఇతను పేదవాడు, ఇతను ధనికుడు, ఇది నలుపు, ఇది తెలుపు, ఇది... కాదు. ప్రతి ఒక్కరూ జీవులు, భాగము మరియు అంశ.

అందువల్ల అన్ని జీవులకు వైష్ణవుడు మాత్రమే లాభదాయకం. వారు పవిత్రము చేయడానికి ప్రయత్నిస్తారు. అన్ని జీవులను కృష్ణ చైతన్య స్థితికి తీసుకురావడానికి ఒక వైష్ణవుడు ప్రయత్నిస్తాడు. Lokānāṁ hita-kāriṇau. ఉదాహరణకు రూప గోస్వామి వలె, గోస్వాములు. Lokānāṁ hita-kāriṇau tri-bhuvane mānyau śaraṇyākarau. ఇతను ఒక భారతీయుడు, ఇతను అమెరికన్ అనే అభిప్రాయాన్ని వైష్ణవుడు కలిగిలేడు, ఇది... కొంత మంది ఎక్కడో నన్ను ప్రశ్నించారు: "ఎందుకు మీరు అమెరికాకు వచ్చారు?" నేను ఎందుకు రాకూడదు? నేను భగవంతుని సేవకుడను, ఇది భగవంతుని రాజ్యం. నేను ఎందుకు రాకూడదు? నన్ను ఆపడము కృత్రిమంగా ఉంటుంది. మీరు నన్ను ఆపితే, అప్పుడు మీరు పాపములను చేస్తారు. ఉదాహరణకు ప్రభుత్వ సేవకుని వలె, పోలీసులు, ఎవరి ఇంటిలోకైనా ప్రవేశించడానికి హక్కును కలిగి ఉంటారు. ఏ నేరము లేదు. అదేవిధముగా భగవంతుని సేవకుడు ఎక్కడైనా వెళ్ళడానికి హక్కును కలిగి ఉన్నాడు. ఎవరూ అపలేరు. ఆయనను ఆపితే, ఆయన శిక్షించబడతాడు. ఎందుకంటే ప్రతిదీ భగవంతునికి చెందుతుంది.

కాబట్టి ఈ విధముగా మనము విషయాలను యధాతథముగా చూడ వలసి ఉంటుంది. ఇది కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యము ఒక ఆచరించలేని ఆలోచన కాదు. అందువల్ల కుంతీ చెప్తుంది: janmaiśvarya-śruta-śrībhir edhamāna-madaḥ pumān ( SB 1.8.26) మత్తుపదార్థాలను సేవిస్తున్నవారు, అలాంటి వ్యక్తులు కృష్ణ చైతన్య వంతులు కారు. అలాంటి వ్యక్తులు కృష్ణ చైతన్య వంతులుగా మారలేరు. Edhamāna-madaḥ. ఎందుకంటే వారు తాగిన మత్తులో ఉన్నారు. ఉదాహరణకు మత్తులో ఉన్న వ్యక్తిలాగా, ఆయన ఇప్పుడు పూర్తిగా మత్తులో ఉన్నాడు చెత్తను మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఇలా అంటే: "నా ప్రియమైన సోదరా, మీరు చెత్తను మాట్లాడుతున్నారు. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ తల్లి ఉంది." దానిని ఎవరూ పట్టించుకుంటారు? ఆయన మత్తులో ఉన్నాడు. అదేవిధముగా, ఈ మూర్ఖులు అందరూ, మత్తులో ఉన్న మూర్ఖులు, మీరు చెప్తే "భగవంతుడు ఇక్కడ ఉన్నాడు" వారు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మత్తులో ఉన్నాడు. అందువల్ల కుంతీ చెప్తుంది:tvām akiñcana-gocaram. కాబట్టి, ఈ మత్తుపదార్థాల నుండి విముక్తి పొందటము ఇది మంచి యోగ్యత. Janmaiśvarya-śruta-śrī... ఉన్నతమైన జన్మ, మంచి ఐశ్వర్యము, ఉన్నతమైన విద్య, మంచి సౌందర్యం. వాటిని ఉపయోగించవచ్చు. అదే వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడు అయినప్పుడు... ఉదాహరణకు మీరు అమెరికన్ అబ్బాయిలు మరియు అమ్మాయిలు మీరు చేస్తున్నట్లుగానే. మీరు మత్తులో ఉండేవారు. కానీ నిషా ముగిసినప్పుడు, మీరు మెరుగైన సేవ చేస్తున్నారు, కృష్ణ చైతన్యమును. ఉదాహరణకు మీరు భారతదేశానికి వెళ్లినప్పుడు, వారు ఆశ్చర్యపోతున్నారు ఎలా ఈ అమెరికన్ అబ్బాయిలు మరియు అమ్మాయిలు భగవంతుని కొరకు పిచ్చి వారు అయినారు. ఎందుకంటే అది వారికి బోధిస్తోంది: "మీరు మూర్ఖులు. మీరు నేర్చుకోండి, పాశ్చాత్య దేశాల నుండి మీరు అనుకరిస్తారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాశ్చాత్య దేశాల బాలురు మరియు బాలికలు కృష్ణ చైతన్యములో నృత్యం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకరించండి. " ఇది నా విధానం.

కాబట్టి ఇది ఇప్పుడు ఫలవంతం చేయబడింది. అవును. కాబట్టి ప్రతిదీ ఉపయోగించవచ్చు. మంచి తల్లి తండ్రులు, మీరు ఉపయోగించినట్లయితే... మీరు మత్తులోనే ఉండేటట్లయితే, దాన్ని ఉపయోగించకండి, అది చాలా మంచి ఆస్తి కాదు. కానీ మీరు మంచి ప్రయోజనము కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. మీకు ఆస్తి ఉంటే... మీరు కృష్ణ చైతన్యము కొరకు మీ ఆస్తులను ఉపయోగిస్తే, అది మెరుగైన స్థితిగా ఉంటుంది. ఇదే ఉదాహరణ. ఉదాహరణకు సున్నా వలె. సున్నాకు విలువ లేదు. కానీ మీరు సున్నాకు ముందు ఒకటిని ఉంచిన వెంటనే, అది వెంటనే పది అవుతుంది. వెంటనే పది అవుతుంది. మరొక సున్నా, వంద అవుతుంది. మరొక సున్నా, వెయ్యి అవుతుంది. అదేవిధముగా ఈ janmaiśvarya-śruta-śrī. ఎంతకాలము మీరు మత్తులో ఉంటారో, అది అంతా సున్నాగా ఉంటుంది. కానీ మీరు కృష్ణుడిని ఉంచిన వెంటనే, అది పది,వంద, వేలు, లక్ష అవుతుంది.

భక్తులు: జయ, హరిబోల్ (నవ్వు)

ప్రభుపాద: అవును. అది అవకాశం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని పొందారు. మీరు అమెరికా అబ్బాయిలు మరియు అమ్మాయిలు, మీరు ఈ అవకాశాన్ని పొందారు. మీరు సున్నాను కలిగి ఉన్నారు. కృష్ణుడిని ఉంచండి. మీరు పది అవుతారు. (నవ్వు) అవును.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: హరిబోల్, జయ ప్రభుపాద. కీర్తి అంతా ప్రభుపాదల వారికి