TE/Prabhupada 1001 - అందరి హృదయాలలో కృష్ణ చైతన్యము నిద్రాణమై ఉన్నది



750713 - Conversation B - Philadelphia


అందరి హృదయంలో కృష్ణ చైతన్యము నిద్రాణమై ఉన్నది

శాండీ నిక్సన్: నాకు ప్రశ్నలు ఉన్నాయి ... నేను అన్నింటిని కలిపి ఒక పుస్తకము తయారు చేస్తాను అమెరికన్లను ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక గురువుల మీద లేదా నేడు ప్రభావితం చేస్తున్న వారి గురించి అలాగే ఒక చిన్న వ్యాసంలో, నేను ఈ విషయమును కలిపి రాయాలనుకుంటున్నాను న్యూయార్క్ టైమ్స్ మాగజైన్ కోసం చాలా ముఖ్యమైన వారిని కొంతమంది గురించి నేను ఉన్నత చైతన్యమును అన్వేషించే వారి గురించి ఒక ఫిలడెల్ఫియా పత్రిక కోసం ఒక వ్యాసం రాస్తున్నాను. మన పుస్తకంలో ముఖ్యంగా, ఈ ప్రశ్నలతో ప్రజలకు కృష్ణ చైతన్యము అంటే ఏమిటో తెలుసుకునేందుకు వీలు కల్పించాను. కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలను అడుగుతాను, చాలా వరకు నేనే వాటికి సమాధానం చెప్పగలను, లేదా ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానము ఉన్నది కావచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను నాకు తెలియనట్లు ... నేను తెలివితక్కువ వాడిని అని అనిపించవచ్చు. కానీ నేను దీనిని చేయబోతున్నాను.

మొదటి ప్రశ్న చాలా పెద్దదిగా ఉంటుంది ... నా దగ్గర పదిహేను ప్రశ్నలు ఉన్నాయి. నాకు అన్నిటికి మీరు సమాధానము ఇస్తే, నేను చాలా ఆనందిస్తాను మొదటిది చాలా ప్రాథమికం: కృష్ణ చైతన్యము అంటే ఏమిటి ఏమిటి?

ప్రభుపాద: కృష్ణుడు అంటే భగవంతుడు, మనమందరం కృష్ణుడితో భగవంతుడితో సంబంధము కలిగి ఉన్నాము. భగవంతుడు వాస్తవ తండ్రి. అందువల్ల మనకు కృష్ణుడితో సన్నిహిత సంబంధము ఉన్నది. కానీ మనం మరచిపోయాము, కృష్ణుడు అంటే ఏమిటి, ఆయనతో నా సంబంధము ఏమిటి, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి. ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఎవరైనా అలాంటి ప్రశ్నలకు ఆసక్తి కనబరిస్తే, ఆయనను కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి అని పిలుస్తాము.

శాండీ నిక్సన్: ఎలా కృష్ణ చైతన్యము అభివృద్ధి చెందుతుంది?

ప్రభుపాద: కృష్ణ చైతన్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది, కానీ ఒక వ్యక్తి యొక్క భౌతిక పరిస్థితుల కారణంగా, ఆయన దానిని మరచిపోయాడు. కాబట్టి హరే కృష్ణ మహా మంత్రం జపించే ఈ పద్ధతి అంటే ఆ చైతన్యాన్ని పునరుద్ధరించడానికి ఉంది ఇది ఇప్పటికే ఉంది. కేవలం కొన్ని రోజుల క్రితం ఈ అమెరికన్, యూరోపియన్ అబ్బాయిలు అమ్మాయిల వలె, వారికీ కృష్ణుడు ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు మీరు నిన్న చూసారు వారు మొత్తం ఎలా... ఆ ఊరేగింపు, మొత్తం ఊరేగింపు అంతటా, వారు ఎలా పారవశ్యంలో కీర్తన మరియు నృత్యం చేశారో. కాబట్టి మీరు అది కృత్రిమమైనదని అని అనుకుంటున్నారా? లేదు కృత్రిమంగా ఎవరూ గంటల కొద్ది కీర్తన మరియు నృత్యం చేయలేరు. అంటే కృష్ణ చైతన్యము జాగృతం అయింది. ఇది ఉంది; ప్రామాణికమైన పద్ధతి ద్వారా, ఇది ఇప్పుడు జాగృతం చేయబడింది. ఇది వివరించబడింది,

nitya-siddha kṛṣṇa-bhakti sadhya kabhu naya
śravaṇādi-śuddha-citte karaye udaya
(CC Madhya 22.107)

అందరి హృదయాలలో కృష్ణ చైతన్యము నిద్రాణమై ఉన్నది. అందువలన ఆయన భక్తుల సాంగత్యములోనికి వచ్చినప్పుడు, అది జాగృతం అవుతుంది ఒక యువతి లేదా యువకుడు ఆకర్షించబడాలని కోరుకుంటాడు, అది బాలునిలో ఉంది. ఆ చిన్న బిడ్డలో, అది ఉంది. అతడు యువకుడు అయినప్పుడు , అది జాగృతం అవుతుంది అది కృత్రిమమైన విషయము కాదు. సాంగత్యములో అది జాగృతం అవుతుంది. శక్తి ఇప్పటికే ఉంది, కానీ మంచి సాంగత్యములో, కృష్ణుడి గురించి విన్నపుడు, కృష్ణ చైతన్యము యొక్క స్థితికి జాగృతం ఆవుతాడు.

