TE/Prabhupada 0952 - భగవంతుని చైతన్యము యొక్క లక్షణం ఆయన అన్ని భౌతిక కార్యక్రమాలకు విముఖత కలగి ఉంటాడు



740700 - Garden Conversation - New Vrindaban, USA


భగవంతుని చైతన్యం యొక్క లక్షణం అతను అన్ని భౌతిక కార్యక్రమాలకు ప్రతికూలంగా ఉంటాడు.

అతిథి: మీ శిష్యులు ఇప్పుడు క్రిమినల్ కోర్టులలో ఉండటం గురించి మనము ఆందోళన చెందాలని నేను అనుకోను, మనము చెందాలా? మనము దాని గురించి ఆందోళన చెందనవసరం లేదు. మీరు ఇక్కడ మంచి అనుచరులు కలిగి ఉన్నారు.

ప్రభుపాద: అవును.

అతిథి: ఈ సంఘం, ఉత్తమ సంఘం.

ప్రభుపాద: అవును.

అతిథి: మంచి వ్యక్తులు. (విరామం)

ప్రభుపాద: ఒక న్యాయాధికారి లేదా ఒక న్యాయవాది ఇప్పటికే గ్రాడ్యుయేట్. ఆయన ఒక న్యాయవాది అయితే తన గ్రాడ్యుయేట్ పరీక్షలో ఉత్తీర్ణుడు అయినాడని అర్థం చేసుకోవాలి. అదేవిధముగా, ఒకరు వైష్ణవుడు అయి ఉంటే ఆయన ఇప్పటికే ఒక బ్రాహ్మణుడు అయ్యాడని అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగా అర్థమైనదా? ఎందుకు మేము మీకు పవిత్రమైన జంధ్యము ఇస్తున్నాము? అంటే అది బ్రాహ్మణుని ప్రమాణాము. ఒకరు బ్రాహ్మణుడు అయితే తప్ప వైష్ణవుడు కాలేడు. ఉదాహరణకు ఒకరు గ్రాడ్యుయేట్ అయితే తప్ప, ఆయన న్యాయవాది కాలేడు. కాబట్టి ఒక న్యాయవాది అంటే, ఆయన ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడయ్యాడు, అదేవిధముగా ఒక వైష్ణవుడు అంటే ఆయన ఇప్పటికే ఒక బ్రాహ్మణుడు అని అర్థం.

భక్తుడు: కాబట్టి ఈ విధంగా వైష్ణవులు, వారు అందరూ ఉన్నారు, రజో గుణము తమో గుణము యొక్క కాలుష్యం ఉండకూడదు. అందువల్ల వారు ఉండాలి, వారు ఆ స్థితి మీద ఉండాలి...

ప్రభుపాద: అవును, వైష్ణవ అనగా, భక్తి అనగా, bhaktiḥ pareśānubhavo viraktir anyatra syat ( SB 11.2.42) భక్తి అంటే భగవంతుని చైతన్యమును అర్ధము చేసుకొనుట అని అర్థం. భగవంతుని చైతన్యము యొక్క లక్షణం ఏమిటంటే ఆయన అన్ని భౌతిక కార్యక్రమాలకు విముఖత కలిగి ఉన్నాడు. ఆయనకు ఆసక్తి లేదు.

భక్తుడు: అందువల్ల బ్రాహ్మణునికి ఎటువంటి ఆసక్తి లేకపోయినా, నన్ను క్షమించండి, వైష్ణవునికి అటువంటి ఆసక్తి ఉండదు ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యులు లేదా శూద్రులు, కానీ ఆయన కొంత నిర్దిష్ట వృత్తిని తీసుకుంటాడు ...

