TE/Prabhupada 0935 - జీవితము యొక్క వాస్తవ అవసరము ఆత్మ యొక్క సుఖములను అందించడము



730425 - Lecture SB 01.08.33 - Los Angeles


జీవితము యొక్క వాస్తవ అవసరము ఆత్మ యొక్క సుఖములను అందించడము కాబట్టి ఇది చెప్పబడింది... ఇప్పుడు ఆ శ్లోకమును వివరిస్తున్నాను. Dharmasya glānir bhavati. ఇది 'Dharmasya glānir , కర్తవ్యము యొక్క కాలుష్యం. ధర్మ అంటే కర్తవ్యము. ధర్మ అనేది ఒక రకమైన విశ్వాసము కాదు. ఆంగ్ల నిఘంటువు లో చెప్పబడింది: "ధర్మము అంటే విశ్వాసము." కాదు కాదు. ఇది కాదు. ధర్మ అంటే అర్థం స్వరూప కర్తవ్యము. అది ధర్మము. మీకు ఆత్మ యొక్క ఏ సమాచారం లేకపోతే, మీకు ఆత్మ యొక్క అవసరం ఏమిటో తెలియక పోతే, కేవలం మీరు జీవితం యొక్క భౌతిక అవసరాలు, శరీర సుఖము గురించి తీరిక లేకుండా ఉంటే... శరీర సుఖము మిమ్మల్ని రక్షించదు.

ఒక మనిషి చాలా సౌకర్యవంతముగా ఉన్నాడు అని అనుకుందాం. అంటే ఆయన చనిపోడు అని దీని అర్థమా? ఆయన చనిపోడా. కేవలం శారీరక సౌకర్యాలతో మీరు ఉండలేరు. బలవంతులదే మనుగడ. జీవితము కోసం పోరాటం. మనం శరీరం మీద శ్రద్ధ వహించినప్పుడు, అది dharmasya glāniḥ అని పిలుస్తారు, ఇది కలుషితమవుతుంది. శరీరం యొక్క అవసరము ఏమిటి అన్నది తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆత్మ యొక్క అవసరం ఏమిటి. ఆత్మ యొక్క వాస్తవమైన అవసరము ఆత్మ యొక్క సుఖాలను సరఫరా చేయడం. భౌతిక సర్దుబాటు ద్వారా ఆత్మను ఓదార్చవచ్చు. ఆత్మ వేరేది కనుక, ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారము ఇవ్వాలి. ఆ ఆధ్యాత్మిక ఆహారం ఈ కృష్ణ చైతన్యము. ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తే...

ఆహారం, ఒకరికి వ్యాధి ఉన్నప్పుడు, మీరు ఆయనకు ఆహారం మరియు ఔషధం ఇవ్వాలి. రెండు విషయాలు అవసరం. మీరు కేవలం ఔషధం ఇస్తే, ఏ ఆహారం లేకుండా, అది ఏ మాత్రము విజయవంతం కాదు. రెండు విషయాలు ఉండాలి. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఆహారం ఇవ్వడం కోసం ఉద్దేశించబడింది, అంటే ఆత్మకు ఆహారము మరియు ఔషధం అని అర్థం. ఈ ఔషధం హరే కృష్ణ మహా -మంత్రం. Bhavauṣadhāc chrotra-mano-'bhirāmāt ka uttamaśloka-guṇānuvādāt pumān virajyeta vinā paśughnāt ( SB 10.1.4) పరీక్షిత్ మహారాజుకు శుకదేవ గోస్వామి చెప్పినారు, నాకు ఇవ్వడానికి మీరు సిద్ధమైన ఈ భాగవతము చర్చ, ఇది సాధారణ విషయము కాదు. Nivṛtta-tarṣair upagīyamānāt. ఈ భాగవతము చర్చను nivṛtta-tṛṣṇā ఆనందిస్తారు. Tṛṣṇā, తృష్ణ అంటే కాంక్ష. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అకాంక్షిస్తున్నారు. అకాంక్షిస్తున్నారు. కాబట్టి ఈ అకాంక్షించడము నుండి విముక్తి పొందేవారు, ఆయన భాగవతమును రుచి చూడగలడు, అది ఎంత అద్భుతంగా ఉందో. ఇది అటువంటి విషయము. Nivṛtta-tarṣaiḥ... అదేవిధముగా భాగవతము అంటే కూడా, హరే కృష్ణ మంత్రము భాగవతము కూడా. Bhagavata అంటే భగవంతునితో సంబంధం కలిగినది ఏదైనా అని అర్థం. దీనిని భాగవతము అని పిలుస్తారు. భగవంతుడిని భగవాన్ అని పిలుస్తారు. Bhāgavata-śabda, ఆయనతో సంబంధము ఉన్నది, ఏదైనా, ఆ bhāgavata-śabda ను bhāgavata-śabda గా మారుస్తుంది. కాబట్టి పరిక్షిత్ మహా రాజ చెప్పుతున్నారు భాగవతము యొక్క రుచి భౌతిక కోరికల పట్ల తన కాంక్షను పూర్తి చేసుకున్న వ్యక్తి అనందించ గలడు Nivṛtta-tarṣair upagīyamānāt. అది ఏమిటి మరియు ఎందుకు అటువంటి విషయమును రుచి చూడాలి? భవౌషధి . భవౌషధి. మన వ్యాధి, జన్మ మరియు మరణం కోసం ఔషధం భవౌషధి . భవౌ అంటే "అవ్వడము"