TE/Prabhupada 0983 - భౌతిక వ్యక్తులు, వారు వారి ఇంద్రియాలను నియంత్రించలేరు



720905 - Lecture SB 01.02.06 - New Vrindaban, USA


భౌతిక వ్యక్తులు, వారు వారి ఇంద్రియాలను నియంత్రించలేరు Teṣāṁ satata-yuktānāṁ bhajatāṁ prīti-pūrvakam, buddhi-yogaṁ dadāmi tam ( BG 10.10) నేను ఆయనకు బుద్ధిని ఇస్తాను అని కృష్ణుడు చెప్పారు. ఎవరికి? సతత-యుక్తానామ్, ఇరవై నాలుగు గంటలు నిమగ్నమై ఉన్నవారికి. ఏ విధముగా ఆయన నిమగ్నము అవుతాడు? భజతామ్, భజన, భక్తియుక్త సేవలో వినియోగించబడినవారు. ఏ విధమైన భక్తియుక్త సేవ? ప్రీతి- పూర్వకమ్, ప్రేమ మరియు భక్తితో. ప్రేమ మరియు భక్తితో భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉన్న వారు. ప్రేమ యొక్క లక్షణం ఏమిటి? లక్షణం, ప్రధాన లక్షణం, ప్రేమ యొక్క అతి ముఖ్యమైన లక్షణం, భక్తుడు తన భగవంతుని యొక్క పేరు, కీర్తి మొదలైనవి విస్తృతముగా వ్యాప్తి చెందాలని కోరుకుంటాడు. అతడు "నా ప్రభువు యొక్క నామము ప్రతి చోటా తెలియాలి" అని చూడాలని అనుకున్నాడు. ఇది ప్రేమ. నేను ఎవరినైనా ప్రేమిస్తే, నేను ఆతని కీర్తి అంతా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాలని కోరుకుంటాను. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెబుతాడు, na ca tasmāt manuṣyeṣu kaścit me priya-kṛttamaḥ, ఆయన మహిమలను గూర్చి ప్రచారము చేసే వారు ఎవరైనా, ఆ వ్యక్తి కంటే ఆయనకు ప్రియమైన వారు ఎవ్వరూ లేరు.

అంతా భగవద్గీతలో ఉంది, మీరు ఎలా ప్రేమిస్తారో, ప్రేమ యొక్క లక్షణాలు ఏమిటి, మీరు భగవంతుణ్ణి ఎలా సంతోషపెట్టగలరు, ఆయన మీతో ఎలా మాట్లాడగలరు, అన్నీ కూడా ఉన్నాయి. కానీ మీరు ప్రయోజనము పొందాలి. మనము భగవద్గీత చదువుతాము, కానీ భగవద్గీత చదవటము వలన నేను ఒక రాజకీయవేత్త అయ్యాను. కావున అది ఏ రకమైన చదవటము భగవద్గీతను? రాజకీయ నాయకుడు అక్కడ ఉన్నాడు, అయితే భగవద్గీత చదవటము యొక్క వాస్తవ ఉద్దేశం కృష్ణుని గురించి తెలుసుకోవటము. ఒకడు అయితే కృష్ణుడి (భక్తుడు) ఒకరికి కృష్ణుడు తెలిస్తే, ఆయనకు ప్రతిదీ తెలుసు. ఆయనకు రాజకీయాలు తెలుసు, ఆయనకు అర్థశాస్త్రం తెలుసు, ఆయనకు సైన్సు తెలుసు, ఆయనకు తత్వము తెలుసు, ఆయనకు ధర్మము తెలుసు, ఆయనకు సామాజిక శాస్త్రం, ప్రతిదీ తెలుసు. Tasmin vijñāte sarvam etaṁ vijñātaṁ bhavanti, అది వేదముల ఉత్తర్వు. మీరు కేవలం భగవంతుణ్ణి అర్థం చేసుకున్నట్లయితే, కృష్ణుడు, అప్పుడు మీకు ప్రతీది తెలుస్తుంది ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు buddhi-yogaṁ dadāmi tam. కృష్ణుడు మీకు లోపల నుండి తెలివితేటలు ఇచ్చినట్లయితే, ఎవరు అతన్ని మించి అద్బుతముగా చేయగలరు? ఎవరూ అతన్ని మించి అద్భుతముగా చేయలేరు. కానీ కృష్ణుడు మీకు జ్ఞానాన్ని ఇవ్వగలడు, ఎప్పుడైతే మీరు ఒక భక్తుడు లేదా కృష్ణుని ప్రేమికుడు అయితేనే. Teṣāṁ satata-yuktānāṁ bhajatāṁ prīti-pūrvakam, buddhi-yogaṁ dadāmi tam ( BG 10.10) అ బుద్ధి -యోగ ఏమిటి, బుద్ధి-యోగ ఉపయోగము ఏమిటి? ఆ బుద్ధి-యోగ లేదా భక్తి-యోగ, ఉపయోగము ఏమిటంటే yena mām upayānti te. అటువంటి బుద్ధి -యోగ, అటువంటి బుద్ధి ఆయనను భగవత్ ధామమునకు తిరిగి, భగవంతుడు దగ్గరకు తీసుకు వెళ్ళుతుంది అలాంటి బుద్ధి వలన ఆయన నరకమునకు వెళ్ళడు. అది భౌతిక బుద్ధి.

Adānta-gobhir viśatāṁ tamisram ( SB 7.5.30) అంతా భాగవతములో చర్చించబడినది. భౌతిక వ్యక్తికి, అదాంత -గోబి. అదాంత అంటే నియంత్రణలేని, నియంత్రించనివి. గో అంటే ఇంద్రియాలు అని అర్థం. భౌతిక వ్యక్తులు, వారు తమ ఇంద్రియాలను నియంత్రించలేరు. వారు ఇంద్రియాల యొక్క సేవకులు, గో దాస . గో అంటే ఇంద్రియాలు, దాస అంటే అర్థం సేవకుడు. కాబట్టి మీరు ఇంద్రియాలను నియంత్రించే స్థితికి వచ్చినప్పుడు, అప్పుడు మీరు గోస్వామి అవుతారు. అది గోస్వామి. గోస్వామి అంటే ఇంద్రియాలను నియంత్రించే వారు, ఎవరైతే ఇంద్రియాలను పూర్తిగా నియంత్రిస్తారో. స్వామి లేదా గోస్వామి. స్వామి అంటే కూడా అది, గోస్వామి కూడా అదే విషయము. సాధారణంగా adānta-gobhir viśatāṁ tamiśram. నియంత్రించని ఇంద్రియాలు, అవి వెళ్తున్నాయి. కృష్ణుడు వాటిని పంపుతున్నాడు అని కాదు. ఆయన తన సొంత మార్గం స్పష్టముగా చేసుకుంటున్నాడు, భగవత్ ధామమునకు తిరిగి, భగవంతుడు వైపు తిరిగి వెళ్ళడానికి, లేదా చీకటైన నరక ప్రాంతములోనికి దిగాజారిపోవడానికి. రెండు విషయాలు ఉన్నాయి, ఆ అవకాశం మానవ రూపంలో ఉంది. మీరు ఎంచుకోవచ్చు. కృష్ణుడు, ఆయన అర్జునుడిని ప్రశ్నించారు "మీ భ్రమ నశించినదా"