TE/Prabhupada 0965 - కృష్ణుడికి అంకితం అయిన వ్యక్తి యొక్క ఆశ్రయం తీసుకోవాలి



720000 - Lecture BG Introduction - Los Angeles


కృష్ణుడికి అంకితం అయిన వ్యక్తి యొక్క ఆశ్రయం తీసుకోవాలి మాయావాది తత్వవేత్త, వారు పరమ సత్యము నిరాకారము అని భావిస్తారు.

mayy āsakta-manāḥ pārtha
yogaṁ yuñjan mad-āśrayaḥ
asaṁśayaṁ samagraṁ māṁ
yathā jñāsyasi tac chṛṇu
(BG 7.1)

కృష్ణుడు అర్జునుడికి సలహా ఇస్తున్నాడు, "భగవంతుడు అంటే ఏమిటి?" భగవంతుడు అనే భావన, మనం ఎంత ఊహించుకున్నా, అది పరిపూర్ణంగా ఉండదు, ఎందుకంటే భగవంతుడు అపరిమితమైనవాడు, అంతటా వ్యాప్తి చెందినవాడు. మనము పరిమితం. అందువల్ల భగవంతుడు తనకు తాను భక్తునికి వెల్లడి అయితే తప్ప, భగవంతుడు అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందువలన, భగవంతుడే తనకు తానుగా, కృష్ణుడు, తన గురించి మాట్లాడుతున్నాడు. పద్ధతి ఏమిటంటే mayy āsakta-manāḥ ఒక్కరు కృష్ణుడి పట్ల అనుబంధం పెంచుకోవాలి. ఇప్పుడు మనం భౌతిక వస్తువుల పట్ల అనుబంధం కలిగి ఉన్నాము. మనం దానిని మళ్ళించవలసి ఉంటుంది. మన పరిస్థితి ఏమిటంటే మనం దేని మీద అయినా ఆసక్తి కలిగి ఉండాలి. అది సత్యము. కాబట్టి ఇప్పుడు, శరీర భావనలో, మనము ఈ శరీరము పట్ల ఆసక్తి కలిగి ఉన్నాము, ఈ శరీరంకు సంబంధించినది ఏదైనా, మనము ఆసక్తి కలిగి ఉన్నాము. ఉదాహరణకు నా భార్య మీద నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు? లక్షలాదిమంది స్త్రీలు, అందమైన స్త్రీలు ఉన్నారు. వారి పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదు. కానీ నా భార్య మీద నా ఆసక్తి, ఆమె చాలా అందంగా ఉండకపోయినా, అది వాస్తవం. ఎందుకు? నా శరీరంతో ఆమెకు సంబంధము ఉన్న కారణంగా. అదేవిధముగా, నా దేశము మీద నేను ఆసక్తి కలిగి ఉన్నాను, నా ఇంటి మీద, నాకు ఆసక్తి ఉంది, చాలా విషయాలు, ఎందుకంటే నేను ఈ శరీరాన్ని అని ఆలోచిస్తున్నాను, ఈ శరీరమునకు సంబంధించినది ఏదైనా, నేను నాది అని ఆలోచిస్తున్నాను. కాబట్టి ప్రస్తుతం, 'నా' మరియు 'నాది' అనే నా భావన తప్పు. కావున, కృష్ణుడి మీదకు ఆ అనుబంధాన్ని మనం మళ్ళిస్తే, అప్పుడు మనము కృష్ణుడు, లేదా భగవంతుని సంపూర్ణముగా అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు సూర్యుని వలె ఉంటాడు. సూర్యరశ్మి ఉన్నప్పుడు, సూర్యుడిని చూడవచ్చు, మిమ్మల్ని మీరు కూడా చూసుకోవచ్చు. సూర్యరశ్మి లేకుండా, రాత్రి చీకటిలో, మీరు సూర్యుడిని లేదా మిమ్మల్ని మీరే చూసుకోలేరు. అందువల్ల ఈ పద్ధతి mayy āsakta-manāḥ, కృష్ణ చైతన్యమును అభివృద్ధి చేసుకోవటము. Mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ.

ఇది యోగా. యోగ అంటే అనుసంధానము. Yogaṁ yuñjan... కృష్ణుడి సంబంధముతో ఆ యోగాను పాటించాలి. అందువల్ల అతడు చెప్పినాడు mad asraya. మద్ అంటే నేను లేదా నాది. ఆశ్రయ అంటే ఆశ్రయం తీసుకోవడం. కావున మీరు కృష్ణుడి లేదా కృష్ణుడి ప్రతినిధి యొక్క ఆశ్రయం తీసుకోండి. మనము కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలంటే అది సాధ్యం కాదు. ఎందుకనగా ప్రస్తుతం కృష్ణుడు ప్రస్తుతం లేడు. కానీ ఆయన ప్రతినిధి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతినిధి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. భక్తి-యోగా అభ్యాసం, కృష్ణుడిపై తన మనస్సుని కేంద్రీకరించడం. దీనిని కృష్ణ చైతన్యము అని పిలుస్తారు. ఒకరు కృష్ణుడికి అంకితం అయిన వ్యక్తి యొక్క ఆశ్రయం తీసుకోవాలి, ఆయన మార్గంలో, మనము సాధన చేయాలి కృష్ణ చైతన్యమును ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అప్పుడు కృష్ణుడు వ్యక్తమవుతాడు. వ్యక్తమవుట, వ్యక్తమవుట అనేది, కృష్ణుడిని ప్రత్యక్షంగా చూడడము అనేది పవిత్రమవటములో ఉంది