TE/Prabhupada 0975 - మనము చిన్న భగవంతుళ్ళము. చిన్న, నమూనా భగవంతుళ్ళము



730408 - Lecture BG 04.13 - New York


మనము చిన్న భగవంతుళ్ళము. చిన్న, నమూనా భగవంతుళ్ళము మనము ఆకాశంలో ఒక స్పుత్నిక్ను తేలేటట్లు చేయగలము, మనము చాలా కీర్తి తీసుకుంటాము, మనము చాలా గొప్ప శాస్త్రవేత్తలు అవుతాము. మనం భగవంతుని పట్టించుకోము. ఇది మూర్ఖత్వం. మూర్ఖుడు ఇలా చెబుతాడు. కానీ తెలివైన వ్యక్తి, భగవంతుడు ఆకాశం లో మిలియన్ల ట్రిలియన్ల లోకములు తేలేటట్లు చేయగలడు అని తెలుసుకుంటాడు, ఆ పోలికలో మనము ఏమి చేశాము? ఇది బుద్ధి. కాబట్టి మనము మన వైజ్ఞానిక జ్ఞానం వలన చాలా గర్వముగా ఉన్నాము, అందువలన, ప్రస్తుత సమయంలో, మనము భగవంతుని ఉనికి నిరాకరించాము. కొన్నిసార్లు మనము "నేను ఇప్పుడు భగవంతుడిని అయ్యాను" అని అంటాము. ఇవి మన మూర్ఖుపు ప్రకటనలు.

మీరు బుద్ధితో పోలిస్తే దేనికి పనికి రారు... ఆయన కూడా తెలివైనవాడు. మనము భగవంతుని యొక్క భాగం కనుక, మనము కేవలం మన గురించి అధ్యయనము చేసుకుంటే భగవంతుని గురించి అధ్యయనము చేయవచ్చు. సముద్రపు నీటి చుక్కను మీరు అధ్యయనం చేస్తే, మీరు రసాయనికంగా విశ్లేషించి ఉంటే, మీరు ఆ చుక్కలో చాలా రసాయనాలను పొందుతారు. కాబట్టి సముద్రం యొక్క కూర్పు ఏమిటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అదే కూర్పు. కానీ అధిక పరిమాణంలో. ఇది భగవంతునికి మనకు మధ్య ఉన్న తేడా. మనము చిన్న దేవుళ్ళము, చిన్న దేవుళ్ళము, చిన్న నమూనా దేవుళ్ళము. అందువలన, మనము చాలా గర్వంగా ఉన్నాము. కానీ మనము గర్వించకూడదు, ఎందుకంటే, మన లక్షణాలు అన్ని మనము భగవంతుని నుండి తీసుకున్నామని మనము తెలుసుకోవాలి. మనము భాగం కనుక. కాబట్టి వాస్తవానికి ఈ లక్షణాలు అన్ని భగవంతునిలో ఉన్నాయి.

అందువల్ల వేదాంత సూత్రం చెబుతుంది, పరమ సత్యము అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఏమిటి Athātho brahma-jijñāsā. మనము భగవంతుని గురించి విచారణ చేసినప్పుడు, సంపూర్ణ వాస్తవము గురించి, సమాధానము వెంటనే ఇవ్వబడింది: janmādy asya yataḥ ( SB 1.1.1) పరమ సత్యము అంటే ఎవరి నుండి ప్రతిదీ వస్తుంది, ప్రతిదీ వస్తుంది. కాబట్టి భగవంతుని నుండి ప్రతిదీ వస్తోంది. ఆయన అన్ని సరఫరాలకు మూలం. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? అసంఖ్యాక జీవులు ఉన్నాయి. Nityo nityānāṁ cetanaś cetanānāṁ (Kaṭha Upaniṣad 2.2.13). అది వేదముల సమాచారం. భగవంతుడు కూడా మనలాంటి జీవి, కానీ ఆయన ముఖ్య జీవి. మనము కూడా జీవి.

ఉదాహరణకు ఒక తండ్రి వలె. తండ్రి ఇరవై మంది పిల్లలను కలిగి ఉండవచ్చు. ఇరవై కొడుకులను. పూర్వం, వారు వంద మంది కుమారులను కలిగి ఉండేవారు. ఇప్పుడు తండ్రులు అలాంటి శక్తిని కలిగి లేరు. కానీ, ఐదు వేల సంవత్సరాల క్రితం వరకు, ధృతరాష్ట్ర మహారాజు వంద మంది కుమారులకు జన్మను ఇచ్చాడు. ఇప్పుడు మనం... మనము చెప్పాము, మన జనాభ అధికముగా ఉన్నది అని మనము చెప్తున్నాం. కానీ వాస్తవం కాదు. ప్రస్తుత సమయంలో, అధిక జనాభా ఉన్న సమస్య ఎక్కడ ఉంది? ఇప్పుడు మనలో ఎంత మంది వందల సంఖ్యలో పిల్లలకు జన్మనిస్తున్నారు? లేదు. ఎవరు లేరు అయితే గతంలో, ఒక తండ్రి వంద మందికి జన్మనివ్వగలిగే వాడు. కాబట్టి అధిక జనాభ సమస్య ఏమీ లేదు. అధిక జనాభా ఉన్నా కూడా, మనము వేదాల నుండి సమాచారాన్ని పొందుతాము: eko bahūnāṁ yo vidadhāti kāmān. ఆ ఒక్క జీవి, భగవంతుడు, ఆయన అసంఖ్యాకమైన జీవులను నిర్వహించగలడు