ప్రభుపాద: అంటే, ఆయన వాస్తవమునకు ఉన్నత స్థానములో ఉన్నాడు. ఆయనకు ఆసక్తి లేదు. కానీ ఆయన ఎంత కాలము పవిత్రము కాడో, ఆయనకు ఆసక్తి ఉంటుంది. అందువల్ల ఆ ఆసక్తిని స్థిరముగా చేయాలి, లేదా, ఏమని పిలుస్తారు, బ్రాహ్మణుల, క్షత్రియుల ప్రకారం... సర్దుబాటు...

ఎందుకంటే, ఆ సమయంలో, ప్రజలు చాలా చెడ్డవారై ఉన్నారు, వారు భగవంతుణ్ణి అర్థం చేసుకోలేరు. అందువల్ల అతడు దానిని తీసుకున్నాడు "మొదటగా వారు పాపము చేయకుండా ఉండాలి. అప్పుడు ఒక రోజు వస్తుంది, ఆయన భగవంతుణ్ణి అర్థం చేసుకుంటాడు. ఏసు క్రీస్తు కూడా "నీవు చంపకూడదు" అని అన్నాడు. అయితే, ఆ సమయంలో ప్రజలు చంపేవారు. లేకపోతే అతడు ఇలా ఎందుకు అన్నాడు: "నీవు చంపకూడదు." ఎందుకు ఈ మొదటి ఆజ్ఞ? ఎందుకంటే అందరూ చంపేవాళ్లు . చాలా మంచి సమాజం కాదు. ఒక సమాజంలో నిరంతరం చంపడం, హత్య ఉంటే, అది చాలా మంచి సమాజమా? కావున ఆయన మొదట చంపకూడదని అడిగారు, మొదట వారు పాపము చేయకుండా ఉండేటట్లు ఉండాలి, అప్పుడు వారు భగవంతుడిని అర్థము చేసుకుంటారు. ఇక్కడ భగవద్గీత నిర్థారిస్తుంది: yeṣāṁ tv anta-gataṁ pāpaṁ ( BG 7.28) పూర్తిగా పాపము చేయని వ్యక్తి. కాబట్టి భగవంతుని చైతన్యము, పాపము చేయని వ్యక్తికి ఉద్దేశించబడింది. మీరు ఒకే సమయంలో పాపము చేస్తూ భగవంతుని చైతన్యముతో ఉండలేరు. అది మోసం. భగవంతుని -చైతన్యము గల వ్యక్తి అంటే ఆయన పాపం చేయడు. ఆయన పాప కార్యక్రమాల యొక్క అధికారపరిధిలో ఉండడు. అది భగవంతుని చైతన్యం. మీరు ఒకే సమయంలో పాపములు చేస్తూ భగవంతుని చైతన్యముతో ఉండలేరు. అది సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలను గురించి ఆలోచించడము, పరీక్ష చేసుకొనడము ద్వారా నేను భగవంతుని చైతన్యములో ఉన్నానా లేదా అని అర్థం చేసుకోవచ్చు. బాహ్య ధృవపత్రం కోసం అడుగనవసరం లేదు. నేను ఈ సూత్రాలపై స్థిరపడినట్లయితే: అక్రమ లైంగికత లేదు, మాంసం తినడం లేదు , జూదం లేదు , మత్తు లేదు... ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నట్లయితే, నేను ఆ స్థితిపై ఉన్నానా లేదా అని ఆయనే నిర్ణయించుకుంటాడు. ఉదాహరణకు మీరు ఆకలితో ఉన్నవారైతే, మీరు ఏదైనా తింటే అప్పుడు మీరు బలం మరియు సంతృప్తిని అనుభూతి చెందవచ్చు. బాహ్య ధృవపత్రం అవసరం లేదు. అదేవిధముగా, భగవంతుని చైతన్యము అంటే మీరు అన్ని పాపముల నుండి విముక్తి పొందారా లేదా అని అర్థం. అప్పుడు మీరు అవుతారు. భగవంతుని చైతన్యము గల ఒక వ్యక్తి ఏ పాపములు చేయుటకు ఆసక్తి కలిగి ఉండడు