TE/Prabhupada 0991 - యుగళ - ప్రీతి: రాధా కృష్ణుల మధ్య ప్రేమ వ్యవహారాలు
740724 - Lecture SB 01.02.20 - New York
యుగళ - ప్రీతి: రాధా కృష్ణుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉదహరణకు గోపికల వలె, వారు అత్యున్నతమైన భక్తులు, వారి ఏకైక కర్తవ్యము కృష్ణుడిని ఆనందింప చేయడము. అంతే. అందువలన చైతన్య మహా ప్రభు సిఫార్సు చేసారు, ramyā kācidupāsanā vraja-vadhū-vargeṇa yā kalpitā (Caitanya-manjusa). గోపికలు స్వీకరించిన పద్ధతి కంటే ఉన్నతమైన ఆరాధన పద్ధతి ఉండదు. వారు ఏమీ పట్టించుకోలేదు. గోపికలు, వారిలో కొందరు గృహ వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు, కొందరు భర్తతో మాట్లాడుతున్నారు, వారిలో కొందరు పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నారు, కొందరు కొంత పాలను మరగపెడుతున్నారు. కృష్ణుడి వేణువు అక్కడ వినిపించినప్పుడల్లా ప్రతిదీ మధ్యలో విడిచిపెట్టేసేవారు. "మీరు ఎక్కడకి వెళ్తున్నారు?" భర్త, సోదరుడు, తండ్రి: "మీరు ఎక్కడకు వెళ్తున్నారు?" "లేదు, శ్రద్ధ తీసుకోలేదు. కృష్ణుడి వేణువు అక్కడ వినిపిస్తుంది ; మాకు ఏమీ తెలియదు.: ఇది భక్తి, అత్యధిక, ఉన్నతమైన. చైతన్య మహాప్రభు... చైతన్య మహాప్రభు చాలా కఠినంగా ఉన్నారు ఒక మహిళ ఆయనని ఆరాధించటానికి చాలా సమీపంలోకి రాలేక పోయింది. కొంత దూరం నుండి. చైతన్య మహా ప్రభు, ఒక సన్యాసిగా, ఆయన చాలా కఠినంగా ఉన్నాడు. వాస్తవానికి, అది సూత్రం అయి ఉండాలి, కానీ ముఖ్యంగా మీ దేశంలో, ఇది చాలా కఠినంగా పాటించలేరు. కానీ కనీసం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చైతన్య మహా ప్రభు చాలా కఠినంగా ఉండేవాడు - ఆయన కృష్ణుడి యొక్క గోపికల ప్రేమను కీర్తించే వారు.
కాబట్టి గోపికల ప్రేమ సాధారణ విషయము కాదు. ఇది ఆధ్యాత్మికము. లేకపోతే, చైతన్య మహా ప్రభు ఎలా ప్రశంసిస్తారు ? శుకదేవ గోస్వామి కృష్ణుడి-లీలని ఎలా ప్రశంసించారు? ఈ కృష్ణుడి-లీల సాధారణ విషయము కాదు. అది ఆధ్యాత్మికం. అందువల్ల భక్తి-యోగంలో దృఢంగా ఉంటే తప్ప, వారు కృష్ణుడితో గోపికల లీలలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకూడదు. అది ప్రమాదకరమైనది. నరోత్తమ దాస ఠాకురా, అతడు ఇలా చెప్పాడు,
- rūpa-raghunātha-pade hoibe ākuti
- kabe hāma bujhabo se jugala-pīriti
- (Lālasāmayī Prārthanā 4)
రాధా కృష్ణుల మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాలు. జుగళ, యుగళ అంటే "జంట"; ప్రీతి అంటే "ప్రేమ." కాబట్టి నరోత్తమ దాస ఠాకురా, ఉన్నతమైన ఆచార్యులు, ఆయన చెప్పారు, నేను ఎప్పుడు అర్థం చేసుకోగలను? అంతే కానీ "నేను ప్రతిదీ అర్థం చేసుకున్నాను." కాదు. "నేను ప్రతిదీ అర్థం చేసుకున్నాను." ఇది బావుంది. ఇది విజ్ఞాన, bhagavat-tattva-vijñānaṁ. కాబట్టి మనము శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రము ఆధ్యాత్మిక గురువు యొక్క దయ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరా చెప్పినారు, yasya prasādād: మొదట మీ ఆధ్యాత్మిక గురువును సంతోష పెట్టడానికి ప్రయత్నించండి. అప్పుడు అర్థం చేసుకోండి.
కాబట్టి ఇది ఒక గొప్ప శాస్త్రం.
- Tad viddhi praṇipātena
- paripraśnena sevayā
- upadekṣyanti te jñānaṁ
- jñāninas tattva-darśinaḥ
- ( BG 4.34)
ఇది పద్ధతి. మొదట మీరు శరణాగతి పొందండి: అయ్యా, నేను మీకు శరణాగతి పొందుతాను" అయితే సరే." "ఇప్పుడు నాకు ఇష్టం లేదు." ఇది ఏమిటి? ఈ శరణాగతి ఏమిటి, "ఇప్పుడు నాకు ఇది ఇష్టం లేదు"? అంటే శరణాగతి లేదని అర్థం. శరణాగతి అంటే ఇది కాదు, "ఇప్పుడు నేను శరణాగతి పొందుతాను, మీరు నన్ను సంతోష పరచకపోతే, మీరు నా ఇంద్రియాలను సంతృప్తిపరచకపోతే, అప్పుడు నాకు ఇష్టం లేదు." ఇది శరణాగతి పొందుట కాదు. శరణాగతి, ఉదాహరణకి భక్తివినోద ఠాకురా చే ఇవ్వబడినది: కుక్క. చాలా మంచి ఉదాహరణ. కుక్క పూర్తిగా యజమానికి శరణాగతి పొందుతుంది యజమాని దానిని చంపినా కూడా, అది నిరసన వ్యక్తము చేయదు. ఇది ఉదాహరణ.
- Vaiṣṇava ṭhākura, tomāra kukkura
- bhuliyā jānaha more.
" Vaiṣṇava ṭhākura, నా ప్రియమైన నా ఆధ్యాత్మిక గురు దేవా, మీరు వైష్ణవులలో ఉత్తమమైనవారు. దయచేసి మీ కుక్కగా నన్ను అంగీకరించండి. "అది శరణాగతి పొందుట.
వాస్తవమైన శరణాగతి పొందుట మొదలవుతుంది,
- mayy āsakta-manāḥ pārtha
- yogaṁ yuñjan mad-āśrayaḥ
- ( BG 7.1)
Āśrayah. Āśraya loiyā bhaje kṛṣṇa tāre nāhi tyāje (Narottama dāsa Ṭhākura). ఆధ్యాత్మిక గురువు ఆశ్రయం తీసుకొని, భక్తియుక్త సేవలను నిర్వర్తిస్తున్నవాడిని, కృష్ణుడు ఎప్పుడూ అతనిని విడచి పెట్టడు. ఆయన అతనిని అంగీకరిస్తారు. Āśraya loiyā bhaje kṛṣṇa tāre nāhi tyāge āra saba more akaraṇa(?). ఇతరులు, వారు కేవలం వారి సమయం వృథా చేస్తున్నారు, అంతే. కాబట్టి ఇది భగవద్-భక్తి-యోగం. Ādau gurv-āśrayaṁ sad-dharma-pṛcchā, sādhu-mārga-anugamanam (Brs. 1.1.74).