TE/Prabhupada 0959 - భగవంతుడు కూడా ఈ వివక్షను కలిగి ఉన్నాడు. దుష్టులు ఉన్నారు
750624 - Conversation - Los Angeles
భగవంతుడు కూడా ఈ వివక్షను కలిగి ఉన్నాడు. దుష్టులు ఉన్నారు
ప్రభుపాద: ఇది శుకదేవ గోస్వామిచే సిఫారసు చేయబడుతుంది, అది ఈ కలి యుగములో ఉన్న చాలా తప్పులను నేను వర్ణించాను, కానీ ఒక అతిగొప్ప లాభం ఉంది. "అది ఏమిటి? అది ఒకరు కేవలం హరే కృష్ణ ని జపం చేయడము ద్వారా , అన్ని భౌతిక బంధనముల నుండి విముక్తి పొందుతారు. ఇది ఈ యుగం యొక్క ప్రత్యేక ప్రయోజనము.
డాక్టర్ వోల్ఫ్: మన సమయం యొక్క వాస్తవమైన యోగ అని పిలవచ్చా?
ప్రభుపాద: హమ్. అవును. ఇది భక్తి-యోగం. భక్తి-యోగం కీర్తన, జపము చేయడముతో ప్రారంభమవుతుంది. శ్రవణము కీర్తనం విష్ణో ( SB 7.5.23) మీరు మరింత కీర్తనం శ్రవణము చేయండి, మీరు పవిత్రముగా మారుతారు. నేను మీరు మీ దేశం యొక్క నాయకులు అనుకుంటున్నాను, మీరు ఈ ఉద్యమమును చాలా తీవ్రంగా తీసుకోవాలి అంగీకారం కొరకు తీసుకోండి. ఇది కష్టం కాదు. కీర్తన చేయడము. మీరు పాఠశాలలో కీర్తన చేయవచ్చు; మీరు కళాశాలలో కీర్తన చేయవచ్చు; మీరు ఫ్యాక్టరీలో కీర్తన చేయవచ్చు; మీరు వీధిలో కీర్తన చేయవచ్చు. అందుకు ప్రత్యేక అర్హత అవసరం లేదు. కానీ మనము ఈ జపమును ప్రవేశ పెడితే, మీరు గొప్ప ప్రయోజనమును పొందుతారు. అక్కడ నష్టం లేదు, కానీ గొప్ప లాభం ఉంది.
డాక్టర్ వోల్ఫ్: శ్రీల ప్రభుపాదా, మీకు తెలుసు కదా వారు జపమునకు, కీర్తన చేయడము ద్వారా వశీకరీంచుకుంటున్నామని వ్యతిరేకముగా వాదిస్తున్నారు. మనస్తత్వవేత్తలు అలా చేస్తారు.
ప్రభుపాద: ఇది మంచిది. బాగుంది. మీరు వశీకరీంచుకుంటే, అది... ఇప్పుడు డాక్టర్ జూదా మీరు మత్తు-బానిస హిప్పీలను వశీకరీంచుకోగలరని ఒప్పుకున్నాడు కృష్ణుని అవగాహన చేసుకొనుటకు నియుక్తులను చేయడము ఎంతో గొప్ప మహత్తర కార్యము. (నవ్వు) అవును.
డాక్టర్ వోల్ఫ్: ఇది వశీకరీంచుకుంట కాదు.
ప్రభుపాద: ఇది ఏమైనా కావచ్చు. డాక్టర్ జూదా ఒప్పుకున్నాడు. కాబట్టి మంచి కొరకు వశీకరీంచుకుంటే, దానిని ఎందుకు అంగీకరించరు? అది చెడ్డది అయితే అది మరొక విషయం. ఇది మంచి పని చేస్తే, ఎందుకు అంగీకరించరు? హమ్? మీరు ఏమనుకుంటున్నారు, ప్రొఫెసర్?
డాక్టర్ ఓర్ర్: నాకు ఎలా స్పందించాలో తెలియదు. నేను మీతో అంగీకరిస్తున్నాను. (నవ్వు)
ప్రభుపాద: ఇది మంచిది అయితే...అందరికీ మంచి చేసేదానిని అంగీకరించాలి.
డాక్టర్ ఓర్ర్: ఒక సమస్య ... మీరు చూడండి, నేను ఆశ్చర్యపోతున్నాను, మీకు అంత నమ్మకముగా ఎలా తెలుసు మంచి ఏదో అని , ముఖ్యంగా యుద్ధము గురించి వచ్చినప్పుడు.నేను మరికొంత భయపడే వాడిని, నేను అనుకుంటున్నాను, ఆ...
ప్రభుపాద: ఆ యుద్ధం ఏమిటి?
డాక్టర్ ఓర్ర్: సరే, మీరు చెప్తున్నారు, కొన్నిసార్లు యుద్ధం అవసరం. ఎప్పుడు... అని ఎలా నిర్ణయించాలో తెలుసుకోవడం ముఖ్యం అని నేను అనుకుంటున్నాను..
ప్రభుపాద: లేదు, కాదు, అవసరమైన విషయం అంటే మీరు ఈ భౌతిక ప్రపంచంలో అందరు సాధువులను ఊహించలేరు. దుష్టులు ఉన్నారు. కాబట్టి ఒక దుష్టుడు మీ మీద దాడి చేస్తే, పోరాడడం మరియు రక్షించుకోవడం మీ బాధ్యత కాదా?
డాక్టర్ ఓర్ర్: ఇది కావచ్చు, అయితే, అదీ నాలో చెడ్డ గుణాలు ఉండవచ్చు నేను ఇతర వ్యక్తులలో చెడ్డ గుణాలు ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటాను. (నవ్వు)
ప్రభుపాద: లేదు. భగవంతుడు కూడా ఈ వివక్షను కలిగి ఉన్నాడు ఆయన చెప్పారు, paritrāṇya sādhūnāṁ vināśāya ca dūrkṛtām ( BG 4.8) అక్కడ చెడు అంశాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు మనస్సులో అక్కడ మంచి గుణాలు, చెడు గుణాలు ఉంటే... కాబట్టి మనము భగవంతునిలో భాగం మరియు అంశ. మనకు అదే భావము కూడా ఉండాలి. మనము దానిని నివారించలేము.
జయతీర్థ: ఈ రోజుల్లో అది తొంభై-తొమ్మిది శాతం చెడు ఉన్నది. ఈ రోజుల్లో అది తొంభై-తొమ్మిది శాతం చెడు ఉన్నది. కాబట్టి యుద్ధాలు కేవలం ఇద్దరు దుష్టుల మధ్య ఉన్నాయి.
ప్రభుపాద: అవును.
జయతీర్థ: ఇప్పుడు అది వేరొక విషయం. ప్రభుపాద: కాబట్టి మీరు దుష్టుల మధ్య యుద్ధాన్ని ఆపలేరు. వారిని మంచిగా చేయండి. అప్పుడు మీరు నివారించవచ్చు. మీరు కుక్కల మధ్య పోరాటం ఆపలేరు. (నవ్వు) ఇది సాధ్యం కాదు. మీరు కుక్కల పోట్లాటను ఆపాలనుకుంటే, అది సాధ్యం కాదు. ఇది సాధ్యమేనా? అప్పుడు అది పనికిరాని ప్రయత్నం. మీరు మానవులను కుక్కలుగా ఉంచుతారు, మీరు పోరాటాలను నిలిపివేయాలని కోరుకుంటారు. అది సాధ్యం కాదు. ఆచరణాత్మకము కాదు