TE/Prabhupada 1031 - జీవులు అందరు, వారు దుస్తులచే భౌతికముగాకప్పబడి ఉన్నారు



740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne


జీవులు అందరు, వారు దుస్తులచే భౌతికముగా కప్పబడి ఉన్నారు కాబట్టి భగవంతుడు, లేదా మహోన్నతమైన సత్యము, పరమ వాస్తవము, ఎవరి నుండి అయితే ప్రతిదీ వస్తుందో. కాబట్టి ఇది శ్రీమద్-భాగవతం యొక్క ఆరంభం. Janmadi asya yataḥ, "ఎవరి నుండి అయితే ప్రతిదీ ఉనికిలోనికి వస్తుంది" సంపూర్ణ సత్యము నుండి ఇప్పుడు, పరమ సత్యము యొక్క స్వభావం ఏమిటి? అంతా అంటే అర్థం... రెండు విషయాలు ఉన్నాయి: పదార్థము మరియు ఆత్మ. రెండు విషయాలు. ఉదాహరణకు ఈ టేబుల్ పదార్థము మరియు మనము జీవులము, మనము ఆత్మ ఈ భౌతిక శరీరము నన్ను కప్పి ఉంది, ఉదాహరణకు దుస్తుల వలె మనలో ప్రతి ఒక్కరు దుస్తులు ధరించి ఉన్నాము, ఏదో ఒక రకమైన దుస్తులతో కప్పబడి ఉన్నాము. అదేవిధముగా, జీవులు అందరు, భౌతికముగా కప్పబడి ఉన్నారు . స్థూల దుస్తులు లేదా కోటు లేదా సూక్ష్మ దుస్తులు. స్థూల దుస్తులు ఐదు పదార్థాల అంశాల నుంచి తయారు చేయబడింది: భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం, సూక్ష్మ దుస్తులు మనస్సు, బుద్ధి అహంకారము

కాబట్టి మనము, ఆత్మ, భగవంతునిలో భాగం ప్రస్తుత క్షణంలో మనము రెండు రకాల దుస్తులతో కప్పబడి ఉన్నాము - సూక్ష్మ దుస్తులు: మనస్సు, బుద్ధి అహంకారము; స్థూల దుస్తులు ఈ విషయము మనకు తెలిసియున్నది, కానీ మనము చూడలేము. ఉదాహరణకు మీకు తెలిసినట్లుగానే నేను మనస్సును కలిగి ఉన్నాను; నాకు మీరు మనస్సును కలిగి ఉన్నారు అని నాకు తెలుసు, కానీ నేను మీ మనస్సును చూడలేను, మీరు నా మనస్సును చూడలేరు. నాకు తెలుసు మీకు బుద్ధి ఉంది అని, మీకు తెలుసు నేను బుద్ధిని కలిగి ఉన్నాను అని కానీ ఆ బుద్ధి ఏమిటి అనేది మనము చూడము. అదేవిధముగా, గుర్తింపు. నేను ఈ చైతన్యం... అది కూడా మీరు చైతన్యమును కలిగి ఉన్నారు, నేను చైతన్యము కలిగి ఉన్నాను, కానీ మనము చూడలేము. ఈ భౌతిక కళ్ళకు కనిపించని విషయాలు అవి సూక్ష్మము అని పిలువబడతాయి. ఆత్మ అంత కంటే సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి మానవ జీవితం మహోన్నతమైన ఆత్మను భగవంతునిగా అర్థం చేసుకోవడము కోసం ఉద్దేశించబడింది.