TE/Prabhupada 0922 - మనము ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము: దయచేసి కీర్తన, కీర్తన చేయండి



730422 - Lecture SB 01.08.30 - Los Angeles


మనము ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము: దయచేసి కీర్తన, కీర్తన చేయండి ఒక దినపత్రికలో, ఒక వ్యంగ్య చిత్రం ఉంది. బహుశా మీకు గుర్తు ఉండవచ్చు. ఇక్కడ లేదా మాంట్రియల్ లో నాకు గుర్తు లేదు. ఒక వృద్ధ మహిళ ఆమె భర్త, ఎదురుగా ఎదురుగా కూర్చుని, . భార్య తన భర్తను అడుగుతోంది: "కీర్తన చేయండి, కీర్తన చేయండి, కీర్తన చేయండి." భర్త జవాబు ఇస్తున్నాడు: "సాధ్యం కాదు, సాధ్యం కాదు." (నవ్వు) కాబట్టి ఇది జరుగుతోంది. మనము అందరినీ అభ్యర్థిస్తున్నాము: "దయచేసి కీర్తన చేయండి, కీర్తన చేయండి, కీర్తన చేయండి ." వారు ప్రత్యుత్తరం ఇచ్చారు: "సాధ్యం కాదు, సాధ్యం కాదు." (నవ్వు) ఇది వారి దురదృష్టం. ఇది వారి దురదృష్టం.

కాబట్టి ఇప్పటికీ ఈ దురదృష్టకర, దురదృష్టకర జీవులను అదృష్టవంతులను చేయడము మన బాధ్యత. ఇది మన లక్ష్యం. అందువల్ల మనము వీధిలోకి వెళ్ళి కీర్తన చేస్తాము "చేయలేము అని ," వారు చెప్పినప్పటికీ మనము కీర్తన, జపము చేస్తుంటాము.మన కర్తవ్యము. ఎట్లగైతేనే, మనము ఆయన చేయిలో కొంత సాహిత్యమును ఉంచుతాము. ఆయన అదృష్టవంతుడు అవుతున్నాడు. ఆయన తను కష్టపడి సంపాదించిన డబ్బును చాలా దుష్ట, పాపాత్మకమైన మార్గాల్లో దుర్వినియోగం చేసేవాడు, ఆయన ఒక పుస్తకాన్ని కొనుగోలు చేస్తే, ధర ఏమైనా పట్టించుకోకపోతే, ఆయన డబ్బు సరిగ్గా ఉపయోగించబడుతుంది. కృష్ణ చైతన్యము ప్రారంభము అవుతుంది. ఎందుకంటే ఆయన కృష్ణ చైతన్యం ఉద్యమం కోసం కొంత డబ్బు, కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఇస్తున్నాడు, ఆయన కొంత ఆధ్యాత్మిక లాభం పొందుతున్నాడు. ఆయన నష్టపోవడము లేదు. ఆయన కొంత ఆధ్యాత్మిక లాభం పొందుతున్నాడు. అందువలన మన కర్తవ్యము, ఎట్లగైతేనే, ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలోకి ప్రతి ఒక్కరిని తీసుకు రావడము. ఆయన లాభము పొందుతాడు.

కాబట్టి ఈ పని మానవ సమాజంలో మాత్రమే జరగడము లేదు. కృష్ణుడి పథకం చాలా గొప్పది... కృష్ణుడు మానవుడిగా ఆవిర్భవించారు లేదా, కృష్ణుడు భగవంతునిగా, ప్రతి ఒక్కరికి ఆయన భగవంతుడు అని తెలియదు. ఆయన కేవలం సాధారణ మానవునిలా వ్యవహరిస్తున్నాడు. సాధారణ కాదు. అవసరము ఉన్నప్పుడు, ఆయన భగవంతుడని నిరూపించుకున్నాడు. కానీ సాధారణంగా ఆయన సాధారణ మానవునిగా పిలువబడ్డాడు.

అందువల్ల శుకదేవ గోస్వామి కృష్ణుని వివరిస్తున్నాడు ఆయన గోప బాలురితో ఆడుతున్నప్పటి వివరణలో. కృష్ణుని. కాబట్టి శుకదేవ గోస్వామి ఈ గోప బాలుడు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు? ఆయన చెప్పాడు: itthaṁ satām... sukhānubhūtyā ( SB 10.12.11) Satām. నిరాకారవాదులు, వారు నిరాకార బ్రహ్మణ్ పై ధ్యానం చేస్తున్నారు, కొంత ఆధ్యాత్మిక ఆనందం అనుభూతి పొందుతున్నారు. శుకదేవ గోస్వామి చెప్తున్నారు, ఆ ఆధ్యాత్మిక ఆనందము యొక్క మూలము ఇక్కడ ఉంది, కృష్ణుడు. Ahaṁ sarvasya prabhavaḥ ( BG 10.8) కృష్ణుడు ప్రతి దాని యొక్క మూలం. అందువల్ల నిరాకార వ్యక్తులు అనుభూతి పొందటానికి ప్రయత్నిస్తున్న ఆధ్యాత్మిక ఆనందం నిరాకార బ్రహ్మణ్ పై ధ్యానం చేస్తూ, శుకదేవ గోస్వామి చెప్తున్నారు: itthaṁ satāṁ brahma-sukhānubhūtyā ( SB 10.12.11) బ్రహ్మ-సుఖం, బ్రహ్మణ్ సాక్షాత్కారము యొక్క ఆధ్యాత్మిక ఆనందం. Dāsyaṁ gatānāṁ para-daivatena. ఇక్కడ బ్రహ్మ-సుఖ మరియు dāsyaṁ gatānāṁ para-daivatena యొక్క మూలమైన వ్యక్తి ఉన్నాడు. Dāsyaṁ gatānām అంటే భక్తులు. ఒక భక్తుడు ఎల్లప్పుడూ భగవంతునికి సేవ చేయటానికి సిద్ధముగా ఉంటాడు. Dāsyaṁ gatānāṁ para-daivatena. భగవంతునికి ,దేవాదిదేవునికి. ఇక్కడ బ్రహ్మ సుఖం యొక్క మూలం ఉన్నది, ఇక్కడ భగవంతుడు మొదటి వ్యక్తి ఉన్నాడు. ... māyāśritānāṁ nara-dārakeṇa. మాయ యొక్క ప్రభావము కింద ఉన్నవారు, వారికి ఆయన సాధారణ బాలుడు. అందువలన ఆయన, భావన ప్రకారం, ye yathā māṁ prapadyante ( BG 4.11)