TE/Prabhupada 1015 - దాని వెనుక జీవశక్తి లేనట్లయితే అక్కడ ఏదీ కూడా సృష్టించబడదు
720200 - Lecture SB 01.01.01 - Los Angeles
దాని వెనుక జీవశక్తి లేనట్లయితే అక్కడ ఏదీ కూడా సృష్టించబడదు
- oṁ namo bhagavate vāsudevāya
- janmādy asya yato 'nvayād itarataś cārtheṣv abhijñaḥ svarāṭ
- tene brahma hṛdā ya ādi-kavaye muhyanti yat sūrayaḥ
- tejo-vāri-mṛdāṁ yathā vinimayo yatra tri-sargo 'mṛṣā
- dhāmnā svena sadā nirasta-kuhakaṁ satyaṁ paraṁ dhīmahi
- (SB 1.1.1)
శ్రీమద్ భాగవతమును రాయడానికి ముందు శ్రీల వ్యాసదేవుడు ఇచ్చిన ప్రార్ధన ఇది. భగవాన్ వాసుదేవునికి తన గౌరవప్రదమైన ప్రణామములు చేస్తున్నాడు. భగవతే అనగా భగవంతుడు, అయనను వాసుదేవ అని పిలుస్తారు ఆయన ఆవిర్భవించారు, భగవంతుడు కృష్ణుడు వసుదేవుని కుమారునిగా అవతరించారు. అందువలన ఆయనను వాసుదేవ అని పిలుస్తారు. ఇంకొక అర్థం ఆయన సర్వ వ్యాపకుడు. ఆయన అన్నిచోట్లా ఉంటాడు. కాబట్టి, వాసుదేవ, భగవంతుడు అన్నిటికి మూలం. Janmādy asya yatah. జన్మ' అంటే సృష్టి. ఈ భౌతిక ప్రపంచము యొక్క సృష్టి, విశ్వము వాసుదేవుని నుండి వస్తుంది. జన్మ-ఆది అంటే సృష్టి, నిర్వహణ మరియు వినాశనం. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ మూడు లక్షణాలను కలిగి ఉంటుంది. అది ఒక నిర్దిష్ట సమయమున సృష్టించబడుతుంది. అది కొన్ని సంవత్సరాలపాటు ఉనికిలో ఉంటుంది, తరువాత అది అంతమవుతుంది, నాశనమవుతుంది. దానిని janmādy asya-janmasthiti yah అంటారు
కాబట్టి ప్రతిదీ భగవంతుని నుండి జరుగుతోంది. ప్రపంచము కూడా ఆయన నుండి వెలువడుతోంది. ఇది ఆయన శక్తి, బాహ్య శక్తి మీద ఆధారపడి ఉంది, లేదా అది ఆయన బాహ్య శక్తి ద్వారా నిర్వహించబడుతుంది, మరియు, ప్రతిదీ అంతిమంగా చివరకు నశిస్తుంది, లేదా నాశనం అవుతుంది, కాబట్టి వినాశనం తరువాత శక్తి ఆయనలోకి విలీనం అవుతుంది. శక్తి, శక్తి ఆయన నుండి విస్తరించబడినది, ఆయన శక్తి ద్వారా నిర్వహించబడుతుంది, అది మళ్ళీ అంతమయినప్పుడు అది ఆయనలోకి విలీనం అవుతుంది. ఇది సృష్టించడము, నిర్వహించడము మరియు రద్దు చేయడము యొక్క మార్గం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మహోన్నతమైన శక్తి లేదా మహోన్నతమైన మూలం, ఆ మహోన్నతమైన మూలం యొక్క స్వభావం ఏమిటి? ఇది పదార్థమా లేదా జీవ శక్తినా? భాగవతము చెప్తుంది, "లేదు, అది పదార్థము కాదు." పదార్థము నుండి ఏదీ సహజముగా సృష్టించబడదు. మనకు అలాంటి అనుభవం లేదు. కొంత జీవశక్తి అక్కడ పదార్థము వెనుక లేకపోతే అక్కడ ఎటువంటి సృష్టి ఉండదు. మనకు అలాంటి అనుభవం లేదా. ఉదాహరణకు ఏదైనా భౌతికమైనది, మోటారు కారు అని అనుకుందాం. అది అన్ని యంత్రములను కలిగి ఉంది, సూక్ష్మమైన యంత్రాలను, కానీ ఇప్పటికీ మోటారు కారు సహజముగా కదలలేదు. డ్రైవర్ వుండి తీరాలి. డ్రైవర్ ఒక జీవ శక్తి. అందువల్ల, ప్రతిదాని యొక్క అసలు మూలము ఒక జీవ శక్తి అయి ఉండాలి. ఇది భాగవతము యొక్క తుది అభిప్రాయము.
మరియు ఎటువంటి జీవ శక్తి? అంటే ఆయనకు ప్రతిదీ తెలిసి ఉండాలి. ఉదాహరణకు ఒక నిపుణుడైన మోటార్ మెకానీక్ వలె, ఆయనకు ప్రతిదీ తెలుసు, అందువలన, ఆయన గుర్తించగలడు, మోటార్ కారు అగిపోయినప్పుడు, ఆయన వెంటనే మోటారు కారు ఎలా నిలచి పోయినదో గుర్తించగలడు. అందువలన ఆయన ఒక స్క్రూ గట్టిగా బిగిస్తే, లేదా ఏమైనా సరి చేస్తే అది మళ్ళీ పని చేయడము ప్రారంభిస్తుంది అందువల్ల భాగవతము చెప్తుంది, సృష్టించబడుచున్న అన్నింటి యొక్క మూలమునకు ప్రతిదీ తెలుస్తుంది. Anvayād itarataś cārtheṣu'. నేరుగా మరియు పరోక్షంగా. ఆయన నిపుణుడు. ఉదాహరణకు నేను ఈ శరీరం యొక్క సృష్టికర్తను. నేను జీవాత్మను. నేను కోరుకున్నట్లు, నేను ఈ శరీరాన్ని సృష్టించాను. శక్తి ద్వారా. నా శక్తి ద్వారా.