TE/Prabhupada 0931 - ఒక వ్యక్తి జన్మించకపోతే, ఎలామరణించగలడు మరణం యొక్క ప్రశ్నే లేదు
730424 - Lecture SB 01.08.32 - Los Angeles
ఒక వ్యక్తి జన్మించకపోతే, ఎలా మరణించగలడు? మరణం యొక్క ప్రశ్నే లేదు ఎందుకంటే మనము కృష్ణుడిలో భాగము. కృష్ణుడు అజ . అజ అంటే అర్థం జన్మ మరణం లేదు అని కాబట్టి మనము కూడా అజ . లేకపోతే మనము ఎలా ఉండగలము? అయితే కృష్ణుడు, నేను కృష్ణుని యొక్క భాగం. ఇదే ఉదాహరణ మనము చూడవచ్చు. నా తండ్రి సంతోషంగా ఉంటే, నేను నా తండ్రి యొక్క కుమారుడిని. నేను ఎందుకు ఉండలేను, నేను దుఃఖముగా ఉంటానా? ఇది సహజ సారంశము. నేను నా తండ్రి ఆస్తిని ఆనందిస్తాను నా తండ్రి ఆనందిస్తున్నట్లు. అదేవిధముగా భగవంతుడు సర్వశక్తిమంతుడు. కృష్ణుడు సర్వశక్తిమంతుడు, అందరిలో కల్ల అందమైనవాడు, సంపూర్ణ జ్ఞానము కలవాడు, ప్రతిదీ సంపూర్ణము. నేను సంపూర్ణము కాకపోవచ్చు, కానీ నేను ఆయనలో భాగం కనుక, కావున నేను అన్ని లక్షణాలు కలిగి ఉన్నాను, నేను భగవంతునిలో భాగము కనుక అది కాదు... కాబట్టి భగవంతుడు చనిపోడు. ఆయన అజ . కావున నేను కూడా చనిపోను. ఇది నా పరిస్థితి. ఇది భగవద్గీతలో వివరించబడింది: na jāyate na mriyate vā kadācit. ఆయన ఆత్మ గురించి వివరిస్తున్నప్పుడు, కృష్ణుడు ఇలా చెబుతాడు ఆత్మ ఎన్నటికీ జన్మించదు, na jāyate, na mriyate. ఒకవేళ జన్మించకపోతే, ఆయన ఎలా మరణించగలడు? మరణము అనే ప్రశ్నే లేదు. మరణం అనే విషయము జన్మ ఉన్న దానికి ఉంటుంది. ఒక వ్యక్తికి జన్మ లేక పోతే , మరణం అనే ప్రశ్నే లేదు. Na jāyate na mriyate vā. కాబట్టి మనము కృష్ణునిలో భాగం . కృష్ణుడు అజ అయినట్లు మనము కూడా అజ . అది మనకు తెలియదు. ఇది అజ్ఞానం. ఇది అజ్ఞానం.
వారు శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నారు, కానీ వారికి ప్రతి జీవి ఆత్మ అని వారికి తెలియదు. ఆయనకు జన్మ లేదు. ఆయనకు మరణం లేదు. ఆయన శాశ్వతమైన వాడు. Nityaḥ śāśvato 'yam, శాశ్వతమైనవాడు, purāṇḥ, అయితే పురాతనమైన వాడు అయినప్పటికీ, na hanyate. సారంశము: na hanyate hanyamāne śarīre ( BG 2.20) ఈ శరీరం యొక్క వినాశనం తరువాత ఆత్మ చనిపోదు. ఆయన మరొక శరీరాన్ని అంగీకరిస్తాడు. ఇది మన వ్యాధి. దీనిని భవ-రోగము అని అంటారు. భవ-రోగము అంటే భౌతిక వ్యాధి. కాబట్టి కృష్ణుడు, మహోన్నతమైన జీవి కనుక, nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13) కృష్ణుడు ఖచ్చితముగా మన వలె ఉన్నాడు. లేదా మనము కృష్ణుని అనుకరణ. వ్యత్యాసం ఏమిటంటే భగవంతుడు, కృష్ణుడు, అపరిమితమైనవాడు, మనం అణువు, మనము పరిమితమైన వారిమి ఇది తేడా. లేకపోతే, గుణాత్మకంగా, మనము కృష్ణుడి వంటి వారము. అందువల్ల కృష్ణుడికి ఏవైతే ప్రవృత్తులు ఉన్నాయో, మనము కూడా ఈ ప్రవృత్తులను కలిగి ఉన్నాము. ఇతర జాతి ని ప్రేమించే ప్రవృత్తిని కృష్ణుడు కలిగి ఉన్నాడు. అందువలన మనకు ఈ ప్రవృత్తి ఉంది, ఇతర లింగమును ప్రేమించడం. ప్రేమ ప్రారంభము రాధ కృష్ణులలో ఉంది, రాధా కృష్ణుల మధ్య శాశ్వతమైన ప్రేమ ఉంది.
కాబట్టి మనం కూడా శాశ్వతమైన ప్రేమను కోరుతున్నాము, కానీ మనకు భౌతిక సూత్రాల ద్వారా నియంత్రించ బడుతున్నందున , దానికి ఆటంకం కలుగుతుంది. దానికి అంతరాయం కలుగుతుంది. మనము ఈ అంతరాయం నుండి బయటపడితే, అప్పుడు కృష్ణుడు రాధారాణి వలె ప్రేమ వ్యవహారాలు మనము కూడా కలిగి ఉంటాము. కావున మన పని తిరిగి భగవత్ ధామమునకు తిరిగి వెళ్లడము, తిరిగి కృష్ణుడి దగ్గరకు తిరిగి వెళ్ళడము. కృష్ణుడి దగ్గరకు వెళుతున్నందున, కృష్ణుడు శాశ్వతమైన వాడు, మనకు శాశ్వతమైన శరీరము వస్తుంది. ఉదాహరణకు ఒక కార్యదర్శిగా లేదా అధ్యక్షుడు నిక్సన్ యొక్క సేవకునిగా అవ్వడము, ఆయన కూడా గొప్ప వ్యక్తి. ఆయన కూడా గొప్ప వ్యక్తి. ఎందుకనగా ఒక ప్రత్యేకమైన లక్షణము లేకపోతే, ఆయన అధ్యక్షుడు నిక్సన్ లేదా ఆయన కార్యదర్శి యొక్క వ్యక్తిగత సేవకుడుగా ఉండలేడు. ఇది సాధ్యం కాదు. సాధారణ మనిషి అధ్యక్షుడు నిక్సన్ యొక్క సేవకుడు లేదా కార్యదర్శిగా అవ్వలేడు. అదేవిధముగా తిరిగి ఇంటికి వెళ్ళటానికి, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళటము అంటే అర్థం మీరు అదే రకమైన శరీరాన్ని పొందుతారు, కృష్ణుడు కలిగి ఉన్నటువంటిది. మీరు అజ అవుతారు. Ajo nityaḥ śāśvato 'yam. ఇది వ్యాధి, మనము మన శరీరం మారుస్తున్నాము. కాబట్టి కృష్ణుడు అజ