శాండీ నిక్సన్: కృష్ణ చైతన్యము మరియు క్రీస్తు చైతన్యం మధ్య తేడా ఏమిటి?

ప్రభుపాద: క్రీస్తు చైతన్యము కూడా కృష్ణ చైతన్యము, కానీ ప్రజలు క్రిస్టియన్ల నియమాలను మరియు నిబంధనలను పాటించరు. అందువలన వారు జాగృతం కారు. క్రీస్తు ఆజ్ఞలను, వారు అనుసరించరు. అందువల్ల వారు ప్రామాణిక చైతన్యమునకు రాలేరు.

శాండీ నిక్సన్: ఇతర మతముల నుండి వేరు చేసే ప్రత్యేకత కృష్ణ చైతన్యములో ఏమి ఉంది ? ఇది ఒక మతమా?

ప్రభుపాద: మతము అంటే ప్రధానంగా దేవుణ్ణి తెలుసుకొని ఆయనను ప్రేమించడము. అది మతము. ఎవరికీ దేవుడు అంటే తెలియదు, ఆయనను ప్రేమించడము గురించి ఏమి మాట్లాడతాము. ఎవ్వరూ శిక్షణ పొందలేదు, దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చో, ఆయనను ఎలా ప్రేమించాలనేది. వారు చర్చికి వెళ్ళడం ద్వారా సంతృప్తి చెందారు: ఓ ప్రభు, ,మాకు ఈ రోజు రొట్టె ఇవ్వండి. అది కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళరు. కావున కమ్యూనిస్టు ఇలా చెబుతున్నాడు, "మీరు చర్చికి వెళ్ళవద్దు, రొట్టెను మేము సరఫరా చేస్తాము." కాబట్టి పేద, అమాయక వ్యక్తులు, వారు రొట్టెను మరెక్కడో పొందుతారు, అందుచే వారు చర్చికి వెళ్ళరు. కానీ దేవుడు అంటే ఏమిటి మరియు ఆయనను ఎలా ప్రేమించాలనేది అర్థం చేసుకోవడాన్ని ఎవ్వరూ తీవ్రంగా తీసుకోరు. ఎవరూ తీవ్రముగా లేరు. అందువలన, భాగవతంలో ఇది మోసం చేసే మతము అని చెప్పబడింది. నేను ఏదో మతాన్ని గురించి ప్రచారము చేస్తాను , కానీ దేవుడు అంటే ఎవరు ఆయనను ఎలా ప్రేమించాలనేది నాకు తెలియదు. కాబట్టి ఈ రకమైన మతము మోసము చేసే మతము.

మతము అంటే దేవుడిని తెలుసుకోవడము మరియు ఆయనని ప్రేమించడము అని అర్థం. కానీ సాధారణంగా, ఒక వ్యక్తికి దేవుడు అంటే ఏమిటో తెలియదు, ఆయనను ప్రేమించటము గురించి ఏమి మాట్లాడతాము? కాబట్టి అది మోసం చేసే మతము.అది మతము కాదు. కానీ క్రైస్తవ మతము వరకు, దేవుడిని అవగాహన చేసుకునే అవకాశం చాలా ఉంది, కానీ వారు దానిని పట్టించుకోరు. ఉదాహరణకు, "నీవు చంపకూడదు" అని ఆజ్ఞ ఉంది. కానీ క్రైస్తవ ప్రపంచంలో, ఉత్తమ కబేళాలు నిర్వహించబడతాయి. కాబట్టి వారు ఎలా దేవుడి చైతన్యమును పొందగలరు? వారు ఆజ్ఞలకు అవిధేయులయ్యారు, ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన దానిని వారు పట్టించుకోరు. కాబట్టి ఇది క్రైస్తవ మతములో మాత్రమే కాదు. ప్రతి మతములో జరుగుతోంది. ఇది కేవలం రబ్బరు స్టాంప్: "నేను హిందూవుని," "నేను ముస్లింని," "నేను క్రైస్తవుడుని." దేవుడు అంటే ఎవరు మరియు ఆయనను ఎలా ప్రేమించాలనేది ఎవరికీ తెలియదు.