TE/Prabhupada 0973 - అతడు సూత్రాలను అనుసరిస్తే, అతడు తప్పకుండా భగవద్ధామమునకు వెళ్తాడు



730400 - Lecture BG 02.13 - New York


అతడు సూత్రాలను అనుసరిస్తే, అతడు తప్పకుండా భగవద్ధామమునకు వెళ్తాడు, భగవద్ధామమునకు తిరిగి వెళ్తాడు. ప్రభుపాద: కాబట్టి ఎవరు తెలివైనవాడు? భగవద్ధామమునకు, మన స్వస్థలమునకు, గ్రహానికి తిరిగి వెళ్లడం వలన లాభమేమిటి అని మీరు అడిగితే ఇది భగవద్గీతలో రూఢీగా చెప్పబడింది: మామ్ ఉపేత్యంతు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతమ్ నాప్నువంతి ( BG 8.15) మీరు నా దగ్గరకు వస్తే, మీరు మళ్ళీ ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించవలసిన అవసరం లేదు, ఏదైతే బాధాకరమైన పరిస్థితులతో నిండి వుందో, మీరు మీ ఆధ్యాత్మిక శరీరంతో ఉంటారు.”

కాబట్టి మన కృష్ణచైతన్య ఉద్యమం ఉద్దేశించబడింది, నేను చెప్పాలనుకుంటున్నది, అనుమతించటం, జీవులందరిని ప్రోత్సహించడం..... వాస్తవానికి, అది అందరికీ కాదు. అది చాలా కష్టము. కానీ ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును అంగీకరించినవారు, అతడు సూత్రాలను అనుసరిస్తే, అప్పుడు అతడు తప్పనిసరిగా ఇంటికి తిరిగి వెళ్తాడు, తిరిగి ఇంటికి, భగవద్ధామమునకు తిరిగి వెళ్తాడు. ఇది తప్పనిసరి. కానీ, మీరు మార్గం తప్పకుంటే, మాయ చేత ఆకర్షించబడితే, అది మీ కర్తవ్యం. కానీ మేము మీకు సమాచారము ఇస్తున్నాము: ఇది పద్ధతి ఒక సరళమైన పద్ధతి. హరేకృష్ణ - మహామంత్రం జపించండి, పవిత్రులు కండి, భౌతిక బంధనాల నుండి ఎల్లప్పుడూ విముక్తులై, తక్త్వా దేహం. మామ్ ఉపేత్యంతు. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి..... మీరు కేవలము కృష్ణుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, అప్పుడు తక్త్వా దేహం, ఈ శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత, మామేతి, "మీరు నా దగ్గరకు వస్తారు."

కాబట్టి ఇది మా తత్వము. ఇది చాలా సరళము. అంతా భగవద్గీతలో వివరించబడింది. మీరు అర్థం చేసుకుని ప్రపంచం మొత్తం యొక్క ప్రయోజనం కోసం ఈ తత్వాన్ని ప్రచారం చేయండి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు.

చాలా ధన్యవాదములు.

భక్తులు: జై, ప్రభుపాదకు అన్ని వందనాలు!