TE/Prabhupada 0985 - పరమ సత్యము గురించి విచారించుట కోసం మానవ జీవితము ప్రత్యేకంగా ఉద్దేశించబడింది



720905 - Lecture SB 01.02.07 - New Vrindaban, USA


పరమ సత్యము గురించి విచారించుట కోసం మానవ జీవితము ప్రత్యేకంగా ఉద్దేశించబడింది ఇప్పుడు ఈ జీవితం, మానవ జన్మ, ముఖ్యంగా సంపూర్ణ సత్యాన్ని గురించి విచారణ కోసం ఉద్దేశించబడింది. జంతు జీవితంలో మనం చేయలేము. పెద్ద, పెద్ద జంతువులు, పులులు సింహాలు ఏనుగులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు, అవి కూడా జీవులు. సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలం చేపలు చాలా పెద్దవి గా ఉంటాయి. గొప్ప, గొప్ప పర్వతాలు. పర్వతాలు, వాటికి కూడా జీవము ఉంది. కానీ అవి భగవంతుని గురించి విచారించలేవు, ఇది సాధ్యం కాదు. మీరు ఈ మానవ రూపంలో భగవంతుని గురించి ప్రశ్నించవచ్చు, అంతే . అందువలన ఏ నాగరిక సమాజంలో అయినా, భగవంతుని గురించి విచారణ ఉంది, దానిని ధర్మము అని పిలుస్తారు . ఒకరు అయి ఉండవచ్చు లేదా వివధ స్థాయిలలో వ్యత్యాసము ఉండవచ్చు. ఉదాహరణకు భారతదేశంలో వలె, వారు కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ప్రస్తుత క్షణం కాదు. వారు వదిలేసారు. కానీ వందల మరియు వేల సంవత్సరాల క్రితం వరకు. వేల కాదు. రెండు వందల సంవత్సరాల క్రితం కూడా, భగవంతుని గురించి విచారణ చేసే విషయములో భారతదేశము చాలా జిజ్ఞాస కలిగి ఉంది. ఒక చైనీస్ పెద్ద మనిషి కూడా , ఆయన ఒక పుస్తకం, తాత్విక, రాశారు - అది సిఫార్సు చేయబడినది నేను పేరు, పుస్తకము పేరును మర్చిపోయాను - ఇది న్యూయార్క్ యూనివర్సిటీలో మతము తరగతి లో చదువుతారు. ఆ పుస్తకంలో ఆయన మీరు భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు ధర్మము గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు భారతదేశమునకు వెళ్లాలి. అవును, అది సత్యము. ఏ ఇతర దేశం లో , గొప్ప ఋషులు సాధువులు భగవంతుని అర్థం చేసుకోవడములో చాలా తీవ్రముగా పాల్గొనలేదు అందువలన వేదాంత-సూత్రం ఉంది.

కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి అని మనము తెలుసుకోవాలి. భగవంతుడు వేరుగా లేడు. భగవంతునికి ఏ పోటీ ఉండదు. Mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañjaya ( BG 7.7) భగవంతుడు కంటే ఉన్నతమైన సత్యం ఉండదు. అందువలన భగవంతుని గొప్ప వాడు అని పిలుస్తారు. భగవంతుడు సంపూర్ణము అని పిలువబడ్డాడు. కాబట్టి ధర్మము అంటే అర్థం, మొదటి తరగతి ధర్మము అంటే అర్థం, అనుచరులు భగవంతుని అవగాహనను ఎలా అభివృద్ధి చేసుకున్నారు. ఇది మొదటి తరగతి ధర్మము. అంతే కాని ఎన్ని జంతువులు మనము బలి ఇచ్చాము లేదా ఎన్ని సార్లు మనము చేయవచ్చు... చాలా ఆచారాలు మరియు అనేక ఇతర విషయాలు ఉన్నాయి ధర్మములో. కానీ, మనము ఇది ఫలితం ద్వారా పరీక్షించవలసి ఉంటుంది, phalena paricīyate. ప్రతిదీ... మనము చాలా అధ్యయనం చేసినట్లుగానే, ఒక శాస్త్రీయ వ్యక్తి, కానీ పరీక్ష ఉంది. ఒకవేళ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లయితే, అతడు చక్కగా అధ్యయనం చేశాడని అర్థం చేసుకోవచ్చు. ఇది మన సాధారణ లౌకిక జ్ఞానము, పాఠాశాలలో, కళాశాలలో, ప్రతిచోటా. నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక పోతే మరియు నేను ప్రచారం చేసుకుంటే, ఓ, నేను దీనిని అధ్యయనం చేసాను, నేను దానిని అధ్యయనం చేశాను, దానికి విలువ ఏమిటి? ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యాపారము చేస్తున్నాడు అనుకుందాం. మనము వ్యాపారము చేయడం ద్వారా ఆయన కొంత డబ్బు సంపాదించాడని, అతడు ధనవంతుడు అయ్యాడు అని చూస్తే ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త అని మనము అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన ఉంటే, ఆయన పేదవాడు అయితే, ఆయన చెప్తాడు, నేను ఇలా చేశాను, నేను దానిని చేశాను, నేను దాన్ని చేశాను, మీరు అలా చెప్పవచ్చు కానీ మనము ఫలితము ద్వారా తెలుసుకుంటాము. Phalena paricīyate. ఇది ఒక సంస్కృతము లోనిది కానీ మనము ఫలితము చూసి, అర్థం చేసుకోవాలి, మీకు వచ్చిన ఫలితం ఏమిటి. మీ పరీక్ష పేపర్ ప్రకారము మీకు ఎన్ని మార్క్ లు వచ్చాయి. అదేవిధముగా మనం చాలా ధర్మాధికారి, గొప్ప ధర్మాధికారి అని చెప్పుకోవచ్చు, గొప్ప ధర్మము యొక్క అనుచరుడు, కానీ ఇది ఏమిటి? ఏమిటి...? ఎలా మీరు భగవంతుని చైతన్యము యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారు, భగవంతుని ప్రేమించడములో మీరు ఎంత నేర్చుకున్నారు